చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) నుండి ఈ ఏడాది భారత మార్కెట్లో రాబోయే అతిపెద్ద కార్ లాంచ్ ఐయానిక్ 5 (Ioniq 5) అవుతుంది. హ్యుందాయ్ అనుబంధ సంస్థ కియా ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కారు ఈవీ6 (Kia EV6) ను భారత మార్కెట్లో విడుదల చేసి మంచి సక్సెస్‌ను సాధించగా, హ్యుందాయ్ మాత్రం తమ ఎలక్ట్రిక్ కారును ఇంకా భారత రోడ్లపై పరీక్షిస్తూనే ఉంది. అయితే, ఈ ఏడాది చివరి నాటికి ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. తాజాగా, భారీగా క్యామోఫ్లేజ్ చేయబడిన హ్యుందాయ్ ఐయానిక్ 5 భారత రోడ్లపై టెస్టింగ్ దశలో ఉండగా గుర్తించబడింది.

చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?

హ్యుందాయ్ చెన్నై రోడ్లపై ఈ ఎలక్ట్రిక్ కారును పరీక్షిస్తోంది. బహుశా ఇది విదేశాల నుండి దిగుమతి చేసుకున్న మోడల్ కావచ్చని తెలుస్తోంది. హ్యుందాయ్ తమ సిస్టర్ కంపెనీ కియా మాదిరిగా తమ ఎలక్ట్రిక్ కారును విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకోవడం లేదు. దానికి బదులుగా, ఇక్కడే భారతదేశంలో ఈ కారును అసెంబుల్ చేసి, ఈవీ6 కన్నా తక్కువ ధరకే విక్రయించాలని చూస్తోంది. హ్యుందాయ్ ఇప్పటికే భారతదేశంలో కోనా అనే ఎలక్ట్రిక్ క్రాసోవర్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది.

చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?

ఈ నేపథ్యంలో, ఐయానిక్ 5 హ్యుందాయ్‌కి భారతదేశంలో రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. కియా ఇండియా విషయానికి వస్తే, కంపెనీ ఇప్పటికే మొదటి 100 యూనిట్ల ఈవీ6 ఎలక్ట్రిక్ కారు కోసం ఆర్డర్లను ఓపెన్ చేయగా, అంతకు మూడు రెట్లుకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. కియా ఈ కార్లన్నింటినీ విదేశాల నుండి భారతదేశానికి దిగుమతి చేసుకోవాల్సిందే. ఒక్కొక్క బ్యాచ్ భారతదేశానికి దిగుమతి కావడానికి రెండు నుండి మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఈవీ6 వెయిటింగ్ పీరియడ్ కూడా ఏడాది వరకూ ఉన్నట్లు సమాచారం.

చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?

ఈ పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్న హ్యుందాయ్, కియా చేసిన పొరపాటు చేయకూడదని చూస్తోంది. ఐయానిక్ 5ను స్థానికంగా అసెంబుల్ చేయడం వలన దాని ధరను అందుబాటులో ఉంచడమే కాకుండా, వెయిటింగ్ పీరియడ్‌ను కూడా అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది. కియా ఈవీ6 మరియు హ్యుందాయ్ ఐయానిక్ 5 రెండు కార్లు కూడా ఇంచిమించు ఒకేలా ఉంటాయి. వాటి బాహ్య డిజైన్ లో మార్పు మినహా ప్లాట్‌ఫామ్, పవర్‌ట్రైన్ మరియు బ్యాటరీ ప్యాక్ వంటి అనేక విషయాలలో ఇవి రెండూ ఒకేలా ఉంటాయి.

చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?

ఇరు కంపెనీలు కూడా ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాలను e-GMP ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారు చేస్తున్నాయి. సమాచారం ప్రకారం, ఈ ఏడాది చివరి నాటికి హ్యుందాయ్ ఐయానిక్ 5 భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఐయానిక్ 5 ఇప్పటికే అనేక అవార్డులను కూడా దక్కించుకుంది. ప్రతిష్టాత్మక వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ 2022 మరియు వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ వంటి అవార్డులను కూడా హ్యుందాయ్ ఐయానిక్ 5 సొంతం చేసుకుంది.

చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?

హ్యుందాయ్ ఈ ఎలక్ట్రిక్ పేరు 'Ioniq'ని "ion" మరియు "unique" అనే రెండు పదాల కలయికతో రూపొందించింది. దాని పేరు మాదిరిగానే, హ్యుందాయ్ ఐయానిక్ 5 క్రాస్ఓవర్ కూడా షార్ప్ మరియు ఎడ్జీ స్టైలింగ్‌తో చాలా ఫ్యూచరిస్టిక్‌గా మరియు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ వెలుపలి భాగంలో డ్యూయల్ U- ఆకారపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్, దీర్ఘచతురస్రాకారపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రేక్డ్ రియర్ గ్లాస్ మరియు ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?

అలాగే, హ్యుందాయ్ ఐయానిక్ 5 క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ వాహనం లోపలి భాగం ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ మరియు ఫ్యూచర్ రెడీ క్యాబిన్‌తో చాలా అందంగా కనిపిస్తుంది. క్యాబిన్ లేఅవుట్ మొత్తం చాలా సింపుల్‌గా, ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది. డ్యాష్‌బోర్డులో కనిపించే రెండు డిస్‌ప్లే యూనిట్లు, అతి తక్కువ భౌతిక బటన్లతో ఇది మనల్ని 10 ఏళ్ల ముందుకు తీసుకెళ్లినట్లుగా అనిపిస్తుంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ప్రీమియం లెథర్ సీట్లు, ఫ్లోటింగ్ రూఫ్ ప్రతి డీటేలింగ్ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?

పవర్‌ట్రెయిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ ఐయానిక్ 5 గ్లోబల్ మార్కెట్లలో రెండు ఆప్షన్లతో లభిస్తుంది. వీటిలో చిన్న 58kWh బ్యాటరీ ప్యాక్ మరియు పెద్ద 72.6kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. అలాగే, హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ క్రాసోవర్ 2WD మరియు AWD వేరియంట్‌లలో కూడా లభిస్తుంది. కాగా, వీటిలో ఏయే స్పెసిఫికేషన్ వెర్షన్ ను భారతదేశంలో విడుదల చేస్తారనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ధరను పరిగణలోకి తీసుకుంటే, కంపెనీ చిన్న బ్యాటరీ ప్యాక్ మరియు టూవీల్ డ్రైవ్ లేఅవుట్‌తో కూడిన వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?

హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ యొక్క 2WD వేరియంట్ 215bhp పవర్ మరియు 350Nm పీక్ టార్క్ ను జనరేట్ చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. కాగా, ఐయానిక్ 5 AWD వేరియంట్‌లో ఒక్కొక్క యాక్సిల్ పై ఒక్కొక్క మోటార్ చొప్పున మొత్తం రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 302bhp పవర్ మరియు 605Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి.

చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?

రేంజ్ విషయానికి వస్తే, పెద్ద 72.6kWh బ్యాటరీ ప్యాక్ మరియు 2WD లేఅవుట్‌తో కూడిన 'లాంగ్-రేంజ్' వేరియంట్ ఐయానిక్ 5 పూర్తి ఛార్జింగ్‌కు 481కిమీల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. అలాగే, చిన్న 58kWh బ్యాటరీ ప్యాక్‌ మరియు అదే పవర్‌ట్రెయిన్ కూడిన ఐయానిక్ 5 పూర్తి ఛార్జింగ్‌ పై 385 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. భారతదేశంలో హ్యుందాయ్ ఐయానిక్ 5 వేరియంట్‌లను బట్టి రూ. 38 లక్షల నుండి రూ. 45 లక్షల మధ్యలో అందుబాటులో ఉండొచ్చని అంచనా.

Source

Most Read Articles

English summary
Hyundai ioniq 5 electric car spotted testing in india is getting ready for official launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X