కార్మికుల సమ్మె ప్రభావంతో చెన్నై ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని పొడగింపు: ఫోర్డ్ ఇండియా

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford), భారతదేశంలోని తమ చెన్నై ప్లాంట్ లో వాహనాల ఉత్పత్తిని మరికొన్ని రోజుల పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఇండియా ఉద్యోగుల నిరసనల మధ్య ఉత్పత్తిని పొడిగిస్తూ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్ కోసం వాహనాల ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ, దాని ఎగుమతి మార్కెట్ల కోసం ఇంకా పెండిగ్ ఆర్డర్లను తయారు చేయాల్సి ఉంది. విదేశాల నుంచి వచ్చిన ఆర్డర్లను ఫోర్డ్ ఇక్కడే భారతదేశంలో తయారు చేస్తుంది.

కార్మికుల సమ్మె ప్రభావంతో చెన్నై ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని పొడగింపు: ఫోర్డ్ ఇండియా

అయితే, ఫోర్డ్ కంపెనీలో గడచిన మే 30వ తేదీ నుండి కార్మికులు మెరుగైన విభజన ప్యాకేజీని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఈ ప్లాంట్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో కంపెనీ ఎగుమతి చేయాల్సిన వాహనాల వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగిపోయింది. కాగా, ఈ ప్లాంట్ లో పని చేయడానికి ఒక విభాగం ఉద్యోగులు అంగీకరించడంతో జూన్ 14, 2022 వ తేదీ నుండి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది. అయితే, కార్మికులు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే పనిచేస్తుండటంతో వాహనాల ఉత్పత్తి కూడా నెమ్మదిగా జరుగుతోంది.

కార్మికుల సమ్మె ప్రభావంతో చెన్నై ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని పొడగింపు: ఫోర్డ్ ఇండియా

ఈ నేపథ్యంలో, కంపెనీ తమ చెన్నై ప్లాంట్ లో వాహనాల ఉత్పత్తిని అనుకున్న గడువు తేదీ కన్నా మరికొంత సమయం పాటు పొడగిస్తున్నట్లు తెలిపింది. మెరుగైన ప్యాకేజీని డిమాండ్ చేస్తూ ఫోర్డ్ ప్లాంట్‌లోని ఉద్యోగులు వాహనాల తయారీని నిలిపివేసి సమ్మెకు దిగారు. ఫోర్డ్ ప్లాంట్‌లో దాదాపు 2600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, అయితే ఇప్పుడు కేవలం 300 మంది ఉద్యోగులు పనిని తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కంపెనీ ఇటీవల కార్మికులతో చర్చించిన తర్వాత తమ ప్లాంట్ ఉత్పత్తి షెడ్యూల్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.

కార్మికుల సమ్మె ప్రభావంతో చెన్నై ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని పొడగింపు: ఫోర్డ్ ఇండియా

ఈ విషయంపై ఫోర్డ్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడూతూ "జూన్ 9, 2022 నాటి ఉద్యోగుల క్యాస్కేడ్‌కు అనుగుణంగా, కంపెనీకి సానుకూల స్పందన వచ్చింది, విభజన ప్యాకేజీపై కొనసాగుతున్న చర్చలకు సమాంతరంగా ఉత్పత్తికి మద్దతు ఇవ్వడానికి చాలా మంది ఉద్యోగులు అంగీకరించారు. సుమారు 50 శాతం మంది శాశ్వత ఉద్యోగులు జూన్ 14 నుండి ఉత్పత్తికి మద్దతు ఇస్తున్నారు మరియు కంపెనీ ఉత్పత్తిని జులై 2022 చివరి వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ సమయంలో ఉత్పత్తికి మద్దతునిచ్చే ఉద్యోగులందరికీ వేతన రక్షణ లభిస్తుంది" అని చెప్పారు.

కార్మికుల సమ్మె ప్రభావంతో చెన్నై ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని పొడగింపు: ఫోర్డ్ ఇండియా

అలాగే, పూర్తయిన ప్రతి సంవత్సరానికి ఒక్కో ఉద్యోగికి దాదాపు 115 రోజుల వేతనాన్ని చెల్లించేందుకు ఆఫర్ చేసినట్లు ఫోర్డ్ పేర్కొంది. దీనితో పాటుగా, ఈ ఆఫర్ చట్టబద్ధమైన విభజన ప్యాకేజీ కంటే ఎక్కువగా ఉందని ఫోర్డ్ ఇండియా పేర్కొంది. "కార్మిక శాఖ పర్యవేక్షణలో విభజన ప్యాకేజీ యొక్క వివరాలు మరియు ప్రయోజనాలను వివరించడానికి ఉద్యోగులు మరియు యూనియన్ ప్రతినిధులతో నిర్మాణాత్మక సంభాషణ కోసం మేము ఎదురుచూస్తున్నాము" అని ఫోర్డ్ ప్రతినిధి మీడియాకు తెలిపారు.

