హ్యుందాయ్ ఐయానిక్ 6 (Hyundai Ioniq 6) ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. వివరాలు

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఎట్టకేలకు తమ నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ కారు ఐయానిక్ 6 (Hyundai Ioniq 6) ను అధికారికంగా ఆవిష్కరించింది. అయితే, ఇది హ్యుందాయ్ ఐయానిక్ 5 మాదిరిగా క్రాసోవర్ రూపంలో కూడా సెడాన్ రూపంలో తయారు చేయబడింది. హ్యుందాయ్ తమ ఐయానిక్ 6 కారును 'ఎలక్ట్రిఫైడ్ స్ట్రీమ్‌లైనర్' అని పిలుస్తోంది మరియు ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌ను చూస్తే, దాని ట్యాగ్‌లైన్ నిజంగా ఈ ఎలక్ట్రిక్ వాహనం యొక్క డిజైన్‌కు సరిపోతుందనిపిస్తుంది.

హ్యుందాయ్ ఐయానిక్ 6 (Hyundai Ioniq 6) ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. వివరాలు

హ్యుందాయ్ ఐయానిక్ 6 కేవలం 0.21 డ్రాగ్ కోఎఫీషియంట్‌ను కలిగి ఉంటుంది మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత జారుడు స్వభావం కలిగిన హ్యుందాయ్ మోడల్‌గా నిలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ డిజైన్ మరియు అది సాధించిన డ్రాగ్ కోఎఫీషియంట్‌ను పరిశీలిస్తే, హ్యుందాయ్ ఐయానిక్ 6 అభివృద్ధి వెనుక ఉన్న ఇంజనీరింగ్ బృందం ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌ను విచిత్రంగా కనిపించకుండా వీలైనంత జారేలా చేయడంలో ప్రశంసనీయమైన పని చేసిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

హ్యుందాయ్ ఐయానిక్ 6 (Hyundai Ioniq 6) ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. వివరాలు

డిజైన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ ఐయానిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్ ఇదివరకటి ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు మాదిరిగానే మినిమలిస్ట్ మరియు స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు తయారీలో స్మూత్ బాడీ ప్యానెల్స్‌ని ఉపయోగించడం వలన ఇది టియర్‌డ్రాప్ సిల్హౌట్ ను కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ కారు ముందు భాగంలో 700 పారామెట్రిక్ పిక్సెల్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫ్రంట్ బంపర్‌లో నిలువు మూలకాలతో చాలా అధునాతనంగా కనిపిస్తుంది. అలాగే, సైడ్స్‌లో చాలా స్పోర్టీగా కనిపించే అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ ఐయానిక్ 6 (Hyundai Ioniq 6) ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. వివరాలు

హ్యుందాయ్ ఐయానిక్ 6 వెనుక భాగం వెనుక విండో క్రింద చక్కగా ఇంటిగ్రేట్ చేయబడిన స్పాయిలర్ మరియు దాని క్రింద డక్‌టైల్ స్పాయిలర్‌ ఉంటాయి. అంతే కాకుండా, వెనుక బంపర్ కూడా ఫ్రంట్ బంపర్ మాదిరిగానే నిలువు మూలకాలను కలిగి ఉంటుంది. వెనుక వైపు హ్యుందాయ్ ఐయానిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్ యొక్క పూర్తి-వెడల్పును కనెక్ట్ చేస్తున్నట్లుగా ఉండే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లు మరియు రియర్ స్పాయిలర్‌లో ఎల్ఈడి స్టాప్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ ఐయానిక్ 6 (Hyundai Ioniq 6) ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. వివరాలు

హ్యుందాయ్ ఐయానిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్ లో సైడ్ మిర్రర్స్ ఉండవు. వాటి స్థానంలో హెచ్‌డి కెమెరాలు ఉంటాయి, ఇవి రోడ్డుకి ఇరువైపులా వెనుకగా వస్తున్న ట్రాఫిక్ ను క్యాప్చూర్ చేసి క్యాబిన్ లోపల స్క్రీన్ పై కనిపించేలా చేస్తాయి. లోపలి భాగంలో, హ్యుందాయ్ ఐయానిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్ దాని బటన్-లెస్ డోర్ ప్యానెల్స్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు సింగిల్ డాష్ ఫ్రేమ్‌తో లోపలి భాగంలో మినిమలిస్ట్ థీమ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ కారులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కోసం రెండు పెద్ద 12 ఇంచ్ స్క్రీన్‌లను ఉపయోగించారు.

హ్యుందాయ్ ఐయానిక్ 6 (Hyundai Ioniq 6) ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. వివరాలు

డ్యాష్‌బోర్డుకి ఇరువైపులా అంచులలో ఉన్న మరో రెండు స్క్రీన్‌లు గతంలో పేర్కొన్నట్లుగా ఈ కారులో సైడ్-వ్యూ కెమెరాలకు డిస్‌ప్లేలుగా పనిచేస్తాయి. ఇక ఈ కారులో లభించే ఇతర ఫీచర్లను గనిస్తే, ఇందులో 64 రకాల ఆంబియంట్ లైటింగ్‌తో పలు ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇవి ఈ కారులో మరికొంత సమయం గడపడానికి ఇంటీరియర్‌ను మరింత ఆసక్తికరంగా చేస్తాయి. హ్యుందాయ్ ఐయానిక్ 6 కారుకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

హ్యుందాయ్ ఐయానిక్ 6 (Hyundai Ioniq 6) ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. వివరాలు

భారత్‍‌లో హ్యుందాయ్ ఐయానిక్ 5 లాంచ్ ఎప్పుడంటే..

ఇదిలా ఉంటే, హ్యుందాయ్ పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' (Hyundai Ioniq 5) ఈ ఏడాది ద్వితీయార్థంలో దేశీయ విపణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో హ్యుందాయ్ కోనా తర్వాత ఐయానిక్5 ఈ కొరియన్ కంపెనీకి రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఇటీవలే 2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా దక్కించుకుంది.

హ్యుందాయ్ ఐయానిక్ 6 (Hyundai Ioniq 6) ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. వివరాలు

భారత మార్కెట్లో విడుదల కాబోయే కొత్త హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు రెండు పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిలో మొదటిది సింగిల్-మోటార్ యూనిట్, ఇది 169 హెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై దాదాపుగా 354 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇకపోతే, రెండవది డ్యూయల్-మోటార్‌తో కూడిన ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్. ఇది గరిష్టంగా 325 హెచ్‌పి పవర్ మరియు 605 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై 412 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

హ్యుందాయ్ ఐయానిక్ 6 (Hyundai Ioniq 6) ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. వివరాలు

చార్జింగ్ విషయానికి వస్తే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుని 220 కిలోవాట్ డిసి ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చార్జ్ చేసుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. కొరియన్ కార్ కంపెనీ కియా విడుదల చేసిన ఈవీ6 ప్లాట్‌ఫామ్‌ ఆధారంగానే ఈ హ్యుందాయ్ ఐయానిక్ 5 కూడా తయారు చేశారు. అయితే, కియా ఈవీ6 మాదిరిగా ఇది ఇంపోర్టెడ్ రూట్‌లో కాకుండా, ఇక్కడే భారత మార్కెట్లో తయారు కానుంది. మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ. 35 లక్షల మరియు 40 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Hyundai unveils ioniq 6 electric sedan globally details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X