మారుతి ఆల్టో కె10 vs మారుతి సెలెరియో.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా?

భారతదేశంలోని ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి ఆల్టో చాలా కాలంగా ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. అంతేకాదు, ఈ చిన్న కారు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా చరిత్ర సృష్టించింది. సరసమైన ధర మరియు విశ్వసనీయమైన మారుతి సుజుకి బ్రాండ్ కారణంగా ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌ను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. మొదటిసారిగా కారు కొనేవారు, చిన్న కుటుంబాలు పెద్దలు మరియు యువకులు ఎక్కువగా ఈ కారును కొనుగోలుచేస్తున్నారు.

మారుతి ఆల్టో కె10 vs మారుతి సెలెరియో.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా?

మారుతి సుజుకి ఆల్టోకి పోటీగా అదే బ్రాండ్‌కు చెందిన మరిన్ని వాహనాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. అయితే, అవన్నీ కాస్తంత ప్రీమియం ధరను కలిగి ఉంటాయి, అయినప్పటికీ అవి ధరకు తగిన ఫీచర్లను అందిస్తాయి. మారుతి సుజుకి ఇటీవలే తమ ఆల్టో బ్రాండ్‌లో పెద్ద (1000సీసీ) ఇంజన్‌తో కూడిన ఆల్టో కె10 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త 2022 ఆల్టో కె10 ధర మారుతి సుజుకి అందిస్తున్న మరొక పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సెలెరియోతో పోటీపడే విధంగా ఉంచబడింది.

మారుతి ఆల్టో కె10 vs మారుతి సెలెరియో.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా?

ఈ నేపథ్యంలో, చాలా మంది కస్టమర్లు ఈ రెండు కార్లలో దేనిని కొనాలా అనే సందేహంలో ఉన్నారు. ఒకవేళ, మీరు కూడా అలాంటి సందేహాన్ని కలిగి ఉన్నట్లయితే, ఈ కథనంలో దానిని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మారుతి ఆల్టో కె10 vs మారుతి సెలెరియో.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా?

ఆల్టో కె10 వర్సెస్ సెలెరియో - ధరలు

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 బడ్జెట్ స్మాల్ కార్ సెగ్మెంట్లో అత్యంత చౌకైనది మరియు తాజాగా మార్కెట్లోకి వచ్చినది. మారుతి ఈ కారును కేవలం రూ. 3.99 లక్షల ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి తెచ్చింది. ఆల్టో కె10 మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో బేస్ వేరియంట్ (STD) ధర రూ. 3.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది మరియు టాప్ ఎండ్ వేరియంట్ (VXI+ AMT) ధర రూ. 5.83 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Alto K10 Variant Alto K10 Price Celerio Variant Celerio Price
STD ₹3.99 Lakh LXI ₹5.25 Lakh
LXI ₹4.82 Lakh VXI ₹5.74 Lakh
VXI ₹4.99 Lakh ZXI ₹5.94 Lakh
VXI Plus ₹5.33 Lakh VXI AMT ₹6.24 Lakh
VXI AMT ₹5.49 Lakh ZXI AMT ₹6.44 Lakh
VXI Plus AMT ₹5.83 Lakh ZXI Plus ₹6.50 Lakh
ZXI Plus AMT ₹7.00 Lakh
VXI CNG ₹6.69 Lakh
మారుతి ఆల్టో కె10 vs మారుతి సెలెరియో.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా?

ఇక మారుతి సుజుకి సెలెరియో విషయానికి వస్తే, సెలెరియో కూడా కొత్త తరం కారు, కంపెనీ గతేడాది ఇందులో పూర్తిగా రిఫ్రెష్ చేయబడిన కొత్త తరం మోడల్‌ను విడుదల చేసింది. సెలెరియో పెట్రోల్ ఫ్యూయెల్ ఆప్షన్‌తో పాటుగా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఇది మొత్తం 8 వేరియంట్‌లలో లభిస్తుంది. సెలెరియో LXi వేరియంట్ ధర రూ. 5.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇందులో టాప్ ఎండ్ ZXi+ AMT వేరియంట్ ధర రూ. 7 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కాగా, సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 7.52 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ధర పరంగా చూసుకుంటే, మారుతి సుజుకి ఆల్టో వివిధ వేరియంట్లు సరసమైన ధరలలో అందుబాటులో ఉన్నాయి.

