ఆ దేశాలలో పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం.. ఇక వారికి ఎలక్ట్రిక్ కార్లే దిక్కు..!

భూమిలో శిలాజ ఇంధనాలు (పెట్రోల్, డీజిల్ మొదలైన సహజంగా లభించే ఇంధనాలు) అంతరించిపోతున్న నేపథ్యంలో, యావత్ ప్రపంచం ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ఆశగా చూస్తోంది. ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలలో ప్రస్తుతం విరివిగా మరియు తక్కువ ధరకే లభించేది ఎలక్ట్రిసిటీ. కాబట్టి, ఆటోమొబైల్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో, వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వాలు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఆ దేశాలలో పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం.. ఇక వారికి ఎలక్ట్రిక్ కార్లే దిక్కు..!

యూరోపియన్ యూనియన్ (EU) రాబోయే 2035 సంవత్సరం నుండి శిలాజ ఇంధనాలతో (పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్) నడిచే కార్ల అమ్మకాలను నిషేధించే ప్రతిపాదనను ఆమోదించింది. యూరోపియన్ పార్లమెంట్ నుండి చట్టసభ సభ్యులు ఈ ప్రతిపాదనను బలహీనపరిచే ప్రయత్నాలను తిరస్కరించారు మరియు బదులుగా 2035 సంవత్సరం నుండి కొత్త పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ కార్ల అమ్మకాలపై ఈయూ వ్యాప్తంగా నిషేధం విధించారు.

ఆ దేశాలలో పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం.. ఇక వారికి ఎలక్ట్రిక్ కార్లే దిక్కు..!

ఈ వారం ప్రారంభంలో యూరోపియన్ చట్టసభ సభ్యులు అంగీకరించిన ప్రతిపాదన ప్రకారం, వాహన తయారీదారులు 2035 నాటికి కార్బన్-డయాక్సైడ్ ఉద్గారాలను నూటికి నూరు శాతం తగ్గించాలి, ఇది రాబోయే దశాబ్దం మధ్య నుండి కొత్త ICE పవర్డ్ కార్ రిజిస్ట్రేషన్‌లను సమర్థవంతంగా నిలిపివేస్తుంది.

ఆ దేశాలలో పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం.. ఇక వారికి ఎలక్ట్రిక్ కార్లే దిక్కు..!

యూరోపియన్ యూనియన్‌లో కొత్త శిలాజ ఇంధనంతో నడిచే కార్ల అమ్మకాలను నిలిపివేయడానికి ఎంచుకున్న సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ రోజు కొత్త కార్లు రోడ్లపై దాదాపు 10 నుండి 15 సంవత్సరాల పాటు కొనసాగుతుండటంతో, EU శిలాజ ఇంధనంతో నడిచే కార్ల విక్రయాలను ముగించడానికి అనుమతించే చివరి సంవత్సరం 2035 అవుతుంది. తద్వారా 2050లో నికర సున్నా ఉద్గారాలకు వెళ్లాలను ఈయూ లక్ష్యానికి మార్గం సుగమం అవుతుంది.

ఆ దేశాలలో పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం.. ఇక వారికి ఎలక్ట్రిక్ కార్లే దిక్కు..!

ఈ విషయంలో ఈయూ చట్టసభ సభ్యులలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, గత సంవత్సరం యూరోపియన్ కమీషన్ మొదటిసారిగా ప్రతిపాదించిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా చాలా తక్కువ మంది ఓటు వేశారు. అయితే, చాలా మంది కార్ల తయారీదారులు గతంలో కొత్త ప్రతిపాదనకు మద్దతుగా నిలిచారు. రాబోయే 2035 నుండి ఈ ఖండంలో దహన ఇంజన్ కార్ల అమ్మకాలను నిలిపివేస్తామని జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ కూడా గతంలో ఓ సందర్భంలో పేర్కొంది. అలాగే, అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ మరియు స్వీడన్ కార్ బ్రాండ్ వోల్వో రెండూ కూడా యూరోపియన్ కమిషన్ ప్రతిపాదనకు మద్దతుగా ముందుకు వచ్చాయి.

