సిట్రోయెన్ సి3 బుకింగ్స్ షురూ.. ఇక మీదే ఆలస్యం: బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

భారతీయ మార్కెట్లో 'సిట్రోయెన్' (Citroen) కంపెనీ తన 'సి3' (C3) ఎస్‌యూవీని ఈ నెల 20 న (2022 జులై) అధికారికంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. సి3 అనేది భారతీయ మార్కెట్ కి కంపెనీ యొక్క రెండవ మోడల్ అవుతుంది. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

సిట్రోయెన్ సి3 బుకింగ్స్ షురూ.. ఇక మీదే ఆలస్యం

కంపెనీ ఇప్పుడు ఈ కొత్త సి3 SUV కోసం బుకింగ్స్ అధికారికంగా స్వీకరించడం ప్రారంభించింది, కావున ఆసక్తిగల కస్టమర్లు అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకోవడానికి ముందస్తుగా రూ. 21,000 చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి.

సిట్రోయెన్ సి3 బుకింగ్స్ షురూ.. ఇక మీదే ఆలస్యం

సిట్రోయెన్ కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్న సి5 ఎయిర్ క్రాస్ మంచి ప్రజాదరణ పొందుతోంది. కావున ఈ నెలలో విడుదలకానున్న ఈ కొత్త ఎస్‌యూవీ కూడా తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలను పొందే ఆకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

సిట్రోయెన్ సి3 బుకింగ్స్ షురూ.. ఇక మీదే ఆలస్యం

సిట్రోయెన్ సి3 SUV 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లతో విడుదలయ్యే అవకాశం ఉంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. కానీ టర్బో పెట్రోల్ అనేది కావేలం ఫీల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వస్తుంది.

1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. టర్బోచార్జ్డ్ వెర్షన్ యొక్క 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.

సిట్రోయెన్ సి3 బుకింగ్స్ షురూ.. ఇక మీదే ఆలస్యం

సిట్రోయెన్ సి3 భారతదేశంలో ఉత్పత్తి కానున్న మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్ కానుంది. ఎందుకంటే ఇది భారతదేశంలో ఉత్పత్తి కానున్న సిట్రోయెన్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి. ఇది 2021 సెప్టెంబర్ నెలలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టబడింది. అయితే ఇప్పుడు భారతీయ రోడ్లపైన తిరగడానికి సిద్ధంగా ఉంది. ఇది లైవ్ మరియు ఫీల్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

సిట్రోయెన్ సి3 బుకింగ్స్ షురూ.. ఇక మీదే ఆలస్యం

సిట్రోయెన్ సి3 ని డ్యూయల్ టోన్ రూఫ్ టాప్‌ తో ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది, కావున ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఈ ఎస్‌యూవీలో ఇవ్వనున్నారు. సి3 యొక్క ఇంటీరియర్‌లో రెండు కలర్ ఆప్షన్‌లు ఉంటాయి.

సిట్రోయెన్ సి3 బుకింగ్స్ షురూ.. ఇక మీదే ఆలస్యం

సిట్రోయెన్ సి3 కొలతల విషయానికి వస్తే, ఇది 3,981 మిమీ పొడవు, 1,733 మిమీ వెడల్పు, 1,586 మిమీ ఎత్తు మరియు వీల్‌బేస్ 2540 మిమీ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సిట్రోయెన్ సి3 బుకింగ్స్ షురూ.. ఇక మీదే ఆలస్యం

సిట్రోయెన్ సి3 'కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్' (CMP) పై నిర్మించబడుదుతోంది. ఈ డిజైన్ ప్లాట్‌ఫారమ్ భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మరింత సరసమైనదిగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కావున దీని ధర కూడా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ దీని ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ధర బహుశా రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది.

సిట్రోయెన్ సి3 బుకింగ్స్ షురూ.. ఇక మీదే ఆలస్యం

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

సి3 అనేది భారతీయ మార్కెట్లో విడుదలకానున్న బ్రాండ్ యొక్క రెండవ మోడల్. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో విడుదలకానుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. కావున ఇది మంచి బుకింగ్స్ కూడా పొందే అవకాశం ఉంది. ఇది భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ మరియు టాటా నెక్సాన్ వంటి సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Citroen c3 suv booking starts in india launch 20 july details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X