టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి ఇన్నోవా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది భారతదేశంలోనే కాకుండా, పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ బ్రాండ్‌కి ఓ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా ఉంది. టొయోటా ఇన్నోవా (Toyota Innova) ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. కంపెనీ ఇందులో ఓ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది.

టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

తాజాగా, టొయోటా ఇన్నోవా ఈవీ (Toyota Innova EV) ఎలక్ట్రిక్ కారును కంపెనీ జకార్తాలో ఆవిష్కరించింది. జకార్తాలోని ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో కంపెనీ ఈ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎమ్‌పివిని ప్రదర్శించింది. ఇన్నోవా ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన కొంత సమయానికే, ఇది ఇంటర్నెట్‌లో ఓ చర్చనీయాసంగా మారిపోయింది. ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్ చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. అందరూ ఈ ఎలక్ట్రిక్ కారు త్వరలోనే ప్రొడక్షన్ దశకు చేరుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

టొయోటా మాత్రం తమ ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతానికి ఓ కాన్సెప్ట్ వాహనం మాత్రమేనని, పరిశోధన (రీసెర్చ్) ప్రయోజనం కోసమే దీనిని సృష్టించామని, ప్రస్తుతానికి ఈ కారును వాణిజ్య పరంగా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. దీంతో టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి.

టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

టొయోటా ఇన్నోవా ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన యుటిలిటీ వాహనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నేటి ఆధునిక కార్లతో పోల్చుకుంటే, ఇది అత్యంత ఫీచర్-లోడెడ్ ఎమ్‌పివి కాకపోయినప్పటికీ, ఇందులో అత్యంత శక్తివంతమైన ఇంజన్ లేకపోయినప్పటికీ, ఇది ప్రపంచంలోని అత్యంత విశ్వసనీయమైన వాహనాలలో ఒకటిగా పరిగణించడం జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం దాని ప్రాక్టికాలిటీ మరియు సస్టైనబిలిటీ.

టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

టొయోటా ఇన్నోవా ఇంజన్ ఎలాంటి మేజర్ మెకానికల్ బ్రేక్‌డౌన్ లేకుండా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అందుకే సెలబ్రిటీల నుండి క్యాబ్ డ్రైవర్ల వరకూ అందరూ ఇదే కారును తమ ఫేవరేట్ కారుగా ఎంచుకుంటుంటారు. టొయోటా ఇన్నోవా అంతటి విశ్వసనీయతను దక్కించుకుంది. అయితే, ప్రతి ఉత్పత్తి కూడా కాలానికి అనుగుణంగా మారాల్సి ఉంటుంది. టొయోటా ఇండోనేషియాలో Innova EV ని ప్రదర్శించినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్నోవా కాలానికి అనుగుణంగా మారే సమయం ఆసన్నమైందని భావించారు. అయితే ఇప్పుడు దాని ప్రొడక్షన్ వెర్షన్ రాకపై కంపెనీ మరింత క్లారిటీ ఇచ్చింది.

టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

ఇండోనేషియాలోని టొయోటా ఆస్ట్రా మోటార్ యొక్క మార్కెటింగ్ డైరెక్టర్ ఆంటోన్ జిమ్మీ సువాండీని ఆటోనెట్ మాగ్జ్ ఉటంకిస్తూ, "కిజాంగ్ ఇన్నోవా ఎలక్ట్రిక్ మేము విక్రయించే కారు కాదు. కాబట్టి ఇది కేవలం ఒక కాన్సెప్ట్ మాత్రమే మరియు దీని స్వభావం కేవలం ఇంజనీరింగ్ అభివృద్ధికి మాత్రమే." అంటూ పేర్కొన్నారు. ఈ ఒక్క ప్రకటనతో ఇన్నోవా ఈవీ కేవలం డిస్‌ప్లే కారు మాత్రమేనని నిర్ధారణ అయ్యింది. ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్‌ను ఈ జపనీస్ బ్రాండ్ తమ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోంది.

టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

ఆగ్నేయ ఆసియా మార్కెట్ల కోసం అభివృద్ధి చేయబడుతున్న భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలకు టొయోటా ఇన్నోవా ఈవీ ఒక ఉత్తమ ఎంపికగా ఉంటుంది. టొయోటా ఆసియా-పసిఫిక్ ఇంజనీరింగ్ విభాగం ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్‌ను తయారు చేసింది మరియు ఈ బృందం టొయోటా మరియు డైహట్సు రెండింటికీ వాహనాల అభివృద్ధిపై పని చేస్తుంది. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను అంచనా వేయడానికి ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్ కేస్ స్టడీగా ప్రదర్శించబడింది.

టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

వాస్తవానికి, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే, వాటి ధర అధికంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో అవి అందించే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికే అత్యంత విశ్వసనీయమైన వాహనంగా పేరు తెచ్చుకున్న టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో కూడా అందుబాటులోకి వస్తే, అది ఖచ్చితంగా విజయం సాధించగలదు.

టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

కానీ, టొయోటా మాత్రం తమ ఇన్నోవా ఈవీ విషయంలో వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమ మార్కెట్ అధ్యయనం పూర్తయిన తర్వాత, దానిపై కంపెనీ పూర్తిగా సంతృప్తి చెందినప్పుడు టొయోటా ఇన్నోవాను ఎలక్ట్రిక్ కారును రోడ్లపై పరుగులు పెట్టించే అవకాశం ఉంటుంది. ఇన్నోవా ఇప్పటికే టొయోటా నుండి అత్యంత విశ్వసనీమైన బ్రాండ్‌గా ఉంది మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో టొయోటా సంస్థకు ముందస్తు అనుభవం కూడా ఉంది. మరి ఈ కారును మార్కెట్లో లాంచ్ చేయడానికి కంపెనీ ఏందుకు ఆలోచిస్తుంది?

టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

ఇందుకు సమాధానం టొయోటా ఇన్నోవాను తయారు చేస్తున్న ప్లాట్‌ఫామ్. ఇది పాత కాలపు బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణంతో మరియు లాడర్-ఫ్రేమ్‌పై తయారవుతుంది. ఇలాంటి ఫ్రేమ్ సెటప్ ఎలక్ట్రిక్ వాహనానికి అంత సరైనది కాదు, ఎందుకంటే వాహనం క్రింది భాగంలో బ్యాటరీలను మౌంట్ చేయడానికి అవసరమైన స్థలం ఇలాంటి ఫ్రేమ్‌లలో ఉండదు. ఒకవేళ టొయోటా బానెట్ కింద బ్యాటరీ మరియు మోటారును అమర్చాలని నిర్ణయించుకుంటే, అప్పుడు కారు బరువు బ్యాలెన్స్ తప్పుతుంది ఫలితంగా కారు హ్యాండ్లింగ్ కూడా ఇబ్బందిగా మారుతుంది.

టొయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు కేవలం కాన్సెప్ట్‌కే పరిమితమా..? ఇది నిజంగా రోడ్లపైకి రాదా..?

బహుశా, ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకునే టొయోటా తమ ప్రస్తుత తరం ఇన్నోవా ఈవీని ఉత్పత్తి దశకు దూరంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ, కంపెనీ తమ కొత్త తరం ఇన్నోవాను పూర్తిగా సరికొత్త మాడ్యులర్ లేదా మోనోకాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయగలిగినట్లయితే, ఇందులో ఎలాంటి పవర్‌ట్రైన్‌ను అయినా సులువుగా ఉపయోగించవచ్చు కాబట్టి, ఇన్నోవా ఈవీ తమ కాన్సెప్ట్ పరదాలను తొలగించుకొని వాస్తవ రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంటుంది. మరి అందరిలాగే మీరు కూడా ఇన్నోవా ఈవీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారా..?

Most Read Articles

English summary
Electric version toyota innova concept is just a reasearch project will it be produced commercially
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X