మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

దేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ కంపెనీ మారుతి సుజుకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తమ సరికొత్త 2022 ఆల్టో కె10 మోడల్‌ను కేవలం రూ. 3.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో విడుదలైన ఈ చిన్న కారుకి మార్కెట్లో నేరుగా ఎలాంటి పోటీ లేకపోయినప్పటికీ, ఇది ఈ విభాగంలో ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో అందిస్తున్న క్విడ్ (Renault Kwid) కి ఎంతో కొంత పోటీగా నిలుస్తుంది. మరి ఈ రెండు మోడళ్లు ఒకదానితో మరొకటి ఎలా తలపడుతాయో చూద్దాం రండి.

మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: డిజైన్

మారుతి సుజుకి ఆల్టో కె10 ను కంపెనీ చాలా కాలం తర్వాత తిరిగి మార్కెట్లో రీలాంచ్ చేసింది. అయితే, కంపెనీ ఈ కారు డిజైన్‌లో ఆశించిన భారీ మార్పులనైతే తీసుకురాలేకపోయింది. ఇది చూడటానికి ఆల్టో 800 యొక్క పెద్దన్న మాదిరిగా కనిపిస్తుంది. ముందు భాగంలో కొత్త స్వెప్ట్‌బ్యాక్ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన పెద్ద సింగిల్-పీస్ గ్రిల్, ఫాగ్‌ల్యాంప్‌లు లేని ఫ్రంట్ బంపర్, 13 ఇంచ్ స్టీల్ వీల్స్, చతురస్రాకారంలో ఉండే టెయిల్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ మరియు ప్లెయిన్ రియర్ బంపర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌తో ఆల్టో కె10 చాలా సింపుల్‌గా కనిపిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా ఇటీవలే తమ కొత్త 2022 మోడల్ ఇయర్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులోని టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్ అయిన రెనో క్విడ్ క్లైంబర్ ఎడిషన్ ఇప్పుడు కొత్త డ్యూయల్ టోన్ ఫ్లెక్స్ వీల్స్‌తో లభిస్తుంది. క్లైంబర్ రేంజ్ ఇప్పుడు మెటల్ మస్టర్డ్, ఐస్ కూల్ వైట్ విత్ బ్లాక్ కలర్ రూఫ్ తో లభిస్తుంది. సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో మూన్‌లైట్ సిల్వర్ మరియు జాన్‌స్కర్ బ్లూ ఉన్నాయి. ఈ చిన్న కారు డిజైన్ చాలా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. డిజైన్ విషయంలో మాత్రం క్విడ్ మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఫీచర్లు

ఫీచర్ల విషయానికొస్తే, మారుతి సుజుకి ఆల్టో కె10 లో రిమోట్-కీలు, సుజుకి స్మార్ట్‌ప్లే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే సపోర్ట్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్‌స్ వంటి అధునాతన టెక్ ఫీచర్లను కలిగి ఉంది. ఆల్టో కె10 లో తొలిసారిగా పెద్ద కార్లలో మాత్రమే కనిపించే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇంకా ఇందులో యూఎస్‌బి పోర్ట్, మ్యాన్యువల్ ఏసి మరియు డ్రైవర్ సమాచారం కోసం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

రెనో క్విడ్ విషయానికి వస్తే, ఈ కొత్త మోడల్‌లో కొత్తగా 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ మీడియానావ్ ఎవల్యూషన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఇందులో వీడియో ప్లేబ్యాక్ మరియు వాయిస్ రికగ్నిషన్‌ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో డిజిటల్ ఎల్‌ఈడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ కండీషనర్, ఫ్రంట్ పవర్ విండోస్, ఫాస్ట్ యూఎస్‌బి ఛార్జర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ మరియు డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: సేఫ్టీ

సేఫ్టీ విషయానికి వస్తే, మారుతి సుజుకి తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో కె10లో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం), రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), ప్రీ-టెన్షనర్ మరియు ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్ బెల్ట్ మొదలైన వాటిని స్టాండర్డ్ గా అందిస్తోంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

రెనో క్విడ్ కూడా అవసరమైన అన్ని సేఫ్టీ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా, డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఈబిడితో కూడిన ఏబిఎస్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, ఓవర్‌స్పీడ్ అలర్ట్, రియర్ ఈఎల్ఆర్ (ఎమర్జెన్సీ లాకింగ్ రిట్రాక్టర్) సీట్ బెల్ట్‌లు, సెంట్రల్ లాకింగ్ మరియు రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు లభిస్తాయి.

మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఇంజన్

మారుతి సుజుకి ఆల్టో కె10 లో 998సీసీ, త్రీ సిలిండర్ K10C డ్యూయెల్ జెట్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 66 బిహెచ్‌పి శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఆల్టో కె10లోని ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 24.9 కిలోమీటర్ల మైలేజీని మరియు ఏఎమ్‌టి వెర్షన్ 24.39 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

కొత్త 2022 రెనో క్విడ్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 0.8 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 53 బిహెచ్‌పి పవర్ ను మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 67 బిహెచ్‌పి పవర్ ను మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. దీని 0.8 లీటర్ మాన్యువల్ వెర్షన్ 20.7 kmpl, 1.0 లీటర్ మాన్యువల్ వెర్షన్ 21.7 kmpl మరియు 1.0 లీటర్ ఏఎమ్‌టి వెర్షన్ 22 kmpl మైలేజీని అందిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ధరలు

మార్కెట్లో కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 యొక్క మాన్యువల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు కాగా, ఇందులో టాప్-ఎండ్ ధర రూ. 5.34 లక్షలుగా ఉంది. అలాగే, ఇందులో ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ. 5.50 లక్షల నుండి రూ. 5.84 లక్షల మధ్యలో ఉంటాయి.

మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? (Alto K10 vs Renault Kwid)

రెనో క్విడ్ ధరల విషయానికి వస్తే, ఇందులో మాన్యువల్ వేరియంట్ ధరే రూ. 4.64 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 5.64 లక్షలుగా ఉంటుంది. ఆటోమేటిక్ రెనో క్విడ్ కావాలనుకుంటే దాని ధరలు రూ. 5.79 లక్షల నుండి రూ. 6.09 లక్షల మధ్యలో ఉంటాయి (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ధర పరంగా మారుతి ఆల్టో కె10 సరసమైన కారు అయితే, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా రెనో క్విడ్ మంచి యూత్‌ఫుల్ కారుగా ఉంటుంది.

Most Read Articles

English summary
Comparison between maruti suzuki alto k10 and renault kwid price features safety engine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X