ఎండాకాలంలో మీ కారు కూల్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి

రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మనుషులు మరియు జంతువులు కూడా ప్రభావితమవుతున్నాయి. అంతే కాదండోయ్.. ఈ ఎండా కాలంలో భానుడి భగభగలు తట్టుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇంత తీవ్రంగా పెరుగుతున్న ఎండల్లో మన వాహనాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ ఎండాకాలంలో బయట పార్క్ చేసిన వాహనాల లోపలిభాగం చాలా తొందరగా వేడెక్కుతుంది. కావున వేసవిలో కూడా మన కారును చల్లగా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి, పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి టిప్స్ గురించి మరింత సామాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇలా చేస్తే ఎండాకాలంలో కూడా మీ కారు చల్లగా ఉంటుంది

నీడగా ఉన్న ప్రదేశంలో పార్క్ చేయాలి:

ఈ ఎండాకాలంలో మీకు వీలైనప్పుడల్లా తప్పకుండా నీడగా ఉన్న ప్రదేశాల్లో పార్క్ చేయాలి. సాధారణంగా బయట వేడికంటే కూడా నీడలో వేడి కొంత తక్కువగా ఉంటుంది. కావున కారు లోపలి భాగం తొందరగా వేడెక్కే అవకాశం ఉండదు. వాహన వినియోగదారులు తప్పకుండా దీనిని గుర్తుంచుకోవాలి.

ఇలా చేస్తే ఎండాకాలంలో కూడా మీ కారు చల్లగా ఉంటుంది

సన్‌షేడ్ లేదా విండో విజర్ ఉపయోగించాలి:

ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ ధరకే సన్‌షేడ్‌లు అందుబాటులో ఉన్నాయి. కావున మీరు వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సన్ ఫిల్మ్ ఉపయోగించకూడదు. సన్ ఫిల్మ్ ఉపయోగించడం చట్టరీత్యా నేరం. కావున ఎండ వేడిని తట్టుకోవడానికి మీరు పార్క్ చేసేటప్పుడు ఈ సన్‌షేడ్ ఉపయోగించుకోవచ్చు. ఇలా చేసినట్లయితే ఎండ తీవ్రతను వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు.

ఇలా చేస్తే ఎండాకాలంలో కూడా మీ కారు చల్లగా ఉంటుంది

డ్యాష్‌బోర్డ్ కవర్‌ ఉపయోగించాలి:

సాధారణంగా డ్యాష్‌బోర్డ్ ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. కావున ఈ ఎండాకాలంలో డాష్‌బోర్డ్ ని తప్పకుండా డ్యాష్‌బోర్డ్ కవర్ తో కప్పి ఉంచాలి. ఈ డాష్‌బోర్డ్ కవర్లు ఎండ వేడికి డ్యాష్‌బోర్డ్ దెబ్బతినకుండా ఉండేలా చేస్తాయి. అంతే కాకుండా తెల్లటి టవల్ వంటి వాటితో కూడా దీనిని కప్పి ఉంచి ఎండ తీవ్రత నుంచి కాపాడవచ్చు.

ఇలా చేస్తే ఎండాకాలంలో కూడా మీ కారు చల్లగా ఉంటుంది

స్టీరింగ్ వీల్‌ను టవల్‌తో కప్పి ఉంచాలి:

మీ కారులో సన్‌షేడ్‌ని ఉపయోగించడం వల్ల ఉష్ణోగ్రత కొంత తగ్గినప్పటికీ స్టీరింగ్ వీల్ పైన కూడా ఒక చిన్న టవల్ కప్పి ఉంచాలి. ఈ విధంగా చేసినట్లయితే స్టీరింగ్ వీల్ యొక్క కాంటాక్ట్ ఉష్ణోగ్రతను తప్పకుండా తగ్గించుకోవచ్చు. వాహన వినియోగదారులు దీనిని కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి మరియు పాటించాలి.

ఇలా చేస్తే ఎండాకాలంలో కూడా మీ కారు చల్లగా ఉంటుంది

సీట్లను షీట్‌తో కవర్ చేయాలి:

కారులో వినైల్ లేదా లెదర్ సీట్లు ఉన్నట్లయితే ఈ ఎండాకాలంలో ఎక్కువ వేడిని గ్రహించే అవకాశం ఉంటుంది. కావున కారులోని సీట్లను చల్లగా ఉంచుకోవడానికి మీరు తప్పకుండా సీట్లపైన ఒక షీట్‌తో కప్పి ఉంచాలి. కారులోని సీట్లు చల్లగా ఉంటే వాహన వినియీగదారులకు చాలా అనుకూలంగా మరియు ఆహ్లాదంగా ఉంటుంది.

ఇలా చేస్తే ఎండాకాలంలో కూడా మీ కారు చల్లగా ఉంటుంది

కారు విండోస్ కొద్దిగా కిందికి దించి ఉంచాలి:

ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల కారులోని అన్ని విండోస్ మూసి ఉంచడం మంచిది కాదు. కావున కారులోని విండోస్ కొంత కిందికి దించి ఉంచాలి. అప్పుడే లోపలి గాలి బయటకు మరియు వెలుపలి గాలి లోపలి వెళ్లడం వల్ల లోపలి టెంపరేచర్ కొంత తక్కువగా ఉంటుంది. తద్వారా కారు లోపలి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది.

Most Read Articles

English summary
Here are six tips to keep your car cool in summer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X