'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' లాంచ్ చేసిన Hyundai: ధర & వివరాలు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్ ఇండియా' (Hyundai Motor India) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన 'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' (Grand i10 Nios Corporate Edition) విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ధర రూ. 6,28,900 (ఎక్స్-షోరూమ్). కొత్త గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' లాంచ్ చేసిన Hyundai: ధర & వివరాలు

గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ ఇప్పుడు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ (AMT) వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో నియోస్ కార్పొరేట్ ఎడిషన్ మాన్యువల్ ధర రూ. 6,28,900 కాగా, ఆటోమేటిక్ (AMT) వెర్షన్ ధర రూ. 6,97,700 (ఎక్స్-షోరూమ్). స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఈ కార్పొరేట్ ఎడిషన్ మోడల్‌లో కంపెనీ ఆధునిక టెక్నాలజీ మరియు ఫీచర్లను అందిస్తోంది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ దాని మాగ్నా ట్రిమ్ ఆధారంగా రూపొందించబడింది.

'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' లాంచ్ చేసిన Hyundai: ధర & వివరాలు

ఈ కొత్త ఎడిషన్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది బ్లాక్ రేడియేటర్ గ్రిల్, 15-ఇంచెస్ గన్‌మెటల్ డిజైన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, క్రోమ్ గార్నిష్, కార్పొరేట్ ఎడిషన్ బ్యాడ్జ్ మరియు బ్లాక్ పెయింటెడ్ ఓఆర్విఎమ్ వంటి వాటిని పొందుతుంది. మొత్తం మీద ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' లాంచ్ చేసిన Hyundai: ధర & వివరాలు

గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 6.75-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ నావిగేషన్, ఎలక్ట్రానిక్‌ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్ మరియు ఓఆర్విఎమ్ లపై ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని యువ కస్టమర్ల కోసం కంపెనీ ఈ కొత్త మోడల్ తీసుకువచ్చినట్లు తెలిపింది. కావున ఇందులో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు ఉన్నాయి.

'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' లాంచ్ చేసిన Hyundai: ధర & వివరాలు

ప్రస్తుత కాలంలో ఆధునిక మోడల్స్ నే ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు, కావున కంపెనీ దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త మోడల్ ని ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక మంచి హ్యాచ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు కొత్త గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ తప్పకుండా ఒక మంచి ఎంపిక అవుతుందని చెప్పవచ్చు.

'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' లాంచ్ చేసిన Hyundai: ధర & వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ కార్పోరేట్ ఎడిషన్‌ రెండు ఇంజన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.2-లీటర్ 3-సిలిండర్ డీజిల్ యూనిట్.

'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' లాంచ్ చేసిన Hyundai: ధర & వివరాలు

1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 82 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి. అదే విధంగా 1.2-లీటర్ 3-సిలిండర్ డీజిల్ యూనిట్ 74 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తాయి. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి.

'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' లాంచ్ చేసిన Hyundai: ధర & వివరాలు

ఇదిలా ఉండగా 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ భారతీయ మార్కెట్లో కోసం కొత్త ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు పేరు 'హ్యుందాయ్ ఐయోనిక్ 5'. హ్యుందాయ్ ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఐయోనిక్ 5 ను ఈ ఏడాది భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' లాంచ్ చేసిన Hyundai: ధర & వివరాలు

హ్యుందాయ్ కంపెనీ తన బియాండ్ మొబిలిటీ స్ట్రాటజీ కింద 2022 ద్వితీయార్థంలో దేశీయ మార్కెట్లో ఆల్-ఎలక్ట్రిక్ ఐయోనిక్ 5ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఇప్పటికే కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ కార్ '2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా కైవసం చేసుకుంది.

'గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్‌' లాంచ్ చేసిన Hyundai: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ కొత్త 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' 'ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఆధునిక డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' లో ఐయోనిక్ అనే పదం "అయాన్" మరియు "యూనిక్" కలయికతో ఏర్పడింది. మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ కారు త్వరలోనే దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hyundai grand i10 nios corporate edition launched price features details
Story first published: Monday, May 23, 2022, 18:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X