హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ (Hyundai Creta N-Line) ఆవిష్కరణ.. త్వరలో విడుదల!

కొరియన్ కార్ కంపెనీ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) లో ఓ కొత్త స్పెషల్ వేరియంట్ ను విడుదల చేసేందుకు సిద్దమైంది. హ్యుందాయ్ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 లో ఎన్-లైన్ అనే స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసినట్లుగానే, హ్యుందాయ్ క్రెటాలో కూడా కంపెనీ తమ ఎన్-లైన్ వెర్షన్ ను విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే, కంపెనీ తమ క్రెటా ఎన్-లైన్ ను ఆవిష్కరించింది.

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ (Hyundai Creta N-Line) ఆవిష్కరణ.. త్వరలో విడుదల!

స్టాండర్డ్ ఐ20 తో పోల్చుకుంటే ఐ20 ఎన్-లైన్ ఎలాగైతే ప్రత్యేకమైన ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ కలర్ స్కీమ్ ను కలిగి ఉంటుందో, కొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ కూడా అదే విధమైన డిజైన్ ట్వీక్‌లు కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ మోడల్ కేవలం 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభిస్తుంది మరియు ఇది రివైజ్డ్ సస్పెన్షన్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ (Hyundai Creta N-Line) ఆవిష్కరణ.. త్వరలో విడుదల!

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ లో చేసిన డిజైన్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, స్టాండర్డ్ క్రెటాతో ఈ ప్రత్యేకమైన వేరియంట్ ను మరింత ప్రత్యేకంగా కనిపించేలా చేసేందుకు దీనిలో కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేశారు. ఈ మార్పులలో భాగంగా, కొత్త క్రెటా ఎన్-లైన్‌లో విస్తృతమైన ఫ్రంట్ గ్రిల్ మరియు గ్రిల్ పై డార్క్ క్రోమ్ ఇన్‌సర్ట్‌లు ఉంటాయి. ఈ గ్రిల్ హ్యుందాయ్ యొక్క పెద్ద ఎస్‌యూవీల నుండి స్పూర్తి పొందినట్లుగా ఉంటుంది. అలాగే, కారు ముందు భాగంలోని బంపర్ త్రిభుజాకార ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లను కలిగి ఉండి అవి పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్ ద్వారా కనెక్ట్ చేయబడినట్లుగా ఉంటాయి.

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ (Hyundai Creta N-Line) ఆవిష్కరణ.. త్వరలో విడుదల!

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ యొక్క సైడ్ డిజైన్ ను చూస్తే, ఇక్కడ కొత్తగా కనిపించేవి దాని కొత్త సైడ్ స్కర్ట్‌లు మరియు 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌. ఇది బ్లాక్ థీమ్ మోడల్ కావడంతో కారు వెలుపల ఎక్కడా క్రోమ్ గార్నిష్ కనిపించదు దాని స్థానంలో ప్రీమియం బ్లాక్ యాక్సెంట్స్ ఉంటాయి. ఫ్రంట్ ఫెండర్‌లపై ప్రత్యేకమైన ఎన్-లైన్ బ్యాడ్జ్‌లు కూడా కనిపిస్తాయి. ఇక హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ యొక్క వెనుక విభాగాన్ని గమనిస్తే, ఇక్కడ ప్రధానంగా కనిపించేది దాని కొత్త వెనుక బంపర్‌. దీని ఫాక్స్ స్కిడ్ ప్లేట్ లు కూడా బ్లాక్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. దానితో పాటు కొన్ని ఫ్యాన్సీ స్టైలింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ (Hyundai Creta N-Line) ఆవిష్కరణ.. త్వరలో విడుదల!

ఇక క్రెటా ఎన్-లైన్ ఇంటీరియర్ ను గమనిస్తే, ఇక్కడ పూర్తిగా బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడిన థీమ్‌ మీకు స్వాగతం పలుకుతుంది. ఇతర ప్రధాన మార్పులలో కొత్త ఎన్-లైన్ థీమ్డ్ స్టీరింగ్ వీల్ (రెడ్ కలర్ ఇన్సర్ట్ లతో) మరియు ఆల్-బ్లాక్ అప్‌హోలెస్ట్రీ మరియు దాని రెడ్ కలర్ స్టిచింగ్‌, సీట్ హెడ్‌రెస్ట్‌ లపై ఎన్-లైన్ బ్యాడ్జింగ్‌ వంటి మార్పులు ఉన్నాయి. ఇవి మినహా ఓవరాల్ క్యాబిన్ లేవుట్ మరియు ఇతర ఇంటీరియర్ ఫీచర్లు ఇందులో అలానే ఉంటాయి.

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ (Hyundai Creta N-Line) ఆవిష్కరణ.. త్వరలో విడుదల!

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ కేవలం కాస్మెటిక్ మార్పులను మాత్రమే కాకుండా, మెకానికల్ మార్పులను కూడా కలిగి ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 118 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ సర్దుబాటు చేయబడిన సస్పెన్షన్ సెటప్‌ను కూడా పొందుతుంది.

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ (Hyundai Creta N-Line) ఆవిష్కరణ.. త్వరలో విడుదల!

క్రెటా ఎన్-లైన్ యొక్క ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఫెటీగ్ డిటెక్టర్, అటానమస్ బ్రేకింగ్ మరియు లేన్ అసిస్ట్ వంటి కొన్ని అధునాతన డ్రైవర్ ఎయిడ్ సిస్టమ్‌ లను కూడా కలిగి ఉంటుందని సమాచారం. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌ లోని ఇతర ఫీచర్లలో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు 360 డిగ్రీ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ (Hyundai Creta N-Line) ఆవిష్కరణ.. త్వరలో విడుదల!

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ డీటేల్స్ లీక్..

ఇదిలా ఉంటే, హ్యుందాయ్ నుండి కొత్త క్రెటా ఎన్-లైన్ రావడానికంటే ముందుగా కంపెనీ తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ లో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఈ మోడల్ కు సంబంధించిన కొంత సమాచారం ఆన్-లైన్ లో లీకైంది. ఈ విషయంలో వచ్చిన తాజా వీడియో హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ యొక్క రాబోయే కొత్త 2022 మోడల్ వెనుక సీట్లు కూడా రిక్లైనింగ్‌ ఫీచర్ ని కలిగి ఉంటుందని నిర్ధారిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ (Hyundai Creta N-Line) ఆవిష్కరణ.. త్వరలో విడుదల!

ఇటీవల, కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ యొక్క బ్రోచర్ కూడా ఆన్‌లైన్‌లో లీక్ చేయబడింది. ఈ బ్రోచర్ ప్రకారం, హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మూడు ఇంజన్ ఆప్షన్లతో రానుంది. వీటిలో ఒకటి డీజిల్ యూనిట్ గా ఉంటుంది. బ్రోచర్ ప్రకారం, బేస్ పవర్‌ట్రెయిన్ ఎంపిక 81.8bhp పవర్ మరియు 114Nm గరిష్ట టార్క్‌తో 1.2-లీటర్ సహజంగా-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌గా కొనసాగుతుంది. మరోవైపు, ఏకైక డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికగా 1.5-లీటర్ యూనిట్ 98.6bhp గరిష్ట శక్తిని మరియు 240Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక మూడవది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది 118.4bhp గరిష్ట శక్తిని మరియు 172Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Hyundai creta n line revealed globally specs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X