కార్మికుల సమ్మె ప్రభావంతో చెన్నై ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని పొడగింపు: ఫోర్డ్ ఇండియా

క్యుములేటివ్ ప్యాకేజీ 87 రోజుల చివరిగా డ్రా చేసిన స్థూల వేతనానికి సమానమైన ఎక్స్ గ్రేషియా మొత్తానికి సంబంధించిందని ఫోర్డ్ పేర్కొంది. అలాగే, పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి రూ.50,000 నిర్ణీత మొత్తంలో రూ. 2.40 లక్షల మొత్తంతో సమానమైన సేవా ప్రయోజనాలకు మరియు మార్చి 2024 వరకు వైద్య బీమాకు అందించబడుతుందని కంపెనీ తెలిపింది. ఫోర్డ్ ప్రకారం, ఈ సంచిత మొత్తం కనిష్టంగా రూ. 30 లక్షలకు లోబడి మొత్తం రూ. 80 లక్షలకు పరిమితం చేయబడి ఉంటుంది.

కార్మికుల సమ్మె ప్రభావంతో చెన్నై ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని పొడగింపు: ఫోర్డ్ ఇండియా

ప్రస్తుతం, ఫోర్డ్ కంపెనీకి భారతదేశంలో విక్రయించాల్సిన పెండింగ్ ఆర్డర్లు లేకపోయినప్పటికీ, విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పెండింగ్ ఆర్డర్లు మాత్రం చాలానే ఉన్నాయి. కంపెనీ ఎగుమతి చేయాల్సిన వాహనాల ఉత్పత్తిని పూర్తి చేయడానికి చాలా పరిమిత సమయం మాత్రమే మిగిలి ఉందని మరియు జూన్ 14 నుండి ఉద్యోగులు ఉత్పత్తిని పునఃప్రారంభించకపోతే, కంపెనీ మిగిలిన ఎగుమతి చేయాల్సిన వాహనాల ఉత్పత్తిని కూడా పూర్తిగా నిలిపివేసి, ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

కార్మికుల సమ్మె ప్రభావంతో చెన్నై ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని పొడగింపు: ఫోర్డ్ ఇండియా

దీంతో సగానికి పైగా ఫోర్డ్ కార్మికులు పనిలోకి తిరిగి వచ్చేందుకు సమ్మతించారు. వారి రాకతో కంపెనీ ఈ చెన్నై ప్లాంట్ లో తమ వాహనాల తయారీని తిరిగి ప్రారంభించింది. అయితే, కార్మికులు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో కంపెనీ ఇప్పుడు ఈ ప్లాంట్ ను మూసివేసే గడువు తేదీని జులై చివరి నాటికి పొడగించింది. ఒకవేళ అప్పటికీ కంపెనీ ఆశించిన స్థాయిలో వాహనాలను ఉత్పత్తి చేయకపోయినట్లయితే, ఈ గడువును మరోసారి పొడగించే అవకాశం ఉంది.

కార్మికుల సమ్మె ప్రభావంతో చెన్నై ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని పొడగింపు: ఫోర్డ్ ఇండియా

మరోవైపు, చెన్నై ప్లాంట్ లో ఇప్పటికీ సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా కంపెనీ సిద్ధమైంది. సమ్మె విరమించిన వారికి భారీ ప్రయోజనాలు అందిస్తామని, సమ్మె కొనసాగించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కంపెనీ హెచ్చరించింది. ఇదిలా ఉంటే, ఫోర్డ్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి PLI స్కీమ్ కోసం కూడా దరఖాస్తు చేసిందని సమాచారం. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అలాగే, గుజరాత్‌లో ఉన్న తమ రెండవ ప్లాంట్‌ను టాటా మోటార్స్‌కు విక్రయించేందుకు కూడా సిద్ధమైంది.

కార్మికుల సమ్మె ప్రభావంతో చెన్నై ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని పొడగింపు: ఫోర్డ్ ఇండియా

అమెరికాలో అగ్రగామి కార్ల తయారీ సంస్థగా ఉన్న ఫోర్డ్, భారతదేశంలో మాత్రం రాణించలేకపోయింది. భారతదేశంలో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత గత పదేళ్లలో దాదాపు 2 బిలియన్ల డాలర్లకు పైగా నష్టాలను చవిచూసినట్లు కంపెనీ పేర్కొంది. ఇకపై తాము ఈ నష్టాలతో వ్యాపారం చేయలేమని, అందుకే దేశాన్ని విడిచిపోతున్నామని ఫోర్డ్ ప్రకటించింది. ఫోర్డ్ ఇండియా భారత్‌లో తమ వ్యాపారాన్ని నిలిపివేసినప్పటికీ తమ వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల సేవలను అందిస్తామని చెబుతోంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford india car production extended in chennai plant due to employees protest
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X