ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా థార్ ఈవీ (Mahindra Thar EV) ఇలాగే ఉంటుందా..?

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ థార్ గురించి వాహన ప్రియులకు కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఇటీవల వచ్చిన కొత్త తరం థార్ ఇటు సెలబ్రిటీలను అటు సామాన్య కస్టమర్లను ఇద్దరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఒకవేళ ఇందులో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా లభిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ఆలోచనే వచ్చంది ఓ డిజైనర్‌కి వెంటనే థార్ ఈవీ చిత్రాలను రెండర్ చేసి, ఆన్‌లైన్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది.

ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా థార్ ఈవీ (Mahindra Thar EV) ఇలాగే ఉంటుందా..?

భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే అన్న విషయం ప్రస్తుత ఈవీ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో, ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించి, మహీంద్రా థార్ ఈవీ యొక్క కొన్ని వాస్తవిక రెండరింగ్‌లు బింబుల్ డిజైన్స్ తయారు చేసింది. శిలాజ ఇంధనాల లభ్యత తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో ఏదో ఒకరోజు ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మారాల్సిందే. ప్రస్తుతానికి మహీంద్రా ఆల్-ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియో నుండి చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఈ భారతీయ ఆటో దిగ్గజం కొత్త EVలను విడుదల చేయడానికి ఎంతో దూరంగా మాత్రం లేదు.

నిజానికి, Reva మరియు e2o వంటి ఎలక్ట్రిక్ వాహనాలతో భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసిన మొట్టమొదటి మెయిన్ స్ట్రీమ్ ఆటోమోటివ్ బ్రాండ్‌లలో మహీంద్రా ఒకటి. మహీంద్రా ఈవెరిటో పేరుతో ఓ ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది. మహీంద్రా రానున్న రోజుల్లో బహుళ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలనే ఆలోచనతో ఉంది. ఈ మేరకు జులై 2022 నెలలో తమ కొత్త ఈవీ లైనప్ ను కూడా ఆవిష్కరించనుంది. అయితే, మహీంద్రా ఇంకా ఎలక్ట్రిక్ థార్‌ను ఊహించలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, దీనికి మంచి స్కోప్ అయితే ఉంది.

ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా థార్ ఈవీ (Mahindra Thar EV) ఇలాగే ఉంటుందా..?

బింబుల్ డిజైన్స్ అనేది ఆటోమోటివ్ స్కెచ్‌లను డిజైన్ చేసే ఓ వ్యక్తిగత బ్లాగ్. బింబుల్ డిజైన్స్ నిర్మించిన తాజా రెండరింగ్ మహీంద్రా థార్ ఈవీ. ఇది నిజమైన కార్, కాదు ఊహించిన కంప్యూటర్ లో తయారు చేసిన డిజైన్. అయితే, ఇది చాలా స్పష్టంగా ఉంది మరియు థార్ ఈవీ ఎలా ఉండాలని బింబుల్ డిజైన్‌లు భావిస్తున్నాయో తెలియజేస్తుంది. డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా, దీని ఓవరాల్ సిల్హౌట్ ప్రస్తుత మహీంద్రా థార్‌ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇందులోని స్టైలింగ్ ఎలిమెంట్స్ చాలా మోడ్రన్ గా కనిపిస్తాయి.

ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా థార్ ఈవీ (Mahindra Thar EV) ఇలాగే ఉంటుందా..?

మహీంద్రా థార్ ఈవీ రెండర్ ఇమేజ్ లో ముందుగా మీ దృష్టిని ఆకర్షించే మొదటి అంశం, ఇందులో భారీ టైర్లు. ఇవి గాలిలేని టైర్లు (న్యుమాటిక్ టైర్లు) మరియు ఇవి ఘనమైన నిర్మాణం కలిగి ఉండి షాక్‌లను గ్రహించే రంధ్రాలను కలిగి ఉంటాయి. మీరు టైర్‌లను బాగా పరిశీలించిన తర్వాత మాత్రమే రెండరింగ్‌లోని ఇతర అంశాలు మీ దృష్టికి వస్తాయి. మహీంద్రా థార్ ఈవీ ముందు భాగంలో మధ్యలో ఉండే ఎల్ఈడి లైట్ బార్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. బంపర్ గ్రిల్‌లో ఇది దాదాపు సగం వరకు విస్తరించి ఉంటుంది.

ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా థార్ ఈవీ (Mahindra Thar EV) ఇలాగే ఉంటుందా..?

థార్ ఈవీ రెండర్ ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి ఇందులో గాలి ప్రవాహానికి అవసరమైన రేడియేటర్ గ్రిల్ కనిపించదు. ఇంకా ఇందులో డోర్‌లకు అదనపు రక్షణ ఉంటుంది, ఫెండర్‌లకు ఎక్స్‌టెన్షన్‌లు కూడా ఉన్నాయి, రూఫ్ కూడా కస్టమ్ ర్యాక్‌ను పొందుతుంది మరియు అది టెంట్‌కు మద్దతుగా ఉంటుంది. ఇది కంప్యూటర్ డిజైన్ కాబట్టి, బింబుల్ వారి రెండర్‌కు సరైన పవర్‌ట్రెయిన్ స్పెక్స్‌ను నిజంగా వెల్లడించలేదు. అయితే, దీనికి ఓ మంచి 200 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేసే పవర్‌ట్రైన్ అయితే సరిపోతుందనేది మా అభిప్రాయం.

మహీంద్రా థార్ యొక్క రాబోయే మోడళ్ల గురించి ఇప్పటికే కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. మహీంద్రా థార్ లో ఇప్పటికే కంపెనీ 5-డోర్ వెర్షన్ పై పనిచేస్తున్నట్లు సమాచారం. ఆఫ్-రోడ్ మరియు ఆన్-రోడ్ సామర్థ్యాలతో పాటు ఎక్కువ స్థలాన్ని కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ ప్రత్యేకమైన థార్ వేరియంట్ ను తీసుకువచ్చే అవకాశం ఉంది. మహీంద్రా థార్ ప్రస్తుతం ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న హై-డిమాండ్ మోడల్ గా ఉంది. ఇప్పటికే, ఈ మోడల్ కోసం వేలాంది మంది కస్టమర్లు క్యూలో ఉన్నారు, ఫలితంగా దీని వెయిటింగ్ పీరియడ్ కూడా సాధారణం కన్నా అధికంగా ఉంటోంది.

ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా థార్ ఈవీ (Mahindra Thar EV) ఇలాగే ఉంటుందా..?

మహీంద్రా బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ విక్రయిస్తున్న సరికొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ మరియు కొత్త ఎక్స్‌యూవీ700 వంటి మోడళ్లకు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా, కంపెనీ అమ్మకాలు ప్రతినెలా స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. గడచిన మే 2022 నెలలో మహీంద్రా మొత్తం 53,726 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, ఇవి రెండింతలకు పైగా వృద్ధిని చెందాయి.

Source: Bimble Designs

Most Read Articles

English summary
Electric version mahindra thar ev rendered images goes viral
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X