ఇప్పుడు కొనండి.. 2023 లో చెల్లించండి.. హోండా కార్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..

గతేడాది కరోనా సంక్షోభం సమయంలో ఆటోమొబైల్ కంపెనీలు 'ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి' (Buy Now Pay Later) అంటూ ఓ విశిష్టమైన క్యాంపైన్‌ను నడిపిన సంగతి మనందరికీ తెలిసినదే. ఆ సమయంలో కొనుగోలుదారుల వద్ద తగినంత డబ్బు లేని కారణంగా, ఈ క్యాంపైన్ నిర్వహించారు. అయితే, ఇప్పుడు ఇదే క్యాంపైన్‌ను హోండా ఈ పండుగ సీజన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పండుగ సీజన్‌లో కారు కొనండి, వచ్చే ఏడాది (2022)లో డబ్బు చెల్లించండి అంటూ కొత్త స్కీమ్‌ను పరిచయం చేసింది.

ఇప్పుడు కొనండి.. 2023 లో చెల్లించండి.. హోండా కార్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..

ఈ పండుగ సీజన్‌లో చాలా మందికి కారు కొనాలనే ఆలోచన ఉన్నప్పటికీ, వారి వద్ద తగినంత డబ్బు లేని కారణంగా ఆ ప్లాన్స్‌ని వాయిదా వేసుకుంటుంటారు. అలాంటి కస్టమర్ల కోసం జపనీస్ కార్ బ్రాండ్ హోండా ఈ క్యాంపైన్‌ను ప్రారంభించింది. హోండా సిటీ మరియు హోండా అమేజ్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌ల కోసం కంపెనీ ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత చెల్లించే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ పేరు 'డ్రైవ్ ఇన్ 2022, పే ఇన్ 2023'. అంటే, 2022 సంవత్సరంలో కారు కొనండి, 2023 సంవత్సరంలో చెల్లించండి అని అర్థం.

ఇప్పుడు కొనండి.. 2023 లో చెల్లించండి.. హోండా కార్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..

ఈ ఆఫర్‌లో భాగంగా, అక్టోబర్ 31, 2022 వరకు పండుగ సీజన్‌లో, కస్టమర్‌లు ఎలాంటి వాయిదాలు చెల్లించకుండా హోండా అమేజ్ మరియు హోండా సిటీ యొక్క ఏదైనా వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు కొనుగోలు చేసే కార్లకు మొదటి వాయిదాను 2023 సంవత్సరం ప్రారంభం నుండి చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకో కోసం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రముఖ ఫైనాన్సింగ్ కంపెనీ అయిన కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ (KMPL)తో ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

ఇప్పుడు కొనండి.. 2023 లో చెల్లించండి.. హోండా కార్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..

కస్టమర్లు కారు కొనుగోలు చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు హోండా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇలాంటి ఆఫర్లతో పండుగ సీజన్ లో తమ కార్ల విక్రయాలు పెరుగుతాయని కంపెనీ అభిప్రాయపడింది. అన్ని హోండా డీలర్లు మరియు మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ బ్రాంచ్‌లలో కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందగలరు. హోండా కార్ యొక్క ఈ ఆఫర్ నేటి నుండి ప్రారంభమైంది, ఇది 31 అక్టోబర్ 2022 వరకు చెల్లుబాటు అవుతుంది.

ఇప్పుడు కొనండి.. 2023 లో చెల్లించండి.. హోండా కార్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..

హోండా అమేజ్ మరియు హోండా సిటీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ నెలాఖరులోగా కారును కొనుగోలు చేసి ఈ ఆఫర్ పొందవచ్చు. కారు మొత్తం ఆన్-రోడ్ ధరలో దాదాపు 85 శాతం ఫైనాన్స్ కస్టమర్‌కు లభిస్తుందని, మొదటి 3 నెలల ఈఎమ్ఐ చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. సాధారణ ఈఎమ్ఐ ఛార్జీలు నాల్గవ నెల నుండి వసూలు చేయడం ప్రారంభిస్తామని, ఇది వాయిదా చివరి నెల వరకు కొనసాగుతుందని కంపెనీ వివరించింది.

ఇప్పుడు కొనండి.. 2023 లో చెల్లించండి.. హోండా కార్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..

ఈ ఆఫర్‌ను ప్రారంభించిన సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ మరియు సేల్స్) కునాల్ బహ్ల్ మాట్లాడుతూ, "కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్‌తో మా భాగస్వామ్యం మా వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఆఫర్ తో కస్టమర్ ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వచ్చి హోండా కుటుంబంలో భాగం కావాలని మేము కోరుతున్నాము" అని అన్నారు.

ఇప్పుడు కొనండి.. 2023 లో చెల్లించండి.. హోండా కార్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..

అలాగే, ఈ భాగస్వామ్యంపై కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ చైర్మన్ మరియు డైరెక్టర్ షారుక్ తోడివాలా మాట్లాడుతూ, "మేము ఎల్లప్పుడూ హోండా కార్ ఇండియా లిమిటెడ్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాము. హోండా కస్టమర్ ఈ ఆఫర్ ని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాము. వినియోగదారులు ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము" అని చెప్పారు.

ఇప్పుడు కొనండి.. 2023 లో చెల్లించండి.. హోండా కార్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..

హోండా గురించి క్లుప్తంగా..

హోండా అమేజ్ విషయానికి వస్తే, ఇది తొలిసారిగా 2013లో భారత మార్కెట్లో విడుదలైంది. ఆ తర్వాత కంపెనీ ఇందులో 2018లో రెండవ తరం అమేజ్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా తయారైంది. హోండా నుండి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక ఎంట్రీ లెవల్ మోడల్ కూడా అమేజ్ కావడంతో ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఖరీదైన హోండా సిటీ సెడాన్‌ను కొనుగోలు చేయలేని వారికి హోండా అమేజ్ ఎల్లప్పుడూ ఓ మినీ సిటీ సెడాన్‌గా ఉంటుంది.

ఇప్పుడు కొనండి.. 2023 లో చెల్లించండి.. హోండా కార్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ ఆధునిక ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంది. ఇది 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ మరియు 1.5-లీటర్ i-DTEC డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 88 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కాగా, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 98.6 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, మ్యాన్యువల్ మరియు సివిటి ట్రాన్సిమిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పుడు కొనండి.. 2023 లో చెల్లించండి.. హోండా కార్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..

ఈ చిన్న కారులో ప్రధానంగా లభించే ఫీచర్ల విషయానికి వస్తే, అమేజ్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సమాచారం కోసం డిజిటల్ ఎమ్ఐడి డిస్‌ప్లే యూనిట్, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐసోఫిక్స్ మౌంట్ చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda car customers can buy now and pay in 2023 offer details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X