కస్టమర్లు ఎగిరి గంతేసి మరి కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. నెంబర్ వన్ ప్లేస్‌లో మారుతి వ్యాగన్ఆర్!

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో చిన్న కార్లకు ఎల్లప్పుడూ ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఈ విభాగంలో తక్కువ ధర కలిగిన కార్లు ఎల్లప్పుడూ అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉంటాయి.

Recommended Video

Royal Enfield Scram 411 రివ్యూ.. డిజైన్ & పూర్తి వివరాలు #review

అయితే, కస్టమర్లు ఇప్పుడు కారు ధర కన్నా కూడా ఆ కారు అందించే సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఈ జాబితాలో కార్ మోడళ్ల స్థానాలు తారుమారు అయ్యాయి. గడచిన జూన్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల వివరాలు ఇలా ఉన్నాయి.

కస్టమర్లు ఎగిరి గంతేసి మరి కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. నెంబర్ వన్ ప్లేస్‌లో మారుతి వ్యాగన్ఆర్!

మారుతి సుజుకి ఆల్టో ఎల్లప్పుడూ తక్కువ ధరను కలిగి ఉండి, ఈ టాప్ 10 జాబితాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా అగ్రస్థానంలో ఉండేది. అయితే, ఇటీవలి కాలంలో ఈ కార్ల అమ్మకాలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. గడచిన జూన్ 2022 నెలలో మారుతి సుజుకి ఆల్టో కారు ఈ జాబితాలో ఐదవ స్థానానికి పడిపోయింది. కాగా, మొదటి స్థానాన్ని టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ గా పేరుగాంచిన మారుతి సుజుకి వ్యాగన్ఆర్ దక్కించుకుంది.

కస్టమర్లు ఎగిరి గంతేసి మరి కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. నెంబర్ వన్ ప్లేస్‌లో మారుతి వ్యాగన్ఆర్!

ఈ టాప్ 10 జాబితాలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో మారుతి సుజుకి మొత్తం 16,814 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. మారుతీ సుజుకి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తమ కొత్త 2022 మోడల్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ను విడుదల చేసింది. ఇది డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లతో పాటుగా పలు ఇతర మార్పుల చేర్పులతో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త మోడల్ రాకతో వ్యాగన్ఆర్ అమ్మకాలు జోరందుకున్నాయి.

కస్టమర్లు ఎగిరి గంతేసి మరి కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. నెంబర్ వన్ ప్లేస్‌లో మారుతి వ్యాగన్ఆర్!

టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. గత నెలలో ఈ దేశీయ కంపెనీ మొత్తం 14,614 నెక్సాన్ కార్లను విక్రయించింది. టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్ గా కూడా లభిస్తోంది. విభిన్నమైన పవర్‌ట్రైన్ ఎంపికల కారణంగా ఇది మార్కెట్లో ప్రస్తుతం అధిక డిమాండ్ కలిగిన కాంపాక్ట్ ఎస్‌యూవీగా మారింది. టాటా మోటార్స్ ఇటీవలే తమ నెక్సాన్ ఈవీలో ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పేరుతో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌కు కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తోంది.

కస్టమర్లు ఎగిరి గంతేసి మరి కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. నెంబర్ వన్ ప్లేస్‌లో మారుతి వ్యాగన్ఆర్!

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్స్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి స్విఫ్ట్. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అప్పటికీ, ఇప్పటికీ మరియు ఎప్పటికీ ఓ బెస్ట్ సెల్లింగ్ కారుగానే ఉంటుంది. ఆకర్షణీయమైన డిజైన్, అది అందించే కంఫర్ట్, సరసమైన ధర మరియు మంచి పనితీరు గల ఇంజన్ వంటివి స్విఫ్ట్ విజయానికి ప్లస్ పాయింట్లుగా చెప్పవచ్చు. గత జూన్ నెలలో మారుతి సుజుకి మొత్తం 14,133 స్విఫ్ట్ కార్లను విక్రయించింది. స్విఫ్ట్ వేగానికి మరింత జోరును అందించేందుకు కంపెనీ ఇందులో ఓ కొత్త మోడల్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

కస్టమర్లు ఎగిరి గంతేసి మరి కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. నెంబర్ వన్ ప్లేస్‌లో మారుతి వ్యాగన్ఆర్!

ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నది మారుతి సుజుకి బాలెనో. గత జూన్ 2022 నెలలో మారుతి సుజుకి 13,970 బాలెనో కార్లను విక్రయించింది. మారుతి సుజుకి కొన్ని నెలల క్రితమే బాలెనో లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క 2022 మోడల్‌ మార్కెట్లో మంచి ఆదరణను పొందింది. పాత మోడల్ బాలెనోతో పోల్చుకుంటే, కంపెనీ ఈ కొత్త మోడల్ బాలెనో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు చేసింది.

కస్టమర్లు ఎగిరి గంతేసి మరి కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. నెంబర్ వన్ ప్లేస్‌లో మారుతి వ్యాగన్ఆర్!

మారుతి సుజుకి అందిస్తున్న మరొక ఫ్యామిలీ కారు మరియు భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే చిన్న కారు ఆల్టో ఈ జాబితాలో ఐదవ స్థానానికి పడిపోయింది. ఈ జాబితాలో ఎల్లప్పుడూ టాప్ ప్లేస్ లో కనిపించే ఆల్టో, ఇటీవలి కాలంలో క్రమంగా ఆదరణను కోల్పోతోంది. ఇందుకు ప్రధాన కారణంగా దేశంలో మరిన్ని కొత్త కార్లు విడుదల కావడం మరియు అవి ఆల్టో కారు కన్నా సురక్షితమైనవిగా, సౌకర్యవంతమైనవిగా ఉండటమే. సమాచారం ప్రకారం, మారుతి ఆల్టో కారులో కొన్ని వేరియంట్లను కూడా డిస్‌కంటిన్యూ చేసింది. కాగా, ఈ ఏడాది జూన్‌ నెలలో మొత్తం 12,933 ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి.

కస్టమర్లు ఎగిరి గంతేసి మరి కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. నెంబర్ వన్ ప్లేస్‌లో మారుతి వ్యాగన్ఆర్!

ఈ జాబితాలో మారుతి సుజుకి ఎర్టిగా ఆరన స్థానంలో నిలిచింది. గడచిన జూన్‌ నెలలో మారుతి సుజుకి మొత్తం 12,226 యూనిట్ల ఎర్టిగా ఎమ్‌పివిలను విక్రయించింది. మారుతి సుజుకి ఇటీవలే ఎర్టిగా యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా విడుదల చేసింది. పాత మోడల్ ఎర్టిగాతో పోల్చుకుంటే, కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. ఈ కొత్త మోడల్ లో కంపెనీ మునుపటి 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో మరింత సమర్థవంతమైన 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను పరిచయం చేసింది.

కస్టమర్లు ఎగిరి గంతేసి మరి కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. నెంబర్ వన్ ప్లేస్‌లో మారుతి వ్యాగన్ఆర్!

మారుతి సుజుకి అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ డిజైర్ ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూన్‌ నెలలో మారుతి సుజుకి మొత్తం 11,603 యూనిట్ల డిజైర్ కార్లను విక్రయించింది. కాగా, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక హ్యుందాయ్ ఉత్పత్తి క్రెటా ఎస్‌యూవీ మాత్రమే. హ్యుందాయ్ గడచిన జూన్ 2022 నెలలో మొత్తం 10,973 యూనిట్ల క్రెటా మిడ్-సైజ్ ఎస్‌యూవీలను విక్రయించింది. దీంతో క్రెటా ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

కస్టమర్లు ఎగిరి గంతేసి మరి కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. నెంబర్ వన్ ప్లేస్‌లో మారుతి వ్యాగన్ఆర్!

ఇక ఈ జాబితాలో చివరి రెండు స్థానాలను మారుతి సుజుకి ఉత్పత్తులు ఆక్రమించాయి. గత నెలలో మారుతి సుజుకి ఈకో 10,221 యూనిట్లతో తొమ్మిదవ స్థానంలో నిలువగా, మారుతి సుజుకి బ్రెజ్జా10,130 యూనిట్ల అమ్మకాలతో పదవ స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి బ్రెజ్జాలో కంపెనీ కొద్ది రోజుల క్రితమే ఓ అప్‌డేటెడ్ మోడల్ ను విడుదల చేసింది. కొత్త ఫీచర్లు, రిఫ్రెష్డ్ డిజైన్ తో, అందరినీ ఆకట్టుకునేలా 2022 మారుతి సుజుకి బ్రెజ్జా విడుదల చేయబడింది.

Most Read Articles

English summary
Here is the list of top 10 cars sold in june 2022 maruti wagon r tops the list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X