టెస్లా (Tesla) విషయంలో 'తగ్గేదేలే' అంటున్న భారత సర్కార్.. మరి టెస్లా కల నిజమయ్యేనా..?

అమెరికన్ కార్ కంపెనీ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, తాము ఇండియాకు రావాలంటే, భారత ప్రభుత్వం కొన్ని షరతులకు ఒప్పుకోవాలని టెస్లా డిమాండ్ చేస్తోంది. భారతదేశంలోకి దిగుమతి చేసుకునే కార్లపై పన్ను తగ్గించాలన్న టెస్లా డిమాండ్‌ చేస్తోంది. అయితే, ఈ అమెరికన్ కంపెనీ ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఇతర విదేశీ కంపెనీలకు వర్తించే పన్ను నిబంధనలే టెస్లాకు కూడా వర్తిస్తాయని, టెస్లాకు ఎలాంటి ప్రత్యేక సౌలభ్యాలు ఉండబోవని ప్రభుత్వం తెలిపింది.

టెస్లా (Tesla) విషయంలో 'తగ్గేదేలే' అంటున్న భారత సర్కార్.. మరి టెస్లా కల నిజమయ్యేనా..?

ప్రభుత్వం తన విధానాల ప్రకారం భారతదేశంలోని కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తుందని, మనది ప్రజాస్వామ్యం కాబట్టి, ప్రభుత్వం ఏదైనా ఒక కంపెనీకి నిర్దిష్ట విధానాన్ని నిర్ణయించదని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. టెస్లా భారతదేశంలో స్థానిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రజలు ఉపాధి పొందవచ్చని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో టెస్లా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు రూ. 2.3 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా.

టెస్లా (Tesla) విషయంలో 'తగ్గేదేలే' అంటున్న భారత సర్కార్.. మరి టెస్లా కల నిజమయ్యేనా..?

ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తాజాగా 42,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణ్ గోయల్ తెలిపారు. భారత ప్రభుత్వ ఉత్పత్తి ప్రోత్సాహక పథకానికి విశేష స్పందన లభిస్తోందని, పెద్ద పరిశ్రమల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని ఆయన అన్నారు. భారతదేశంలో స్థానిక ఉత్పత్తిని కలిగి ఉండని మరియు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని ఏ పరిశ్రమను భారత ప్రోత్సహించదని ఆయన అన్నారు.

టెస్లా (Tesla) విషయంలో 'తగ్గేదేలే' అంటున్న భారత సర్కార్.. మరి టెస్లా కల నిజమయ్యేనా..?

టెస్లా పెట్టుబడి విధానాలపై కేంద్ర జాతీయ రహదారులు మరియు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా విభేదించిన సంగతి తెలిసినదే. టెస్లా కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారతదేశంలో తన వ్యాపారాన్ని స్థాపించాలనుకుంటుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు హానికరమని ఆయన అన్నారు. కంపెనీ తన చైనీస్ ఫ్యాక్టరీ నుండి ఈ కార్లను దిగుమతి చేస్తుంది, ఇది టెస్లా మరియు చైనా ప్రభుత్వానికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. టెస్లా వీలైనంత వరకూ దిగుమతి చేసుకున్న కార్లతోనే వ్యాపారం చేయాలని చూస్తోంది తప్ప, స్థానికంగా కార్లను అసెంబుల్ చేయడానికి ముందుకు రావడం లేదు.

టెస్లా (Tesla) విషయంలో 'తగ్గేదేలే' అంటున్న భారత సర్కార్.. మరి టెస్లా కల నిజమయ్యేనా..?

టెస్లాకు ఉన్న డిమాండ్ ఏమిటి?

బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే తమ కార్లపై పన్ను రేటును మినహాయించాలని టెస్లా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం, టెస్లా భారతదేశంలో కార్ల తయారీని ప్రారంభించే ఆలోచనలో లేదు, బదులుగా కంపెనీ తన కార్లను చైనా లేదా యుఎస్ నుండి దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా జూలై 2021లో రవాణా మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

టెస్లా (Tesla) విషయంలో 'తగ్గేదేలే' అంటున్న భారత సర్కార్.. మరి టెస్లా కల నిజమయ్యేనా..?

ప్రస్తుతం, భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లపై 60 నుంచి 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోంది. టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే, ఉత్పత్తి ప్రోత్సాహక పథకం (పిఎల్‌ఐ) కింద మాత్రమే ప్రయోజనాలు అందించబడతాయని పరిశ్రమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకోసం టెస్లా భారతదేశంలోని స్థానిక తయారీదారుల నుండి 500 మిలియన్ డాలర్ల విలువైన ఆటో విడిభాగాలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

టెస్లా (Tesla) విషయంలో 'తగ్గేదేలే' అంటున్న భారత సర్కార్.. మరి టెస్లా కల నిజమయ్యేనా..?

10 లక్షల యూనిట్ల బ్యాటరీలను తయారు చేసిన టెస్లా

ఇదిలా ఉంటే, టెస్లా ఈ ఏడాది జనవరిలో తన ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించేందుకు 4680-రకం బ్యాటరీ సెల్‌లను ఒక మిలియన్ (పది లక్షల) యూనిట్ల తయారీని పూర్తి చేసింది. ఈ కొత్త తరం బ్యాటరీని మోడల్ వై (Tesla Model Y) లో ఉపయోగించనున్నట్లు టెస్లా తెలిపింది. టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కార్లు యూఎస్‌లోని టెక్సాస్‌లో ఉత్పత్తి చేయబడుతున్నాయి. టెస్లా తన కొత్త తరం 4680-రకం ఈవీ బ్యాటరీ ప్యాక్‌ను 2020 నుండి తయారు చేస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఈ బ్యాటరీ ఉత్పత్తి రేటును కంపెనీ వెల్లడించలేదు.

టెస్లా (Tesla) విషయంలో 'తగ్గేదేలే' అంటున్న భారత సర్కార్.. మరి టెస్లా కల నిజమయ్యేనా..?

కొత్త తరం 4680-రకం లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు మరింత శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి మరియు ఎక్కువ శక్తి నిల్వ సామర్థ్యంతో వస్తాయి, ఫలితంగా ఈ బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రిక్ కార్ల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. ఇది మొదట్లో టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించబడుతుంది, తరువాతి దశలో, ఈ అమెరికన్ కార్ బ్రాండ్ ఈ బ్యాటరీ సెల్‌ను ఇతర EVలలో కూడా ఉపయోగిస్తుంది.

టెస్లా (Tesla) విషయంలో 'తగ్గేదేలే' అంటున్న భారత సర్కార్.. మరి టెస్లా కల నిజమయ్యేనా..?

టెక్సాస్‌లో తయారైన టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కార్లు ఈ త్రైమాసికం ముగిసేలోపు మార్కెట్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 2020లో బ్యాటరీ డే ఈవెంట్‌లో టెస్లా వెల్లడించినట్లుగా, 4680 లిథియం-అయాన్ బ్యాటరీ సెల్ స్ట్రక్చరల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది మరియు ఇది కొత్త సెల్ ఫార్మాట్. ఈ 4680 బ్యాటరీ సెల్‌లు పెద్ద పరిమాణంలో వస్తాయి, అంటే ఇవి ప్రస్తుతం వాడుకలో ఉన్న రకం 2170 బ్యాటరీ సెల్‌ల కంటే ఐదు రెట్లు ఎక్కువ శక్తిని నిల్వ చేయగలవు. ఫలితంగా, వీటిని ఉపయోగించే ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ కూడా అధికంగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Electric carmaker tesla will not get special benefit in india says heavy industry ministry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X