ఆ దేశాలలో పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం.. ఇక వారికి ఎలక్ట్రిక్ కార్లే దిక్కు..!

అయితే, 2035 నాటికి కర్బన ఉద్ఘారాలను 90 శాతం తగ్గించాలని కోరుకునే రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మంది నుండి వ్యతిరేకత వచ్చింది. జర్మన్ ఆటో అసోసియేషన్ VDA 2035 లక్ష్యాన్ని తిరస్కరించడానికి చట్టసభ సభ్యులను లాబీయింగ్ చేసిందని ఓ నివేదిక పేర్కొంది. ప్రత్యామ్నాయ లో-కార్బన్ ఇంధనాలపై జరిమానా విధించబడింది మరియు ఛార్జింగ్ మౌళిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం ఓ తొందరపాటు చర్య అని సదరు నివేదిక పేర్కొంది.

ఆ దేశాలలో పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం.. ఇక వారికి ఎలక్ట్రిక్ కార్లే దిక్కు..!

యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం అందించిన డేటా ప్రకారం, గత ఏడాది ఈయూలో విక్రయించిన కొత్త ప్యాసింజర్ కార్లలో ఎలక్ట్రిక్ కార్లు మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలు కేవలం 18 శాతం మాత్రమే ఉన్నాయి. ఆటో పరిశ్రమను ఇప్పటికీ పీడిస్తున్న సెమీకండక్టర్ కొరత కారణంగా గత ఏడాది విక్రయాల సంఖ్య భారీగా తగ్గింది.

ఆ దేశాలలో పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం.. ఇక వారికి ఎలక్ట్రిక్ కార్లే దిక్కు..!

యూరోపియన్ పార్లమెంట్‌లోని ఓటు 1990లో కొలిచిన స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి ఉద్గార స్థాయిలను 55 శాతం తగ్గించాలనే దాని ప్రణాళికలలో కీలకమైన స్తంభాన్ని నిలబెట్టడానికి మూటి-నేషన్ బ్లాక్‌కి సహాయం చేస్తుంది. ప్రస్తుతం EU యొక్క గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 15 శాతం అక్కడి రోడ్లపై తిరుగుతున్న వాహనాల నుండే వస్తోంది. కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు మరియు భవిష్యత్తు కోసం శిలాజ ఇంధనాలను పరిరక్షించేందుకు ఈ చర్య ఎంతగానో సహాయపడనుంది.

ఆ దేశాలలో పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం.. ఇక వారికి ఎలక్ట్రిక్ కార్లే దిక్కు..!

ఐరోపాలో పెట్రోల్/డీజిల్, హైబ్రిడ్ కార్లను పూర్తిగా నిషేధించడం అంటే అది అంత సులువైన విషయం కాదు. ఇందుకు కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఐరోపా పార్లమెంట్‌లో ఓటింగ్ అంటే ఈ ప్రతిపాదన ఇంకా చట్టంగా మారిందని అర్థం కాదు. యూరోపియన్ పార్లమెంట్ ఇప్పుడు తుది చట్టంపై వివిధ సభ్య దేశాలతో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఈ విషయంలో ఓ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆ దేశాలలో పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం.. ఇక వారికి ఎలక్ట్రిక్ కార్లే దిక్కు..!

పార్లమెంటులో ప్రవేశపెట్టిన కొత్త ఓటు ఇప్పుడు స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత త్వరగా మారడానికి ఆటోమేకర్లను ప్రోత్సహిస్తుంది మరియు అదే సమయంలో కొనుగోలుదారులు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా వత్తిడి తెస్తుంది. యూరోపియన్ యూనియన్ 2025 నాటికి 1 మిలియన్ కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ మరియు హైడ్రోజన్ ఛార్జింగ్ స్టేషన్‌ల కోసం ఇన్‌స్టాల్ చేయడానికి ప్లాన్ చేయడంతో పాటుగా అనేక విధాలుగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. తెలుగులో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
European union to ban sale of petrol diesel cars from 2035 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X