సిట్రోయెన్ సి3 లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా..?

ప్రముఖ ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) భారతీయ మార్కెట్లో తన రెండవ కారు అయిన 'సిట్రోయెన్ సి3' (Citroen C3) ని ఇడుదల చేయడానికి సన్నద్దమౌతోందన్న సంగతి అందరికి తెలిసిందే. కావున ఈ కొత్త కారు త్వరలోనే దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించబడ్డాయి. భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కొత్త 'సిట్రోయెన్ సి3' (Citroen C3) గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

సిట్రోయెన్ సి3 లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా..?

'సిట్రోయెన్ సి3' (Citroen C3) అనేది భారతదేశంలో ఉత్పత్తి కానున్న మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్. భారతదేశంలో ఉత్పత్తి కానున్న సిట్రోయెన్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి కూడా ఇదే. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త కారుని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 21,000 అడ్వాన్స్ చెల్లింది బుక్ చేసుకోవచ్చు. ఇది 2022 జులై నెలలో మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

సిట్రోయెన్ సి3 లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా..?

సిట్రోయెన్ సి3 ఇప్పటికే భారతీయ రోడ్లపైన టెస్టింగ్ చేస్తూ చాలా సార్లు కనిపించింది. కావున దీని డిజైన్ మరియు ఇతర వివరాలు కొంత వెల్లడయ్యాయి. అయితే ధర మాత్రం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా ప్రకటిస్తుంది.

సిట్రోయెన్ సి3 లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా..?

సిట్రోయెన్ సి3 అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన డిజైన్ పొందుతుంది. ఇది ఇప్పుడు డ్యూయల్ టోన్ రూఫ్ టాప్‌ కలిగి ఉందని తెలిసింది. సి3 కారు ఆరెంజ్ కలర్ రూఫ్ టాప్‌ కలిగి మిగిలిన బాడీ మొత్తం వేరే కలర్ లో ఉంది. కావున చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కంపెనీ భారతదేశంలో మొదటి సారిగా ఈ కలర్ లో ప్రవేశపెట్టడం జరుగుతోంది. సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

సిట్రోయెన్ సి3 లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా..?

సిట్రోయెన్ సి3 కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (CMP) పై నిర్మించబడుదుతోంది. ఈ డిజైన్ ప్లాట్‌ఫారమ్ భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మరింత సరసమైనదిగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కావున దీని ధర కూడా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది.

సిట్రోయెన్ కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ మార్కెట్లో అడుగుపెట్టనున్న చిన్న ఎస్‌యూవీ అవుతుంది. దీని ధర బహుశా రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీని ప్రొడక్షన్ తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు ప్లాంట్‌లో జరుగుతుంది.

సిట్రోయెన్ సి3 లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా..?

సిట్రోయెన్ సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా స్పోర్టీగా ఉంటుంది. ఇందులో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫాస్ట్-ఛార్జింగ్ యూఎస్‌బి పోర్టులు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి వాటితో పాటు 315 లీటర్ల బూట్ స్పేస్ మరియు డ్రైవర్, కో-ప్యాసింజర్ కోసం స్మార్ట్‌ఫోన్ క్లాంప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

సిట్రోయెన్ సి3 లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా..?

అంతే కాకుండా ఇందులో 1 లీటర్ గ్లోవ్ బాక్స్, ముందు మరియు వెనుక డోర్లపైన 2 లీటర్ల డోర్ పాకెట్‌లు, సెంట్రల్ కన్సోల్‌లో స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, వెనుక భాగంలో రెండు కప్ హోల్డర్‌లతో కూడిన రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

సిట్రోయెన్ సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో రెండు ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుందని ఆశించవచ్చు.

సిట్రోయెన్ సి3 లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా..?

సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ కంపెనీ యొక్క వెన్యూ, కియా కంపెనీ యొక్క సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్యువి300 వంటి సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే మొత్తం మీద ఒక్కమాటలో చెప్పాలంటే ఇది తప్పకుండా భారతీయ వాహన వినియోగదారులను ఆకర్శించే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

సిట్రోయెన్ సి3 లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా..?

సిట్రోయెన్ కంపెనీ నిజానికి భారతీయ మార్కెట్లో తన సి5 ఎయిర్‌క్రాస్‌తో అరంగేట్రం చేసింది. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్‌ విడుదలతో కంపెనీ భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందగలిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు తన పరిధిని మరియు ఉనికిని మరింత విస్తరించుకోవడానికి సి3 ఎస్‌యూవీని విడుదల చేయనుంది.

Most Read Articles

English summary
Citroen c3 micro suv could launch in mid july features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X