సిట్రోయెన్ సి3 ప్రియులకు షాకింగ్ న్యూస్.. పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే ధరలు పెరిగాయ్

సిట్రోయెన్ కంపెనీ దేశీయ విఫణిలో అడుగుపెట్టినప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతూనే ఉంది. కంపెనీ మొదటి సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ చేసింది, ఆ తరువాత ఇటీవల 2022 జులై 20 న సి3 అనే మైక్రో SUV విడుదలయింది. అయితే కంపెనీ ఈ కొత్త SUV కి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందగలిగింది. కాగా ఈ SUV లాంచ్ అయ్యి మూడు నెలల కాలంలోనే ధరల పెరుగుదలను అందుకుంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

సిట్రోయెన్ సి3 ప్రియులకు షాకింగ్ న్యూస్.. పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే ధరలు పెరిగాయ్

కంపెనీ కొత్త సిట్రోయెన్ సి3 మైక్రో SUV ని లైవ్ మరియు ఫీల్ అనే రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. కాగా వీటి ధరలు ఇప్పుడు రూ. 9,000 నుంచి రూ. 17,000 వరకు పెరిగాయి. ఇందులో కూడా ఫీల్ టర్బో డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ వేరియంట్ ధర రూ. 9,000 పెరిగింది, కాగా మిగిలిన అన్ని వేరియంట్స్ ధరలు రూ. 17,000 వరకు పెరిగాయి.

సిట్రోయెన్ సి3 ప్రియులకు షాకింగ్ న్యూస్.. పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే ధరలు పెరిగాయ్

ఇప్పుడు పెరిగిన ధరలు మరియు కొత్త ధరల జాబితా ఈ కింది పట్టికలో చూడవచ్చు.

Citroen C3 New Price Old Price Difference
Live ₹5.88 Lakh ₹5.71 Lakh ₹17,000
Feel ₹6.80 Lakh ₹6.63 Lakh ₹17,000
Feel Vibe Pack ₹6.95 Lakh ₹6.78 Lakh ₹17,000
Feel Dual Tone ₹6.95 Lakh ₹6.78 Lakh ₹17,000
Feel Dual Tone Vibe Pack ₹7.10 Lakh ₹6.93 Lakh ₹17,000
Feel Turbo Dual Tone Vibe Pack ₹8.15 Lakh ₹8.06 Lakh ₹9,000
సిట్రోయెన్ సి3 ప్రియులకు షాకింగ్ న్యూస్.. పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే ధరలు పెరిగాయ్

కొత్త సిట్రోయెన్ సి3 ధరల పెరుగుదల తప్పా ఇందులో ఎటువంటి మార్పులు జరగలేదు. కావున అదే డిజైన్, అదే ఫీచర్స్ మరియు అదే ఇంజిన్ వంటివి ఉన్నాయి. కావున ఈ SUV నాలుగు మోనో-టోన్ (పోలార్ వైట్, స్టీల్ గ్రే, జెస్టీ ఆరెంజ్ మరియు ప్లాటినం గ్రే) మరియు రెండు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లలో (జెస్టీ ఆరెంజ్ విత్ ప్లాటినం గ్రే రూఫ్ మరియు పోలార్ వైట్‌తో జెస్టీ ఆరెంజ్ కలర్ రూఫ్) అందుబాటులో ఉంటుంది.

సిట్రోయెన్ సి3 ప్రియులకు షాకింగ్ న్యూస్.. పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే ధరలు పెరిగాయ్

ఇందులో అదే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ ఉన్నాయి. మొదటి ఇంజిన్ 81 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

సిట్రోయెన్ సి3 ప్రియులకు షాకింగ్ న్యూస్.. పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే ధరలు పెరిగాయ్

రెండవ ఇంజిన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

సిట్రోయెన్ సి3 ప్రియులకు షాకింగ్ న్యూస్.. పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే ధరలు పెరిగాయ్

ఫీచర్స్ పరంగా సిట్రోయెన్ సి3 SUV లో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫోర్-స్పీకర్స్, యుఎస్బి ఛార్జింగ్ సాకేట్ వంటివి మాత్రమే కాకుండా మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వర్టికల్ ఏసీ వెంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి.

సిట్రోయెన్ సి3 ప్రియులకు షాకింగ్ న్యూస్.. పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే ధరలు పెరిగాయ్

సిట్రోయెన్ సి3 పరిమాణం కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఇది 3,981 మిమీ పొడవు, 1,733 మిమీ వెడల్పు, 1,586 మిమీ ఎత్తు, వీల్‌బేస్ 2540 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంటుంది. ఇందులోని బూట్ స్పేస్ 315 లీటర్ల వరకు ఉంటుంది.

సిట్రోయెన్ సి3 ప్రియులకు షాకింగ్ న్యూస్.. పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే ధరలు పెరిగాయ్

సి3 అనేది మైక్రో SUV అయినప్పటికీ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. కావున ఈ SUV ముందు భాగంలోని బంపర్‌లపై కలర్-కోడెడ్ ఇన్‌సర్ట్‌లు, గ్రిల్‌తో కలిసే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, హెక్సా గోనల్ ఎయిర్ డ్యామ్, X-షేప్ లో ఉండే ఫాక్స్ స్కఫ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్ మరియు బాడీ క్లాడింగ్‌ ఉన్నాయి. ఇది 15 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. ఇక వెనుక భాగంలో ర్యాపరౌండ్ టెయిల్-లైట్స్ చక్కగా అమర్చబడి ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

సిట్రోయెన్ సి3 ప్రియులకు షాకింగ్ న్యూస్.. పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే ధరలు పెరిగాయ్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో మొదలైన పండుగ సీజన్లో అన్ని వాహన తయారీ సంస్థలు ధరలు తగ్గిస్తూ ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ అందిస్తుంటే, కొన్ని కంపెనీలు మాత్రం ధరలు పెంచుతున్నాయి, అందులో సిట్రోయెన్ మరియు టొయోట కంపెనీలు ఉన్నాయి. ఈ పండుగ సమయంలో వాహన ధరల పెరుగుదల అమ్మకాలపైన ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది తెలియాలి. ఇలాంటి మరిన్ని కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Citroen c3 price hike now starts at rs 5 88 lakh details
Story first published: Tuesday, October 4, 2022, 8:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X