భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్

అమెరికన్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తమ ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారం ప్రారంభించడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఈ అమెరికన్ కార్ కంపెనీ దాదాపు సంవత్సరానికి పైగా భారత ప్రభుత్వంతో బేరసారాలు సాగిస్తూనే ఉంది. ఇంపోర్టెడ్ కార్లపై సుంకాలు తగ్గించమని టెస్లా కోరుతుంటే, మీరు భారత్‌లో కార్లు తయారు చేయండి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో, తాజాగా టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్లా భారతదేశంలోకి రావడానికి ఆయన కొన్ని షరతులు విధించారు.

భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్

ప్రపంచంలోని అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ భారతదేశంలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశంపై టెస్లాకు అవసరమైన పరిస్థితులను వెల్లడించారు. భారతదేశంలోకి స్టార్‌లింక్ ప్రవేశం గురించిన ప్రశ్నతో ప్రారంభమైన సంభాషణలో, భారతదేశంలో టెస్లా తయారీ కర్మాగారం యొక్క అవకాశాల గురించి ట్విట్టర్ యూజర్ మధుసూధన్ వి అడిగిన ప్రశ్నకు మస్క్ బదులిస్తూ "మేము కార్లు విక్రయించడానికి మరియు సర్వీస్ చేయడానికి అనుమతి లేని ఏ ప్రదేశంలోనైనా టెస్లా తమ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయదు" అని మస్క్ సమాధానమిచ్చారు.

భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్

టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడాన్ని మస్క్ మరియు భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. టెస్లా భారతదేశానికి వస్తున్నట్లు చాలా కాలంగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. టెస్లా ప్రకారం, ఈ అమెరికన్ కార్ బ్రాండ్ ముందుగా విదేశాలలో తయారు చేసిన టెస్లా కార్లను భారతదేశంలోకి దిగుమతి చేసుకొని, ఇక్కడ విక్రయించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత తమ కార్లకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు గుర్తిస్తే, ఇక్కడే ఓ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని కంపెనీ గతంలో వెల్లడించింది.

భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్

భారతదేశంలో టెస్లాను అధికారికంగా ప్రారంభించాలనుకుంటున్నట్లు ఎలోన్ మస్క్ గతేడాది ఓ సందర్భంలో తెలిపాడు. అయితే, ప్రస్తుతం భారతదేశంలో దిగుమతి చేసుకునే కార్లపై ఉన్న భారీ దిగుమతి సుంకాలు ఈ విషయంలో పెద్ద సవాలుగా మారాయని ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ పేర్కొన్నాడు. టెస్లా తమ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని గత కొంత కాలంగా భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే ఈ చర్యను ఇప్పటికే భారతదేశంలోని ఇతర తయారీదారులు తీవ్రంగా వ్యతిరేకించారు.

భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్

దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల స్థానిక తయారీలో పెట్టుబడులు దెబ్బతింటాయని ఈ తయారీదారులు వాదించారు. దీంతో ప్రభుత్వం కూడా ఇందుకు నో చెప్పింది. టెస్లాకో న్యాయం, ఇతర కంపెనీలకు ఓ న్యాయం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెస్లాతో పరిస్థితిపై భారత ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే, భారతదేశంలో పెట్టుబడి పెట్టండి మరియు ప్రయోజనాలను పొందండి అని ప్రభుత్వం చెబుతోంది. గతంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయంపై పలుమార్లు మాట్లాడారు.

భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్

టెస్లా తన ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో తయారు చేయడానికి ఎంచుకుంటే, ఆ కంపెనీకి అనేక ప్రయోజనాలు ఉంటాయని మరియు ఈ కంపెనీ భారతదేశాన్ని ఓ ఎగుమతి కేంద్రంగా కూడా ఉపయోగించుకోవచ్చని గడ్కరీ పేర్కొన్నారు. అయితే, టెస్లా మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా ముందు ఓ రాయి వేసి చూద్దామని, దిగుమతి రూట్ ను ఎంచుకుంది. ఒకవేళ, టెస్లా అనుకున్నట్లుగా భారతదేశంలో ఆ కార్లకు డిమాండ్ ఉంటే సరేసరి, లేదంటే పైసా ఖర్చు లేకుండా ఇక్కడి నుండి మాకం సర్దేయవచ్చనేది టెస్లా అభిప్రాయం కాబోలు.

భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్

ప్రస్తుతం, విదేశాలలో తయారైన కార్లను భారతదేశంలోకి తీసుకురావాలని చూస్తున్న కార్ల తయారీదారులు భారీ మొత్తంలో దిగుమతి సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పూర్తిగా నిర్మించిన యూనిట్లుగా (CBUలు) గా దిగుమతి చేసుకున్న కార్లపై వాటి విలువలో దాదాపు 60 నుండి 100 శాతం వరకు దిగుమతి సుంకాలు ఉంటాయి. ధర, బీమా మరియు సరుకు (CIF)తో సహా $40,000 కంటే తక్కువ విలువ కలిగిన కార్లపై దాదాపు 60 శాతం దిగుమతి పన్ను విధించబడుతుంది. ఆ విలువను మించిన వాహనాలకు 100 శాతం దిగుమతి పన్ను విధించబడుతుంది.

భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్

అంటే, విదేశాలలో 40,000 డాలర్ల ఖరీదు చేసే కారుని భారతదేశానికి దిగుమతి చేసుకుంటే, దాని ధర దాదాపు 64,000 డాలర్లకు చేరుతుంది. అదే 50,000 డాలర్ల ఖరీదు చేసే కారుని ఇండియాకు దిగమతి చేసుకుంటే, దాని ధర దాదాపు లక్ష డాలర్లు అవుతుంది. అందుకే, భారతదేశానికి దిగుమతి అయ్యే లగ్జరీ కార్ల ఖరీదు సామాన్యులు కొనలేంతగా ఉంటాయి.

భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్

టెస్లా ముందుగా ఇంపోర్టెడ్ మార్గాన్ని ఎంచుకోవడానికి బలమైన కారణమే ఉంది. అదేంటంటే, మన పొరుగు దేశమైన చైనాలో టెస్లాకు ఓ కార్ల తయారీ ప్లాంట్ ఉంది. అక్కడ తయారైన కార్లను ఈ అమెరికన్ కంపెనీ అనేక ఆసియా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. అవే కార్లను భారతదేశానికి తీసుకురావడానికి టెస్లా పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అందుకే, తమ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించమని కంపెనీ భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. కానీ, ప్రస్తుత ఇండో-చైనా వ్యాపార పరిస్థితులు అంత సానుకూలంగా లేవు.

భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్

భారతదేశంలోకి టెస్లా ప్రవేశం స్వాగతించదగ్గదే అయినప్పటికీ, ఈ కంపెనీ చైనాలో తయారు చేసిన కార్లను భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని నితిన్ గడ్కరీ గతంలో తెలిపారు.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Elon musk hints his conditons to setup tesla manufacturing plant in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X