హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా ఇప్పుడు సిఎన్‌జి వెర్షన్‌లో.. ధర ఎంతో తెలుసా?

సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai) భారతీయ మార్కెట్లో తన 'గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా సిఎన్‌జి' (Grand i10 Nios Asta CNG) వేరియంట్ విడుదల చేసింది. దేశీయ విఫణిలో ఈ సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 8.45 లక్షలు. అయితే ఇది దాని స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్ కంటే కూడా దాదాపు రూ. 92,000 ఎక్కువ ధరను కలిగి ఉంది. ఇప్పటికే కంపెనీ యొక్క గ్రాండ్ ఐ10 నియోస్ 'మాగ్నా సిఎన్‌జి వేరియంట్' మరియు 'స్పోర్ట్జ్ సిఎన్‌జి వేరియంట్' లలో అందుబాటులో ఉంది. కావున ఇప్పుడు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 'అస్టా సిఎన్‌జి' తో కలిపి మూడు సిఎన్‌జి వేరియంట్లతో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా ఇప్పుడు సిఎన్‌జి వెర్షన్‌లో.. ధర ఎంతో తెలుసా?

గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క మాగ్నా సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 7.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, స్పోర్ట్జ్ సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 7.70 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. ఈ ధరలు దాని పెట్రోల్ వెర్షన్ కంటే కూడా చాలా ఎక్కువ అని స్పష్టంగా తెలుస్తోంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా ఇప్పుడు సిఎన్‌జి వెర్షన్‌లో.. ధర ఎంతో తెలుసా?

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆస్టా సిఎన్‌జి మోడల్ లో ఎలాంటి చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేదు. ఇందులో 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్స్ సిస్టం, 5.3 ఇంచెస్ సెమీ డిజిటల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, అర్కామీస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు వాయిస్ రికగ్నిషన్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా ఇప్పుడు సిఎన్‌జి వెర్షన్‌లో.. ధర ఎంతో తెలుసా?

అంతే కాకుండా అడ్జస్టబుల్ రియర్ హెడ్ రెస్ట్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, రియర్ వైపర్/వాషర్, రియర్ క్రోమ్ గార్నిష్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌లైట్, 15-ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. కావున చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఫీచర్స్ అన్నీ కూడా అస్టా పెట్రోల్ మాన్యువల్‌లో మాదిరిగానే ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా ఇప్పుడు సిఎన్‌జి వెర్షన్‌లో.. ధర ఎంతో తెలుసా?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆస్టా సిఎన్ మోడల్ 1.2 లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 68 బిహెచ్‌పి పవర్ మరియు 95.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది 28 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. పవర్ మరియు టార్క్ అనేవి దాని స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ కంటే 14 బిహెచ్‌పి పవర్ మరియు 19 ఎన్ఎమ్ టార్క్ తక్కువ.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా ఇప్పుడు సిఎన్‌జి వెర్షన్‌లో.. ధర ఎంతో తెలుసా?

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, గ్రాండ్ ఐ10 ఆస్టా సిఎన్‌జి మోడల్ రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఇమ్మొబిలైజర్, ఏబీఎస్ విత్ ఈబిడి, డే & నైట్ ఐఆర్విఎమ్ మరియు ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా ఇప్పుడు సిఎన్‌జి వెర్షన్‌లో.. ధర ఎంతో తెలుసా?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆస్టా సిఎన్‌జి మోడల్ దాని 'మాగ్నా సిఎన్‌జి వేరియంట్' మరియు 'స్పోర్ట్జ్ సిఎన్‌జి వేరియంట్' ల కంటే ఎక్కువ ధరలు కలిగి ఉంది. కావున ఇది ఈ మోడల్‌లో అత్యంత ఖరీదైన సిఎన్‌జి వేరియంట్‌గా మారింది. కానీ స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా ఇప్పుడు సిఎన్‌జి వెర్షన్‌లో.. ధర ఎంతో తెలుసా?

ఇదిలా ఉండగా హ్యుందాయ్ కంపెనీ 2022 ఆగష్టు 04 న నాల్గవ తరం టుసాన్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. మునుపటి తరం హ్యుందాయ్ టూసాన్ తో పోలిస్తే ఈ కొత్త 2022 హ్యుందాయ్ టుసాన్ ఎస్‌యూవీ పూర్తిగా రీడిజైన్ చేయబడినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకూండా ఇందులో ఆధునిక ఫీచర్స్ మరియు అడ్వాన్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ వంటి ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా ఇప్పుడు సిఎన్‌జి వెర్షన్‌లో.. ధర ఎంతో తెలుసా?

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న 2022 హ్యుందాయ్ టుసాన్ 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.0 లీటర్ ఇంజన్ ఆప్షన్లలతో విడుదలయ్యే అవకాశం ఉంది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 154 బిహెచ్‌పి పవర్ ను మరియు 192 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 184 బిహెచ్‌పి పవర్ ను మరియు 417 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అస్టా ఇప్పుడు సిఎన్‌జి వెర్షన్‌లో.. ధర ఎంతో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ బ్రాండ్ మోడల్స్ లో ఒకటి ఈ 'గ్రాండ్ ఐ10 నియోస్'. అయితే ప్రస్తుతం ఎక్కువమంది కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున కంపెనీ ఈ CNG మోడల్స్ తీసుకురావడం జరిగింది. ఈ కొత్త మోడల్ తప్పకుండా కంపెనీకి మంచి అమ్మకాలను తీసుకువచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Hyundai introduced grand i10 nios asta cng variant find here all details
Story first published: Friday, July 22, 2022, 17:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X