మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki), తాజాగా తమ సరికొత్త 2022 మోడల్ ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త మోడల్ ఇప్పుడు రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఇంటీరియర్స్ మరియు సరికొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేయబడింది. అందులో ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లలో కూడా అప్‌డేట్స్ చేయబడ్డాయి. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఈ విభాగంలో కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ కొత్తగా విడుదల చేసిన కియా కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివితో ఏ విధంగా పోటీ పడుతుందో తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

ఎక్స్ఎల్6 వర్సెస్ కారెన్స్ - డిజైన్

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 యొక్క కొత్త 2022 మోడల్ ఇప్పుడు రిఫ్రెష్డ్ ఎక్స్టీరియర్‌తో లభిస్తుంది. అయితే, పాత మోడల్‌తో పోలిస్తే, దీనిని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం అలానే ఉంటుంది. రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి హెడ్‌లైట్లు, మెషిన్-ఫినిష్డ్ టూ-టోన్ 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ అవుట్ బి అండ్ సి పిల్లర్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, సైడ్ సిల్స్‌లో క్రోమ్ ఎలిమెంట్స్, వెనుక డోర్‌పై కొత్త రూఫ్ స్పాయిలర్ మరియు క్రోమ్ గార్నిష్‌తో పాటు స్మోక్డ్ ఎఫెక్ట్‌ను కలిగి ఉండే కొత్త 3డి ఎల్ఈడి టైల్‌లైట్‌లు వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

కియా కార్నివాల్ కూడా ఈ విభాగంలో కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్. ఇందులోని సన్నటి డేటైమ్ రన్నింగ్ లైట్లు, హుడ్ క్రింది భాగంలో సన్నటి గ్రిల్ మరియు దాని దిగువ భాగంలో హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన పెద్ద ఎయిర్‌ డ్యామ్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ఫ్లోటింగ్ రూఫ్‌రైల్స్ మరియు ఎక్కువ ఎక్స్టీరియర్ క్రోమ్ ఎలిమెంట్స్‌తో ఇది మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది. కియా కారెన్స్ ఈ విభాగంలో మారుతి సుజుకి ఎక్క్ఎల్6 ఎక్స్టీరియర్ డిజైన్‌తో పోటాపోటీగా ఉంటుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

ఎక్స్ఎల్6 వర్సెస్ కారెన్స్ - ఫీచర్లు

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఇప్పుడు 7 ఇంచ్ సుజుకి స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యొక్క లేటెస్ట్ వెర్షన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో పాటుగా 'హే సుజుకి' వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ప్యాడిల్ షిఫ్టర్‌లు (ఆటోమేటిక్ వేరియంట్‌లో), వెంటిలేటెడ్ ఫ్రంట్ డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ సీట్లు, హెడ్స్-అప్ డిస్ప్లే, లొకేషన్ ట్రాకింగ్, రిమోట్ కార్ లాక్ అన్‌లాక్, రిమోట్ హజార్డ్ లైట్స్ ఆన్/ఆఫ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

కియా కారెన్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ యూఎస్‌బి ఛార్జింగ్ పాయింట్‌లు, యాంబియంట్ లైటింగ్, స్పాట్‌లైట్లు మరియు రియర్ టేబుల్ ట్రే, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ మరియు దానిపై వివిధ రకాల కంట్రోల్ బటన్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పానోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడి హెడ్‌లైట్లు మొదలైనవి ఉన్నాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

ఎక్స్ఎల్6 వర్సెస్ కారెన్స్ - సేఫ్టీ ఫీచర్లు

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిని కంపెనీ అదనపు సేఫ్టీ ఫీచర్లతో అందిస్తోంది. ఇందులో ఫస్ట్-ఇన్ సెగ్మెంట్ ఫీచర్‌గా 360-డిగ్రీ కెమెరా, అన్ని వేరియంట్లలో నాలుగు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు (టాప్-ఎండ్ వేరియంట్లలో మరిన్ని ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (టిఎమ్ఎస్), హిల్ హోల్డ్ అసిస్ట్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్లు యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

కియా కారెన్స్ ఎమ్‌పివిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటుగా ఇందులో జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్, రిమోట్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

