కియా ఈవీ6 (Kia EV6) వర్సెస్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4): కంపారిజన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా నేడు భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈవీ6 (Kia EV6) ను విడుదల చేసింది. భారత మార్కెట్లో కియా ఈవీ6 రియర్ వీల్ డ్రైవ్ (RWD) మరియు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) అనే రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. వీటి ధరలు వరుసగా రూ.59.95 లక్షలు మరియు రూ.64.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి. ధర పరంగా ఇది ఈ విభాగంలో ఇటీవలే విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4) ఎలక్ట్రిక్ కారుకి పోటీగా ఉంటుంది. మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ప్రారంభ ధర రూ.69.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కియా ఈవీ6 (Kia EV6) వర్సెస్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4): కంపారిజన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

కియా ఈవీ6 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఐ4 రెండు మోడళ్లు కూడా బాడీ టైప్ పరంగా వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఈ రెండు కార్లు అనేక విషయాలలో పోటీ పడుతాయి. ఈవీ6 క్రాసోవర్ డిజైన్ ను కలిగి ఉంటే, ఐ4 సెడాన్ టైప్ డిజైన్ ను కలిగి ఉంటుంది. భారతదేశంలో కియా ఈవీ6 రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో (సింగిల్ మోటార్ మరియు డ్యూయెల్ మోటార్). కాగా, ఐ4 మాత్రమే BMW i4 eDrive40 Sport వేరియంట్‌గా ఒకే పవర్‌ట్రైన్ ఆప్షన్ తో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఈ కథనంలో కియా ఈవీ6 టాప్-ఎండ్ వేరియంట్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఐ4 కార్ల మధ్య తేడాలు ఏంటో చూద్దాం రండి.

కియా ఈవీ6 (Kia EV6) వర్సెస్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4): కంపారిజన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

Kia EV6 Vs BMW i4 - బ్యాటరీ మరియు రేంజ్

కియా ఈవీ6 జిటి-లైన్ ఏడబ్ల్యూడి వేరియంట్ 77.4kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ యాక్సిల్స్ లో అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 325 బిహెచ్‌పి శక్తిని మరియు 605 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది WLTP టెస్టింగ్ ప్రమాణాల ప్రకారం పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 506 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

కియా ఈవీ6 (Kia EV6) వర్సెస్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4): కంపారిజన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఇందులో 83.9kWh బ్యాటరీ ప్యాక్‌ (ఈవీ6 కన్నా 6.5kWh ఎక్కువ) ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 340 బిహెచ్‌పి శక్తిని మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై 590 కిలోమీటర్ల (ఈవీ6 కన్నా 84 కిలోమీటర్లు ఎక్కువ) సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. పవర్ విషయంలో బిఎమ్‌డబ్ల్యూ ఐ4 బెస్ట్ అయితే, టార్క్ విషయంలో కియా ఈవీ6 బెస్ట్ గా ఉంటుంది.

కియా ఈవీ6 (Kia EV6) వర్సెస్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4): కంపారిజన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

Kia EV6 Vs BMW i4 - బ్యాటరీ చార్జింగ్ టైం

చార్జింగ్ సమయం విషయానికి వస్తే, కియా ఈవీ6 స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ లను సపోర్ట్ చేస్తుంది. ఈ కారును 350 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 18 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అదే 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ సాయంతో అయితే కేవలం 73 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. కాగా, బిఎమ్‌డబ్ల్యూ ఐ4 కారును 205kW ఛార్జర్ సాయంతో కేవలం 31 నిమిషాల్లో 10-80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు. చార్జింగ్ విషయంలో కియా ఈవీ6 వేగంగా ఉంటుంది.

