భారత మార్కెట్ కోసం ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్న హ్యుందాయ్

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా ఉన్న కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, ఇప్పుడు భారత ఈవీ మార్కెట్లో కూడా అగ్రగామిగా నిలిచేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం కంపెనీ తక్కువ ధరలో ఓ ఎలక్ట్రిక్ కారును తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం, హ్యుందాయ్ భారతదేశం కోసం ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేయడం ప్రారంభించింది.

భారత మార్కెట్ కోసం ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్న హ్యుందాయ్

హ్యుందాయ్ మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో తమ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు ఐయానిక్ 5 (Hyundai Ioniq 5) ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ ఇప్పటికే కొన్ని టీజర్ చిత్రాలను కూడా విడుదల చేసింది. హ్యుందాయ్ కి ఇది భారత మార్కెట్లో రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. కంపెనీ ప్రస్తుతం, భారత విపణిలో హ్యుందాయ్ కోన (Hyundai Kona) అనే ఎలక్ట్రిక్ కారును కూడా విక్రయిస్తోంది.

భారత మార్కెట్ కోసం ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్న హ్యుందాయ్

ఈ సంవత్సరం నుండి దేశానికి మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావడంపై హ్యుందాయ్ దృష్టి సారిస్తుందని సదరు నివేదిక పేర్కొంది. ఈ విషయంపై హ్యుందాయ్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ మరియు సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, భారతదేశంలో ఛార్జింగ్ ఎకోసిస్టమ్, సేల్స్ నెట్‌వర్క్ మరియు ఎలక్ట్రిక్ కార్ లైనప్ కోసం అనుసరించాల్సిన అసెంబ్లింగ్ ప్రక్రియ వంటి సమస్యలపై కంపెనీలోని వివిధ విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

భారత మార్కెట్ కోసం ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్న హ్యుందాయ్

హ్యుందాయ్ నుండి రాబోయే కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారు ధరను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ కారు తయారీలో ఎక్కువ స్థానికీకరణను సాధించాలనే అంశంపై పరిశీలిస్తున్నట్లు గార్గ్ పేర్కొన్నారు. అంటే దీనర్థం, హ్యుందాయ్ తమ కొత్త ఎలక్ట్రిక్ కారు తయారీ ఖర్చులను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా, ఈ కారులో ఉపయోగించబోయే చాలా వరకూ విడిభాగాలను స్థానికంగానే కొనుగోలు చేయడం మరియు తయారు చేయడం ద్వారా దీని ధరను కస్టమర్‌కు అందుబాటులో ఉంచుతుంది.

భారత మార్కెట్ కోసం ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్న హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా వచ్చే 2028 నాటికి భారతదేశంలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఇందుకోసం సుమారు రూ. 40 బిలియన్ల (దాదాపు 512 మిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. హ్యుందాయ్ ప్రణాళికల్లో ఈ కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారు కూడా ఓ భాగంగా ఉంటుంది. హ్యుందాయ్ ప్రస్తుతం కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరుతో భారత మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. ఈ కొరియా కార్‌మేకర్ సమీప భవిష్యత్తులో వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును దక్కించుకున్న తమ పాపులర్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ క్రాసోవర్ ను విడుదల చేయనుంది.

భారత మార్కెట్ కోసం ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్న హ్యుందాయ్

అయానిక్ 5 హ్యుందాయ్ మోటార్ గ్రూప్ యొక్క E-GMP ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది, ఇది 800V ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఇటీవలే ప్రారంభించబడిన 350kW కంటే ఎక్కువ వేగంతో ఛార్జ్ చేయగల Kia EV6 కూడా ఇదే ప్లాట్‌ఫారమ్ పై తయారు చేయబడింది. కొత్త హ్యుందాయ్ ఐయానిక్ 5 దాని బ్యాటరీ ప్యాక్‌లను EV6తో పంచుకుంటుంది. కియా ఈవీ6 తో పోల్చుకుంటే, హ్యుందాయ్ అయానిక్ 5 ధరను తక్కువగా ఉంచేందుకు కంపెనీ ఇందులో చిన్న బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు.

భారత మార్కెట్ కోసం ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్న హ్యుందాయ్

కియా ఈవీ6 మాదిరిగానే హ్యుందాయ్ ఐయానిక్ 5 కూడా రియర్ వీల్ డ్రైవ్ (RWD) (సింగిల్ మోటార్ వెర్షన్) మరియు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) (డ్యూయెల్ మోటార్ వెర్షన్) రూపాల్లో అందించబడుతుంది. హ్యుందాయ్ ఐయానిక్ 5 సింగిల్ మోటార్ వెర్షన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులో టాప్-స్పెక్ డ్యూయల్ మోటార్ వెర్షన్ గరిష్టంగా 232 బిహెచ్‌పి శక్తిని మరియు 608 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్ కోసం ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్న హ్యుందాయ్

రేంజ్ విషయానికి వస్తే, ఇందులోని 58 కిలోవాట్అవర్ బ్యాటరీ ప్యాక్‌ సాయంతో ఐయానిక్ 5 ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ గరిష్టంగా 319 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంద. కాగా, రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ WLTP పరీక్ష ప్రకారం పూర్తి చార్జ్ పై గరిష్టంగా 384 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. హ్యుందాయ్ ఐయానిక్ 5 ఓ రెట్రో హాట్ హ్యాచ్‌బ్యాక్ లాగా కనిపిస్తున్నప్పటికీ, ఇది 3,000 మిమీ పొడవైన వీల్‌బేస్ తో ఓ పొడవాటి క్రాస్‌ఓవర్‌ మాదిరిగా ఉంటుంది. ఈ కారు మొత్తం పొడవు 4,635 మిమీ, వెడల్పు 1,890 మిమీ మరియు ఎత్తు 1,605 మిమీగా ఉంటుంది.

భారత మార్కెట్ కోసం ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్న హ్యుందాయ్

భారతదేశంలో హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును స్థానికంగా అసెంబ్లింగ్ చేయడంతో పాటుగా కంపెనీ ఇందులో చిన్న బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తున్న కారణంగా దీని ధర కియా ఈవీ6 కన్నా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో అయానిక్ 5 ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ధరలు సుమారు రూ. 50 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. లేటస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hyundai to launch a small electric car for indian market details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X