ఎక్స్ఎల్6 వర్సెస్ కారెన్స్ - ఇంజన్

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పివి ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగాలో ఉపయోగించిన అదే అప్‌డేటెడ్ 1.5 లీటర్ కె15సి పెట్రోల్ ఇంజన్‌ను ఈ కొత్త 2022 ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కూడా ఉపయోగించారు. ఇందులోని 1.5-లీటర్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పి పవర్‌ను మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సరికొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

కియా కారెన్స్ విషయానికి వస్తే, ఇది మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల చేయబడింది. ఇందులో మొదటిది 114 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. రెండవది 113 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

ఇక మూడవ ఇంజన్ ఆప్షన్ 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 138 బిహెచ్‌పి పవర్‌ను మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తుంది. ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కియా కారెన్స్ పెట్రోల్, డీజిల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా వివిధ రకాల మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో కొనుగోలుదారుల అభిరుచికి మరియు అవసరానికి తగినట్లుగా అందుబాటులో ఉంటుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

ఎక్స్ఎల్6 వర్సెస్ కారెన్స్ - ధరలు

చివరిగా ధరలను గమనిస్తే, మార్కెట్లో కొత్త 2022 మారుతి ఎక్స్ఎల్6 ధరలు రూ.11.29 లక్షల నుండి ప్రారంభమై రూ.14.55 లక్షల వరకూ ఉంటాయి. కియా కారెన్స్ ఎమ్‌పివి ధరల విషయానికి వస్తే, ఇది రూ.8.99 లక్షల నుండి ప్రారంభమై రూ.16.99 లక్షల వరకూ ఉంటుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Petrol
XL6 XL6 1.5 MT Carens 1.5 MT Carens 1.4 MT Carens
Zeta ₹11.29 Lakh ₹9.59 Lakh ₹11.2 Lakh Premium
Alpha ₹12.29 Lakh ₹10.7 Lakh ₹12.4 Lakh Prestige
Alpha+ ₹12.89 Lakh NA ₹13.9 Lakh Prestige Plus
Alpha+ DT ₹13.05 Lakh NA ₹15.3 Lakh Luxury
₹16.55 Lakh Luxury Plus
Petrol
XL6 XL6 1.5 AT Carens 1.4 DCT Carens
Zeta ₹12.79 Lakh NA Premium
Alpha ₹13.79 Lakh NA Prestige
Alpha+ ₹14.39 Lakh ₹14.8 Lakh Prestige Plus
Alpha+ DT ₹14.55 Lakh ₹17.45 Lakh Luxury Plus
Diesel
Carens 1.5 MT Carens 1.5 AT Carens
₹11.4 Lakh NA Premium
₹12.6 Lakh NA Prestige
₹14.1 Lakh NA Prestige Plus
₹15.5 Lakh NA Luxury
₹16.75 Lakh ₹17.65 Lakh Luxury Plus
మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో దేనిని కొనచ్చు?

ఎక్స్ఎల్6 వర్సెస్ కారెన్స్ - ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న ఎర్టిగాకు కొత్త ఎక్స్టీరియర్‌ను అందించి, ప్రీమియం ఫీచర్లను జోడించినట్లుగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది ధరకు తగిన విలువను ఇస్తుంది. ఇది 6-సీటర్ వేరియంట్‌గా మాత్రమే లభిస్తుంది. ఒకవేళ మీరు 7-సీటర్ ఎమ్‌పివి కోసం చూస్తున్నట్లయితే, కియా కారెన్స్‌లో మీకు ఆ ఆప్షన్ లభిస్తుంది. ధర పరంగా ఈ రెండు మోడళ్లు ఇంచుమించు ఒకే రేంజ్‌లో ఉంటాయి. కాకపోతే, కియా కార్లు ఎల్లప్పుడూ సెగ్మెంట్లోని ఇతర కార్ల కన్నా ఎక్కువ ఫీచర్లను మరియు కస్టమర్ల కోసం ఎక్కువ కొనుగోలు ఆప్షన్లను కలిగి ఉంటాయి. మారుతి సుజుకి దేశంలో చాలా కాలంగా వ్యాపారం చేస్తూ ఓ విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఉంది, కియా ఇప్పుడిప్పుడే భారత మార్కెట్లో మంచి ఆదరణను పొందుతోంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని వీటిలో మీ అవసరాలకు, అభిప్రాయానికి ఏది ఖచ్చితంగా సూట్ అవుతోందో మీరే ఎంపిక చేసుకోండి.

Most Read Articles

English summary
Comparison between maruti suzuki xl6 and kia carens mpv design features engine price
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X