సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

ఫ్రెంచ్ కార్ కంపెనీ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో తమ రెండవ మోడల్ సిట్రోయెన్ సి3 (Citroen C3) ని నేడు అధికారికంగా విడుదల చేసింది. భారత ఎస్‌యూవీ మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో సరసమైన ధరకే ఈ ఫ్రెంచ్ కంపెనీ తమ సి3 ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో చిన్న ఎస్‌యూవీ ధరలు రూ. 5.71 లక్షల నుండి రూ.8.05 లక్షల మధ్యలో ఉంది. మార్కెట్లో ఇది రెండు ట్రిమ్‌లు (లివ్ మరియు ఫీల్) మరియు ఆరు వేరియంట్లలో విక్రయించబడుతోంది. కంపెనీ ఈ రెండు ట్రిమ్‌లను అనేక ఫీచర్‌లతో అందిస్తోంది. మరి ఏయే ట్రిమ్ లో ఎలాంటి ఫీచర్లు లభిస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

సిట్రోయెన్ సి3 వేరియంట్ వారీ ధరలు:

ముందుగా సిట్రోయెన్ సి3 ధరలను గమనిస్తే, కంపెనీ ఈ ఎస్‌యూవీని అత్యంత సరసమైన ధర వద్ద నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, కియా సోనెట్, టాటా పంచ్ వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇచ్చేలా కేవలం రూ.5.71 లక్షల ప్రారంభ ధరకే విడుదల చేసింది. ఇదే కంపెనీ విక్రయిస్తున్న సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ప్రీమియం ధర కారణంగా, కస్టమర్ల అంతగా ఆదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో, కొత్తగా వచ్చిన సి3 దాని సరసమైన ధరతో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని కంపెనీ చాలా ధీమాతో ఉంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

ఇతర కార్ కంపెనీల మాదిరిగా సిట్రోయెన్ తమ సి3 వేరియంట్ల విషయంలో అనేక వెర్షన్లను అందించి కస్టమర్లను గందరగోళానికి గురి కాకుండా ఉండేలా చేసింది. సిట్రోయెన్ సి3 యొక్క ఆరు వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి:

సిట్రోయెన్ సి3 లివ్: రూ. 5.71 లక్షలు

సిట్రోయెన్ సి3 ఫీల్: రూ. 6.62 లక్షలు

సిట్రోయెన్ సి3 ఫీల్ వైబ్ ప్యాక్: రూ. 6.77 లక్షలు

సిట్రోయెన్ సి3 ఫీల్ డ్యూయల్ టోన్: రూ. 6.77 లక్షలు

సిట్రోయెన్ సి3 ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 6.92 లక్షలు

సిట్రోయెన్ సి3 టర్బో ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 8.05 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

సిట్రోయెన్ సి3 లివ్ ట్రిమ్ ఫీచర్లు:

సిట్రోయెన్ సి3 లివ్ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో అవసరమైన అన్ని బేసిక్ ఫీచర్లతో లభిస్తుంది. ఈ బేస్ వేరియంట్ కేవలం 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేదు. ఈ వేరియంట్లో లభించే ఫీచర్లను గమనిస్తే, కంపెనీ ఇందులో హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, ఫుల్ వీల్ కవర్లు, గ్లోసీ బ్లాక్ సైడ్ మిర్రర్లు, బ్లాక్ అప్‌హోలెస్ట్రీ, గేర్ నాబ్, ఏసి కంట్రోల్ మరియు బ్లాక్ ఏసి వెంట్ సరౌండ్ కోసం శాటిన్ క్రోమ్ యాక్సెంట్‌లు ఇవ్వబడ్డాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

అంతేకాకుండా, ఈ వేరియంట్లో రూఫ్ మౌంటెడ్ యాంటెన్నా, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), రియర్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు సీట్-బెల్ట్ రిమైండర్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఈ ట్రిమ్‌లో లభిస్తాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