మారుతి ఆల్టో కె10 vs మారుతి సెలెరియో.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా?

ఆల్టో కె10 వర్సెస్ సెలెరియో - ఇంజన్

కొత్తగా వచ్చిన మారుతి సుజుకి ఆల్టో కె10 ఇప్పుడు మరింత శుద్ధమైన 1.0-లీటర్ కె10సి పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 66 బిహెచ్‌పి పవర్ ను మరియు 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. అయితే, AMT గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రం దాని VXi మరియు VXi+ వేరియంట్‌లలో మాత్రమే లభిస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసిన వివరాల ప్రకారం, కొత్త ఆల్టో కె10 లీటరుకు 24.90 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

మారుతి ఆల్టో కె10 vs మారుతి సెలెరియో.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా?

ఇక మారుతి సుజుకి సెలెరియో విషయానికి వస్తే, ఇందులో కూడా ఆల్టో కె10 మాదిరిగానే 1.0-లీటర్ కె10సి డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, కొత్త సెలెరియో లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజీతో ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత మెరుగైన ఇంధన సామర్థ్యం కలిగిన హ్యాచ్‌బ్యాక్ అని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి ఇంధనంతో కూడా అందుబాటులో ఉంటుంది. సిఎన్‌జి మోడల్ మైలేజ్ కేజీకి 35 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది ఈ విభాగంలోనే అత్యధిక మైలేజీనిచ్చే సిఎన్‌జి కారు. మైలేజ్ పరంగా చూసుకుంటే, ఆల్టో కె10 కన్నా సెలెరియో బెస్ట్ కారుగా ఉంటుంది.

మారుతి ఆల్టో కె10 vs మారుతి సెలెరియో.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా?

ఆల్టో కె10 వర్సెస్ సెలెరియో - డిజైన్ మరియు ఫీచర్లు

కొత్త 2022 మోడల్ ఆల్టో కె10 డిజైన్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది. ఈ కారు ఇప్పుడు మునుపటి కంటే మరింత స్టైలిష్‍‌గా మరియు పెద్దదిగా కనిపిస్తుంది. ఆల్టో కె10 కారులో 13 ఇంచ్ స్టీల్ వీల్స్, రిమోట్-కీ, సుజుకి స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, యూస్‌బి పోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఈబిడితో కూడిన ఏబిఎస్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

మారుతి ఆల్టో కె10 vs మారుతి సెలెరియో.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా?

కొత్త తరం సెలెరియోని కూడా కంపెనీ పూర్తిగా రీడిజైన్ టచేసింది. ఇందులో కూడా ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఐడిల్ స్టార్ట్/స్టాప్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, డోర్ రిక్వెస్ట్ స్విచ్, ఈబిడితో కూడిన ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ డీఫాగర్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోలో బూట్ స్పేస్ ఇప్పుడు 313 లీటర్లకు పెరిగింది. ఫీచర్లలో ఈ రెండు మోడళ్లు ఇంచు మించు ఒకేలా ఉంటాయి.

మారుతి ఆల్టో కె10 vs మారుతి సెలెరియో.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా?

ఆల్టో కె10 వర్సెస్ సెలెరియో - కొలతలు

కొలతల విషయానికి వస్తే, మారుతి సుజుకి ఆల్టో కె10 పొడవు 3,530 మిమీ, వెడల్పు 1,490 మిమీ, మరియు వీల్ బేస్ 2,380 మిమీగా ఉంటుంది. ఇక సెలెరియో కొలతల విషయానికి వస్తే, ఈ కారు పొడవు 3,695 మిమీ మరియు వెడల్పు 1,655 మిమీ మరియు వీల్ బేస్ 2,435 మిమీగా ఉంటుంది. కొలతల పరంగా చూస్తే, ఆల్టో కంటే సెలెరియో కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది. మీరు ధరను పరిగణిలోకి తీసుకుంటే ఆల్టో కె10 ను కొనుగోలు చేయవచ్చు. కొంచెం మెరుగైన ఫీచర్లు, ప్రీమియంనెస్ మరియు పెద్ద క్యాబిన్‌ను కోరుకుంటే సెలెరియోను కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

English summary
Confused to choose between maruti alto k10 and maruti celerio lets take a look at this
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X