ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

ఈ దీపావళి పండుగకి మీరు ఏదైనా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, దేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ కంపెనీ అయిన మారుతి సుజుకి, ఈ పండుగ సీజన్‌లో తమ కార్లపై భారీ డిస్కౌంట్లు మరియు వివిధ రకాల నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ధన్‌తేరాస్ మరియు దీపావళి పండుగల సందర్భంగా, మారుతి సుజుకి ఈ అక్టోబర్ 2022 నెలలో ఎంపిక చేసిన కార్లపై ఏకంగా రూ. 56,000 వరకు తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మారుతి సుజుకి ఎస్-ప్రెసో, డిజైర్, సెలెరియో, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ మరియు ఆల్టో మోడళ్లపై కంపెనీ తగ్గింపులను అందిస్తోంది. ఈ ఆఫర్‌లలో ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నగదు తగ్గింపులు మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉంటాయి. ఈసారి మారుతి సుజుకి తమ వివిధ రకాల CNG కార్లైప కూడా ఆఫర్లను అందిస్తోంది. మరి ఈ నెలలో ఏయే కారుపై ఎంత మేర ఆదా చేసుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

గడచిన జులై 2022 నెలలోనే మారుతి సుజుకి తమ ఎస్-ప్రెసోలో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ నెలలో ఎస్ ప్రెస్సో మాన్యువల్ వేరియంట్‌పై కంపెనీ గా రూ.56,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లలో ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 15,000, నగదు తగ్గింపు రూ. 35,000, మరియు కార్పొరేట్ డిస్కౌంట్లు రూ. 6,000 ఉన్నాయి. అలాగే, ఎస్-ప్రెస్సో ఏఎమ్‌టి వెర్షన్లపై కంపెనీ రూ. 46,000 వరకు ఆఫర్‌లను అందిస్తోంది. కొత్త అప్‌డేటెడ్ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ధరలు రూ. 4.25 లక్షల నుండి రూ. 5.99 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

కొత్త అప్‌డేటెడ్ 2022 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కె10సి (K10C) పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులోని 998 సీసీ, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ డ్యూయల్ జెట్ మరియు డ్యూయల్ వివిటి టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 65.7 బిహెచ్‌పి శక్తిని మరియు 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. మ్యాన్యువల్ వేరియంట్లు లీటరుకు 24.12 కిమీ మైలేజీని మరియు ఏజిఎస్ ఆటోమేటిక్ వేరియంట్లు లీటరుకు 25.30 కిమీ మైలేజీని అందిస్తాయి.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ డిజైర్ పై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ. 52,000 వరకూ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులోని ఏఎమ్‌టి వేరియంట్‌లపై రూ. 52,000 ఆఫర్లను అందిస్తున్నారు. ఈ ఆఫర్లలో రూ. 35,000 నగదు తగ్గింపులు, రూ. 7,000 కార్పొరేట్ తగ్గింపులు మరియు రూ. 10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి. ఇకపోతే, ఇందులోని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లపై రూ.17,000 డిస్కౌంట్ మాత్రమే అందిస్తున్నారు.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మార్కెట్లో డిజైర్ ధరలు రూ.6.24 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. మారుతి సుజుకి డిజైర్‌లో 1.2-లీటర్, 4-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మారుతి సుజుకి సెలెరియో