కియా ఈవీ6 (Kia EV6) వర్సెస్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4): కంపారిజన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

Kia EV6 Vs BMW i4 - పెర్ఫార్మెన్స్, టాప్ స్పీడ్

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కారు కేవలం 5.7 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లకు ఎలక్ట్రానిక్ గా పరిమితం చేయబడి ఉంటుంది. కాగా, కియా ఈవీ6 కేవలం 5.5 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. కియా ఈవీ6 యొక్క గరిష్ట వేగాన్ని గంటకు 192 కిమీ పరిమితం చేశారు. పెర్ఫార్మెన్స్ విషయంలో కియా ఈవీ6 చురుకుగా ఉంటుంది.

కియా ఈవీ6 (Kia EV6) వర్సెస్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4): కంపారిజన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

Kia EV6 Vs BMW i4 - కొలతలు

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ క్రాసోవర్ 4,695mm పొడవు, 1,890mm వెడల్పు మరియు 1,550mm ఎత్తును కలిగి ఉంటుంది. కాగా, బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ సెడాన్ 4,785mm పొడవు, 1,852mm వెడల్పు మరియు 1,448mm ఎత్తును కలిగి ఉంటుంది. కొలతల పరంగా చూస్తే, బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కారును స్టాండర్డ్ పెట్రోల్/డీజిల్ వెర్షన్ 4-సిరీస్ సెడాన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేశారు కాబట్టి, ఇది కియా ఈవీ6 కన్నా ఎక్కువ విశాలంగా ఉండి ప్రయాణీకులకు తగినంత రూమ్‌ని అందిస్తుంది.

కియా ఈవీ6 (Kia EV6) వర్సెస్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4): కంపారిజన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

కాగా, కియా ఈవీ6 క్రాసోవర్ రూపాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ హెడ్‌రూమ్ మరియు షోల్డర్ రూమ్ ని అందిస్తుంది. బూట్ స్పేస్ విషయంలో కూడా ఈవీ6 బెస్ట్ గా ఉంటుంది. దీని బూట్ స్పేస్ 520 లీటర్లుగా ఉంటుంది. అయితే ఐ4 బూట్ స్పేస్ కేవలం 470 లీటర్లుగా మాత్రమే ఉంటుంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, బిఎమ్‌డబ్ల్యూ ఐ4 పొడవుగా ఉన్నప్పటికీ, కియా ఈవీ6 కారు కన్నా తక్కువ స్థలాన్ని కలిగి ఉంది. కియా ఈవీ6 ఎక్కువ బూట్ స్పేస్ కోరుకునే వారికి మరియు క్యాబిన్ లో స్పేస్ కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

కియా ఈవీ6 (Kia EV6) వర్సెస్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4): కంపారిజన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

Kia EV6 Vs BMW i4 - ఫీచర్లు

కియా ఈవీ6 ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్యాష్ బోర్డులో రెండు పెద్ద స్క్రీన్లు, రిమోట్ ఫోల్డింగ్ 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, ఫ్రంట్ వన్ టచ్ ఆటో అప్/డౌన్ పవర్ విండోస్, వెంటిలేటెడ్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 10-వే అడ్జస్టబల్ డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ పవర్ సీట్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు (నార్మల్/ ఎకో/ స్పోర్ట్), రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, పుష్ బటన్ స్టార్ట్ తో కూడిన స్మార్ట్ కీ, రియర్ డీఫాగర్, టైర్ మొబిలిటీ కిట్ (TMK) మరియు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ మొదలైనవి ఉన్నాయి.

కియా ఈవీ6 (Kia EV6) వర్సెస్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4): కంపారిజన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

కాగా, బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కారులో డ్యాష్‌బోర్డులో 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 14.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, BMW యొక్క లేటెస్ట్ iDrive 8 యూజర్ ఇంటర్‌ఫేస్‌, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్ఈడి యాంబియెంట్ లైటింగ్, సన్‌రూఫ్, కెమెరాతో కూడిన రివర్స్ పార్కింగ్ అసిస్ట్ మరియు 17-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Comparison between kia ev6 and bmw i4 powertrain performance battery range and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X