సిట్రోయెన్ సి3 ఫీల్ ట్రిమ్ ఫీచర్లు:

సి3 ఫీల్ ట్రిమ్ ను కంపెనీ ఐదు వేరియంట్లలో అందిస్తోంది. ఇందులో నాలుగు వేరియంట్లు 1.2 లీటర్ న్యాచులర్ పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుండగా, టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. ఈ ట్రిమ్ కోసం కంపెనీ వివిధ కస్టమైజేషన్ ఆప్షన్లతో పాటుగా డ్యూయెల్-టోన్ కలర్ ఆప్షన్‌లను కూడా అందిస్తోంది. కస్టమర్ ఎంచుకునే ఇంజన్ ఆప్షన్, ప్యాకేజ్ మరియు కలర్ ఆప్షన్ ను బట్టి ఈ వేరియంట్ల ధరలు మారుతూ ఉంటాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

సిట్రోయెన్ సి3 ఫీల్ ట్రీమ్ లో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో గ్లోసీ బ్లాక్ రూఫ్ రెయిల్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్లు, ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, స్టీరింగ్ వీల్ మరియు ఏసి వెంట్స్ చుట్టూ శాటిన్ క్రోమ్ యాక్సెంట్‌లు, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 10 ఇంచ్ వైర్‌లెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

వీటికి అదనంగా, ఇందులో నాలుగు స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ పవర్ విండోస్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, రియర్ పార్శిల్ ట్రే మరియు స్పీడ్-సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఫంక్షన్‌తో పాటుగా పైన తెలిపిన సి3 లివ్ వేరియంట్లో లభించే అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు మరియు ఇతర ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

సిట్రోయెన్ సి3 కలర్ మరియు కస్టమైజేషన్ ఆప్షన్స్:

సిట్రోయెన్ సి3 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ ఆకర్షణీయమైన రంగులలో అందిస్తోంది. ఇందులో సింగిల్ టోన్ మరియు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. సింగిల్-టోన్ మరియు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లతో సహా ఇది మొత్తం 10 విభిన్న రంగులో లభిస్తుంది. వీటికి అదనంగా, కస్టమర్లు తమ సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీని తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునేందుకు అనేక యాక్ససరీలు, 3 రకాల ప్యాక్‌లు మరియు 56 కస్టమైజేషన్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. కాబట్టి కస్టమర్లు తమ C3 ని తమ అభిరుచికి మరియు #ExpressYourStyle కి అనుగుణంగా ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

సిట్రోయెన్ సి3 న్యాచురల్ పెట్రోల్ ఇంజన్:

సిట్రోయెన్ సి3 రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్ 1.2-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ ప్యూర్‌టెక్ 82 ఇంజన్‌తో పనిచేస్తుంది. పేరు సూచించినట్లుగానే ఈ ఇంజన్ గరిష్టంగా 82 పిఎస్ శక్తిని జనరేట్ చేస్తుంది. ఇది 80.8 బిహెచ్‌పితో సమానం. దీని గరిష్ట టార్క్ 115 ఎన్ఎమ్ గా ఉంటుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు మరియు ధరలు

సిట్రోయెన్ సి3 టర్బో పెట్రోల్ ఇంజన్:

ఎక్కువ పవర్ కోరుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ ను కూడా అందిస్తోంది. ఈ ఇంజన్‌కు ప్యూర్‌టెక్ 110 అనే పేరు పెట్టారు. పేరుకి తగినట్లుగానే ఇది 110 పిఎస్ లేదా 108.4 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ ఇంజన్ 190 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదు, భవిష్యత్తులో వస్తుందో లేదా తెలియదు. కొత్త సిట్రోయెన్ సి3 బుకింగ్స్, సేల్స్ మరియు డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ బుజ్జి ఫ్రెంచ్ ఎస్‌యూవీని మీ ఇంటికి తెచ్చేసుకోండి!

Most Read Articles

English summary
Citroen c3 variant wise features price engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X