ఈ అక్టోబర్ నెలలో మారుతి సుజుకి సెలెరియో యొక్క మాన్యువల్ వెర్షన్‌పై కంపెనీ రూ. 51,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 6,000 కార్పొరేట్ తగ్గింపు మరియు రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి. కాగా, సెలెరియో యొక్క ఏఎమ్‌టి వేరియంట్లపై రూ.41,000 ఆఫర్లు మరియు సిఎన్‌జి మోడళ్లపై రూ. 10,000 తగ్గింపును అందిస్తున్నారు. మార్కెట్లో సెలెరియో ధరలు రూ. 5.25 లక్షల నుండి రూ. 7.52 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మారుతి సుజుకి సెలెరియోలో 1.0-లీటర్ కె10సి డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 66 బిహెచ్‌పి పవర్ ను మరియు 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లబిస్తుంది. కొత్త సెలెరియో లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజీతో ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత మెరుగైన ఇంధన సామర్థ్యం కలిగిన హ్యాచ్‌బ్యాక్‌గా నిలుస్తుంది. ఇందులోని సెలెరియో సిఎన్‌జి మోడల్ మైలేజ్ కేజీకి 35 కిలోమీటర్లుగా ఉంటుంది.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి యొక్క పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ పై కంపెనీ ఈ నెలలో AMT వేరియంట్‌లపై రూ.47,000 వరకూ ప్రయోజనాలను అందిస్తుండగా మాన్యువల్ వేరియంట్‌లపై రూ.30,000 వరకూ ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం, మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు రూ.5.91 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. కంపెనీ ఇందులో ఇటీవలే సిఎన్‌జి మోడల్‌ను కూడా విడుదల చేసింది. సిఎన్‌జి మోడల్ స్విఫ్ట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు వరుసగా రూ.7.77 లక్షలు (విఎక్స్ఐ, సిఎన్‌జి) మరియు రూ.8.45 లక్షలు (జెడ్ఎక్స్ఐ, సిఎన్‌జి) గా ఉన్నాయి.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మారుతి సుజుకి స్విఫ్ట్ 1.2-లీటర్, డ్యుయల్‌జెట్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్‌లతో లభిస్తుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 23.20 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 23.76 కిలోమీటర్ల మైలేజీని మరియు సిఎన్‌జి వెర్షన్ కేజీకి 30.90 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మారుతి సుజుకి ఆల్టో K10

మారుతి సుజుకి ఇటీవలే తమ పెద్ద ఆల్టో కె10 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అక్టోబర్ 2022 నెలలో కంపెనీ ఆల్టో కె10 పై రూ. 39,500 తగ్గింపులను అందిస్తోంది. ఇందులో రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, మొత్తం రూ. 17,500 నగదు తగ్గింపు మరియు రూ. 7,000 విలువైన కార్పొరేట్ ప్రయోజనాలు కలిసి ఉన్నాయి. కొత్త ఆల్టో కె10 పాత ప్రస్తుత ఆల్టో 800 కన్నా పెద్ద ఇంజన్‌ను కలిగి ఉండటమే కాకుండా, పరిమాణంలో కూడా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం, మార్కెట్లో ఆల్టో కె10 ధరలు రూ. 3.99 లక్షల నుండి రూ. 5.84 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 66 బిహెచ్‌పి శక్తిని మరియు 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 5 స్పీడ్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. ఇందులోని మ్యాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.39 కిమీ మైలేజీని మరియు ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 24.90 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మారుతి సుజుకి ఆల్టో 800

చిన్న ఆల్టో (800సీసీ మోడల్) పై కంపెనీ ఈ నెలలో మొత్తంగా రూ. 36,000 తగ్గింపులను అందిస్తోంది. ఇది కూడా పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభిస్తుంది. ప్రస్తుతం, భారత మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి ఆల్టో 800 ఎక్స్-షోరూమ్ ధరలు రూ.3.39 లక్షల నుండి రూ.5.03 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ శాంత్రో, డాట్సన్ రెడీ-గో, రెనో క్విడ్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి చిన్న కార్లకు పోటీగా ఉంటుంది. ఇందులోని 800 సిసి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పి శక్తిని మరియు 69 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ దీపావళికి మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఏయే కారుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూడండి..!

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్గా పేరు గాంచిన వ్యాగన్ఆర్ పై కంపెనీ ఈ అక్టోబర్ 2022లో మొత్తం రూ. 31,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో వ్యాగన్ఆర్ ధరలు రూ.5.44 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఇది పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత మారుతి సుజుకి డీలరును సంప్రదించవచ్చు.

Most Read Articles

English summary
Festive offers on maruti suzuki cars benfits upto rs 56000 on select models
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X