Just In
- 54 min ago
ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!
- 1 hr ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 2 hrs ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 4 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
Don't Miss
- Sports
హార్దిక్ పాండ్యా ఉంటే ఇండియా వేరే లెవెల్ టీం.. పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తిన లాన్స్ క్లూసెనర్
- Technology
Reliance నుంచి Jio 5G Phone ..! ధర & స్పెసిఫికేషన్లు వివరాలు
- Finance
Srilanka crisis: ప్రజలకు లంకంత కష్టం.. కిలో చికెన్ రూ.1,200, ఒక్కో గుడ్డు రూ.62.. ఎందుకంటే..
- Lifestyle
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
- Movies
Macherla Niyojakavargam day 4 collections: మాస్ ఇమేజ్ తో నితిన్ పోరాటం.. తట్టుకున్నాడు కానీ?
- News
ఆంధ్రప్రదేశ్ వైపు అదానీ అడుగులు... వెల్లడించిన సీఎం జగన్
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
హ్యుందాయ్ అల్కజార్ (Hyundai Alcazar) ఎస్‌యూవీలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు
కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ (Hyundai), భారతదేశంలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తూ గతేడాది క్రెటా ఆధారంగా తయారు చేసిన 7-సీటర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ అల్కజార్ (Hyundai Alcazar) ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం, ఇది ప్రీమియం SUV/MPV విభాగంలో విక్రయించబడుతోంది. కాగా, హ్యుందాయ్ ఇప్పుడు దీని ధరను మరింత సరసమైనదిగా చేయడానికి, కంపెనీ ఇందులో ఓ కొత్త బేస్ స్పెక్ వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ బేస్ వేరియంట్ ధర రూ. 15.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హ్యుందాయ్ అల్కాజార్ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ బేస్ వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. కాగా, పెట్రోల్ వెర్షన్ మాత్రం కేవలం మ్యాన్యుల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుండగా, డీజిల్ వెర్షన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) ఆప్షన్‌లతో లభిస్తుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
అల్కాజార్ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ (పెట్రోల్, మ్యాన్యువల్, 7-సీటర్) - రూ.15,89,400
అల్కాజార్ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ (డీజిల్, మ్యాన్యువల్, 6/7-సీటర్) - రూ.16,30,300
అల్కాజార్ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ (డీజిల్, ఆటోమేటిక్, 7-సీటర్) - రూ.17,77,300
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

కొత్త అల్కాజార్ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు మరియు 2 ట్వీటర్లతో కూడిన ఆడియో సిస్టమ్, వాయిస్ కమాండ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ వాయిస్ కమాండ్ సిస్టమ్ లో రెండు మైక్‌లకు బదులుగా, ఈ కొత్త బేస్ వేరియంట్ ఒక మైక్ ను మాత్రమే కలిగి ఉంటుంది. దీనితో పాటు, ఇది ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బర్గ్లర్ అలారం మరియు క్రోమ్ డోర్ హ్యాండిల్ వంటి ఫీచర్లను కోల్పోతుంది.

కాగా, ఈ కొత్త బేస్ వేరియంట్ లో కంపెనీ ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. హ్యుందాయ్ అల్కజార్ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ బేస్ వేరియంట్ 158 బిహెచ్‌పి శక్తిని మరియు 191 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటుగా 113 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

ఈ వేరియంట్లో లభించే ఇతర ఫీచర్లను గమనిస్తే, పానోరమిక్ సన్‌రూఫ్, రెండవ మరియు మూడవ వరుస సీట్లలోని ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌లైట్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీ మొదలైనవి ఫీచర్లు లభిస్తాయి. అదే సమయంలో కంపెనీ ఇందులో బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ అప్‌హోలెస్ట్రీ, ఆర్మ్‌రెస్ట్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ముందు వరుసలో వెంటిలేటెడ్ సీట్లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లను తొలగించింది.

హ్యుందాయ్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ క్రెటాను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ అల్కజార్ ఎస్‌యూవీని గతేడాది జులై నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం, మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 15.89 లక్షల నుండి రూ. 20.25 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది ఈ విభాగంలో ఎమ్‌జి హెక్టర్ ప్లస్, టాటా సఫారి, టొయోటా ఇన్నోవా మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి 7-సీటర్ యుటిలిటీ వాహనాలతో పోటీ పడుతుంది.

హ్యుదాయ్ అల్కజార్ ఎస్‌యూవీలో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు, టెయిల్ లాంప్స్, ట్విన్ టిప్ ఎగ్జాస్ట్, 17-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఇంటీరియర్ థీమ్, లెథర్‌తో చుట్టబడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెథర్‌తో చుట్టబడిన గేర్ నాబ్, 64 కలర్ ఆప్షన్లతో కూడిన యాంబియంట్ లైటింగ్, వాయిస్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ అండ్ స్టార్ట్, రిమోట్ ఇంజన్ స్టార్ట్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అంతేకాకుండా, ఈ కారులో పవర్ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబిల్ సైడ్ మిర్రర్స్, ముందు భాగంలో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు ఫోన్ కంట్రోల్స్, రియర్-సెంటర్ ఆర్మ్‌రెస్ట్ (7-సీటర్), వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ (6-సీటర్)తో కూడిన రియర్-సెంటర్ కన్సోల్, రియర్ విండో సన్‌షేడ్, మూడవ వరుసలో ఏసి వెంట్స్ మరియు యుఎస్‌బి ఛార్జర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, రెండవ-వరుస సీట్లకు స్లైడింగ్ మరియు రిక్లైనింగ్ సదుపాయం మరియు మూడవ వరుస సీట్లకు రిక్లైనింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ను గమనిస్తూ ఉండండి.