టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ (Citroen EV) ఎలక్ట్రిక్ కారు.. సెప్టెంబర్ 29న విడుదల!

ఫ్రెంచ్ కార్ కంపెనీ సిట్రోయెన్ భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. భారతదేశంలో నేడు విడుదల కాబోతున్న టాటా టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్‌కు పోటీగా సిట్రోయెన్ తమ C3-ఆధారిత ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను సెప్టెంబర్ 29, 2022వ తేదీన భారతదేశంలో ఆవిష్కరించనుంది.

టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ (Citroen EV) ఎలక్ట్రిక్ కారు.. సెప్టెంబర్ 29న విడుదల!

భారతదేశంలో సిట్రోయెన్ ఇప్పటికే సి5 ఎయిర్‌క్రాస్ అనే ఎస్‌యూవీని మరియు సి3 అనే హ్యాచ్‌బ్యాక్‌ను విక్రయిస్తోంది. ఇవి రెండూ కూడా సాంప్రదాయ ఇంజన్లతో నడిచే వాహనాలు. కాగా, సిట్రోయెన్ సి3 ఆధారంగా రాబోతున్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఈ బ్రాండ్‌కు భారత మార్కెట్లో మూడవ ఉత్పత్తి కానుంది. సిట్రోయెన్‌కు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం కొత్తేమీ కాదు, యూరోపియన్ మార్కెట్లో ఈ బ్రాండ్ విజయవంతంగా తమ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది.

టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ (Citroen EV) ఎలక్ట్రిక్ కారు.. సెప్టెంబర్ 29న విడుదల!

సిట్రోయెన్ సి3 (Citroen C3) ఆధారిత ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో నేరుగా టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో పోటీపడనుంది. మరికొద్ది గంటల్లోనే ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడి కానున్నాయి. సిట్రోయెన్ సి3 ఆధారిత ఎలక్ట్రిక్ కారును కంపెనీ రేపు ఆవిష్కరించినప్పటికీ, దాని అధికారిక అమ్మకాలు మాత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగుతాయని సమాచారం.

టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ (Citroen EV) ఎలక్ట్రిక్ కారు.. సెప్టెంబర్ 29న విడుదల!

సిట్రోయెన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో, సిట్రోయెన్ సి4 (Citroen C4) ఆధారంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ కారును సిట్రోయెన్ ఇ-సి4 (Citroen e-C4) పేరుతో విక్రయిస్తోంది. ఈ మోడల్ పెద్ద 50kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా, సిట్రోయెన్ e-C4 పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 350 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అంతే కాకుండా, సిట్రోయెన్ ఇ-సి4 ఎలక్ట్రిక్ కారులో శక్తివంతమైన 135 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారు కూడా ఉంటుంది.

టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ (Citroen EV) ఎలక్ట్రిక్ కారు.. సెప్టెంబర్ 29న విడుదల!

సిట్రోయెన్ ఇ-సి4 ఎలక్ట్రిక్ కారును 100kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేస్తే కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు. సమాచారం ప్రకారం, సిట్రోయెన్ నుండి భారత మార్కెట్లో విడుదల కాబోయే సి3 ఆధారిత ఎలక్ట్రిక్ కారును కూడా ఇదే విధంగా సిట్రోయెన్ ఇ-సి3 పేరుతో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అయితే, రాబోయే Citroen C3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధరలను పోటీగా ఉంచడానికి కంపెనీ ఇదే విధమైన పవర్‌ట్రెయిన్‌ని అందిస్తుందా లేదా అనే దానిపై ప్రస్తుతం ఖచ్చితమైన సమాచారం లేదు.

టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ (Citroen EV) ఎలక్ట్రిక్ కారు.. సెప్టెంబర్ 29న విడుదల!

సి3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ అంచనా ధర విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో పోటీ ధరలకే అందించాలంటే సుమారు రూ.12 లక్షలు లేదా అంత కన్నా తక్కువ రేంజ్‌లో విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ వినియోగదారులను ఆకర్షించాలంటే, ఈ ప్రారంభ ధర ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, భారతదేశం వంటి ప్రైస్-సెన్సిటివ్ మార్కెట్‌లో, అగ్రెసివ్ ప్రారంభ ధరను కలిగి ఉండటం వలన సంభావ్య కొనుగోలుదారుల నుండి కూడా చాలా ఆసక్తిని పొందవచ్చు.

టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ (Citroen EV) ఎలక్ట్రిక్ కారు.. సెప్టెంబర్ 29న విడుదల!

ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్ సిఎమ్‌పి (కాంపాక్ట్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్) పై ఆధారపడి నిర్మించబడింది. ఈ ప్లాట్‌ఫామ్ వివిధ రకాల పవర్‌ట్రైన్‌లను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో, రాబోయే సిట్రోయెన్ సి3 ఆధారిత ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునే ఆస్కారం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారును మాత్రమే కాకుండా, సిట్రోయెన్ రానున్న రోజుల్లో మరికొన్ని వాహనాలను భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి తీసుకురావాలని కూడా యోచిస్తోంది.

టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ (Citroen EV) ఎలక్ట్రిక్ కారు.. సెప్టెంబర్ 29న విడుదల!

ఫీచర్ల విషయానికొస్తే, రాబోయే సిట్రోయెన్ సి3 ఆధారిత ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 10 ఇంచ్ సిట్రోయెన్ కనెక్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వన్-టచ్ డౌన్ విండోస్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్-ఫోల్డింగ్ రియర్ సీటు వంటి అనేక ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ కారులో డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ లాక్, స్పీడ్-సెన్సిటివ్ డోర్ లాక్, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి.

టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ (Citroen EV) ఎలక్ట్రిక్ కారు.. సెప్టెంబర్ 29న విడుదల!

కాగా, ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న స్టాండర్డ్ సిట్రోయెన్ సి3 కారులో 1.2 లీటర్ న్యాచురల్ మరియు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను అందిస్తున్నారు. ఇందులోని 1.2-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ ప్యూర్‌టెక్ 82 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, 1.2 లీటర్ టర్బో ప్యూర్‌టెక్ 110 టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తున్నాయి. కంపెనీ త్వరలోనే ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Citroen to unveil its first electric car in india on 29th september details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X