విడుదలకు ముందే వెల్లడైన 'సిట్రోయెన్ సి3' ధరలు: వివరాలు

ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) భారతీయ మార్కెట్లో 'సి3' (C3) ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని ఈ నెల 20 న విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ ఎస్‌యూవీ యొక్క ధరలు వెల్లడయ్యాయి. ఈ సిట్రోయెన్ సి3 గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

విడుదలకు ముందే వెల్లడైన 'సిట్రోయెన్ సి3' ధరలు: వివరాలు

ఐరోపా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఎస్‌యూవీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో త్వరలోనే విడుదలకానుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో బుకింగ్స్ ప్రారభించబడ్డాయి, కావున ఈ ఎస్‌యూవీ కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ముందస్తుగా రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి.

విడుదలకు ముందే వెల్లడైన 'సిట్రోయెన్ సి3' ధరలు: వివరాలు

ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సిట్రోయెన్ సి3 అనేది 2 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి లైవ్ మరియు ఫీల్ వేరియంట్స్. ఇందులోని బేస్ మోడల్ అయిన లైవ్ వేరియంట్ మ్యాన్యువల్ ఏసీ, అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్ వంటి వాటితో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ పవర్ విండోస్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఫ్లాట్-ఫోల్డింగ్ రియర్ సీట్లు మరియు ముందు భాగంలో 12V సాకెట్ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

విడుదలకు ముందే వెల్లడైన 'సిట్రోయెన్ సి3' ధరలు: వివరాలు

ఈ వేరియంట్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 6.25 లక్షల మధ్య ఉంటుందని వెల్లడయ్యింది. ఇక ఫీల్ వేరియంట్ ధరలు రూ. 7 లక్షల నుంచి 8.5 లక్షల వరకు ఉన్నాయి. అయితే కంపెనీ అధికారిక ధరలను 2022 జులై 20 న అధికారికంగా విడుదల చేస్తుంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతాయి.

విడుదలకు ముందే వెల్లడైన 'సిట్రోయెన్ సి3' ధరలు: వివరాలు

సిట్రోయెన్ సి3 భారతదేశంలో ఉత్పత్తి కానున్న మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్ కానుంది. ఎందుకంటే ఇది భారతదేశంలో ఉత్పత్తి కానున్న సిట్రోయెన్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి. ఇది 2021 సెప్టెంబర్ నెలలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టబడింది. అయితే ఇప్పుడు భారతీయ రోడ్లపైన తిరగడానికి సిద్ధంగా ఉంది.

విడుదలకు ముందే వెల్లడైన 'సిట్రోయెన్ సి3' ధరలు: వివరాలు

సిట్రోయెన్ సి3 ని డ్యూయల్ టోన్ రూఫ్ టాప్‌ తో ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంటీరియర్ విషయానికి వస్తే, సి3 యొక్క ఇంటీరియర్‌లో రెండు కలర్ ఆప్షన్‌లు ఉంటాయి. ఇందులో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది, కావున ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఈ ఎస్‌యూవీలో ఇవ్వనున్నారు.

విడుదలకు ముందే వెల్లడైన 'సిట్రోయెన్ సి3' ధరలు: వివరాలు

సిట్రోయెన్ సి3 'కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్' (CMP) పై నిర్మించబడుదుతోంది. ఈ డిజైన్ ప్లాట్‌ఫారమ్ భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మరింత సరసమైనదిగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక కొలతల విషయానికి వస్తే, ఇది 3,981 మిమీ పొడవు, 1,733 మిమీ వెడల్పు, 1,586 మిమీ ఎత్తు మరియు వీల్‌బేస్ 2540 మిమీ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంటుంది.

విడుదలకు ముందే వెల్లడైన 'సిట్రోయెన్ సి3' ధరలు: వివరాలు

సిట్రోయెన్ సి3 SUV 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లతో విడుదలయ్యే అవకాశం ఉంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. కానీ టర్బో పెట్రోల్ అనేది కావేలం ఫీల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వస్తుంది.

విడుదలకు ముందే వెల్లడైన 'సిట్రోయెన్ సి3' ధరలు: వివరాలు

1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. టర్బోచార్జ్డ్ వెర్షన్ యొక్క 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.

విడుదలకు ముందే వెల్లడైన 'సిట్రోయెన్ సి3' ధరలు: వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త సి3 ఎస్‌యూవీకి సంబంధించిన చాలా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ధరలు కూడా వెల్లడయ్యాయి. కావున ఈ కొత్త ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది. సిట్రోయెన్ సి3 అనేది భారతీయ మార్కెట్లో టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.ఈ ఎస్‌యూవీ గురించి ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Source: Rushlane

Most Read Articles

English summary
Citroen c3 suv price revealed ahead of it launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X