C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

'సిట్రోయెన్' (Citroen) కంపెనీ ఈ మధ్య కాలంలో దేశీయ మార్కెట్లో తన కొత్త 'సి3' (C3) మైక్రో SUV ని రూ. 5.71 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ SUV కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా విడుదలకు ముందే ప్రారభించింది. డెలివరీలు కూడా ఇప్పటికే ఓ మోస్తరుగా ప్రారంభమయ్యాయి.

Recommended Video

భార‌త్‌లో విడుదలైన Citroen C3 | ధర & వివరాలు

అయితే ఈ నెల 15 న కంపెనీ ఒక మెగా డెలివరీ స్టార్ట్ చేసింది. ఇందులో ఏకంగా 75 కార్లను ఒకేరోజు డెలివరీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవ సంబరాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు 75 మంది కస్టమర్లకు 75 సిట్రోయెన్ సి3 కార్లను డెలివరీ చేయడం జరిగింది. సిట్రోయెన్ కంపెనీ ఒకే సారి ఇన్ని కార్లను డెలివరీ చేయడం బహుశా ఇదే మొదటి సారి కావచ్చు.

C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

ఢిల్లీలోని కంపెనీ డీలర్ ప్యారిస్ మోటోకార్ప్ ద్వారా వినియోగదారులకు ఈ 75 కార్లను అందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ మెగా కస్టమర్ డెలివరీ ఈవెంట్ న్యూఢిల్లీలోని అశోక్ హోటల్ లో జరిగింది. ఇందులో ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేశారు. ఈ ఈవెంట్ లో సిట్రోయెన్ ఇండియా బ్రాండ్ హెడ్ 'సౌరభ్ వత్సా' మరియు డీలర్ ప్రిన్సిపాల్ 'హిమాన్షు అగర్వాల్' మొదలైనవారు పాల్గొన్నారు. దీనికి సంబంహించిన ఫోటోలు కూఆ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

సిట్రోయెన్ సి3 అనేది భారతీయ మార్కెట్లో విడుదలైన కంపెనీ యొక్క రెండవ మోడల్. ఇది ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఒకటి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, కాగా మరొకటి 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.

C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. టర్బోచార్జ్డ్ వెర్షన్ యొక్క 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.

C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

సిట్రోయెన్ ఈ కొత్త మైక్రో ఎస్‌యూవీని లైవ్ మరియు ఫీల్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీ డిజైన్ విషయానికి వస్తే, ముందు భాగంలోని బంపర్‌లపై కలర్-కోడెడ్ ఇన్‌సర్ట్‌లు, గ్రిల్‌తో కలిసే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, హెక్సా గోనల్ ఎయిర్ డ్యామ్, X-షేప్ లో ఉండే ఫాక్స్ స్కఫ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్ మరియు బాడీ క్లాడింగ్‌ ఉన్నాయి. ఇది 15 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. ఇక వెనుక భాగంలో ర్యాపరౌండ్ టెయిల్-లైట్స్ చక్కగా అమర్చబడి ఉన్నాయి.

C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

సిట్రోయెన్ సి3 SUV 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కలిగి ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫోర్-స్పీకర్స్, యుఎస్బి ఛార్జింగ్ సాకేట్ వంటివి మాత్రమే కాకుండా మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వర్టికల్ ఏసీ వెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

కొత్త సిట్రోయెన్ సి3 'పోలార్ వైట్, స్టీల్ గ్రే, జెస్టీ ఆరెంజ్ మరియు ప్లాటినం గ్రే' అనే నాలుగు మోనో-టోన్ కలర్స్ లో మరియు జెస్టీ ఆరెంజ్ విత్ ప్లాటినం గ్రే రూఫ్ మరియు పోలార్ వైట్‌తో జెస్టీ ఆరెంజ్ కలర్ రూఫ్ అనే డ్యూయెల్ టోన్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ వినియోగాదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. కావున ఇది 3,981 మిమీ పొడవు, 1,733 మిమీ వెడల్పు, 1,586 మిమీ ఎత్తు, వీల్‌బేస్ 2540 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంటుంది. ఇక బూట్ స్పేస్ 315 లీటర్ల వరకు ఉంటుంది.

C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

సిట్రోయెన్ సి3 లో సేఫ్టీ ఫీచర్స్ కూడా కావలసినన్ని అందుబాటులో ఉన్నాయి. ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, సెంట్రల్ లాక్/అన్‌లాక్ బటన్, డీఫాగర్, పవర్డ్ వింగ్ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్‌ వంటివి ఉన్నాయి.

C3 మెగా డెలివరీ ఈవెంట్.. ఒకేసారి 75 కార్లు డెలివరీ చేసిన సిట్రోయెన్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

సిట్రోయెన్ కంపెనీ యొక్క ఉత్పత్తులు భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ఇందులో భాగంగానే మొదట విడుదలైన సి5 ఎయిర్ క్రాస్ విజయవంతమై తరువాత సి3 మైక్రో SUV వచ్చింది. ఇది కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. దీనికి నిదర్శనమే ఈ మెగా డెలివరీ ఈవెంట్. సిట్రోయెన్ సి3 దేశీయ మార్కెట్లో టాటా పంచ్ మరియు మారుతి సుజుకి ఇగ్నిస్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Citroen india delivers 75 c3 in delhi on a single day details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X