హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్‌కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయ విపణిలో విక్రయిస్తున్న లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) లో కొన్ని వేరియంట్లను నిలిపివేసినట్లు సమాచారం. హ్యుందాయ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లో కొన్ని వెన్యూ వేరియంట్ల బుకింగ్ లు తాత్కాలికంగా హోల్డ్ చేయబడ్డాయి. దీన్ని బట్టి చూస్తుంటే, కంపెనీ త్వరలోనే అప్‌గ్రేడెడ్ వెన్యూ ని మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్‌కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ను ప్రవేశపెట్టనుంది. సమాచారం ప్రకారం, హ్యుందాయ్ వెన్యూ యొక్క కొన్ని వేరియంట్‌ లు మాత్రమే డీలర్‌షిప్‌లలో అమ్మకానికి ఉంచబడ్డాయి మరియు ప్రస్తుతం దాని DCT మరియు iMT వేరియంట్‌ లు హోల్డ్‌లో ఉంచబడ్డాయి. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ కోసం కొన్ని డీలర్‌షిప్‌లు అధికారికంగా బుకింగ్‌ లను ప్రారంభించినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ప్రస్తుతానికి దీని గురించి కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు.

హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్‌కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?

మార్కెట్ సమాచారం ప్రకారం, కొత్తగా రాబోయే 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో అప్‌గ్రేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్‌ ఉంటుంది, ఇది కొత్త ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా మరియు కొత్త తరం హ్యుందాయ్ టక్సన్ నుండి ప్రేరణ పొంది డిజైన్ చేయబడుతుంది. అంతేకాకుండా, ఇందులో రివైప్డ్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు రివైజ్డ్ టెయిల్‌లైట్ సెటప్‌ను ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్‌కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?

గతంలో టెస్టింగ్ సమయంలో వెల్లడైన చిత్రాల ప్రకారం, కొత్త వెన్యూ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ ని అలాగే ఉంచుతాయని సూచిస్తోంది. హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్‌ లో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ మార్పులు ఇంటీరియర్ షేడ్ మరియు సీట్ అప్‌హోలెస్ట్రీకి సంబంధించి ఉంటాయని తెలుస్తోంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను జోడించే అవకాశం ఉంది మరియు ఇది కియా సోనెట్ యొక్క 10.25 ఇంచ్ డిస్‌ప్లే యూనిట్ కావచ్చు.

హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్‌కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?

అంతేకాకుండా, ఈ చిన్న కారులో ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను కూడా ఆశించవచ్చు. ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న హ్యుందాయ్ వెన్యూలో ఇప్పటికే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్‌కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?

కాగా, ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ వెన్యూ దాని ప్రస్తుత ఇంజన్‌లనే కొనసాగించే అవకాశం ఉంది. కొత్త మోడల్ లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్‌లతో విక్రయించబడుతుంది. వీటిలో మొదటి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (83 బిహెచ్‌పి పవర్), రెండవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ (100 బిహెచ్‌పి పవర్) మరియు మూడవది 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (120 బిహెచ్‌పి పవర్) పవర్.

హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్‌కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?

ఈ మూడు ఇంజన్లు కూడా వివిధ రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. వీటిలో మ్యాన్యువల్, ఐఎమ్‍టి మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ), టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ మరియు టాటా పంచ్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్‌కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?

హ్యుందాయ్ వెన్యూ తొలిసారిగా మే 21, 2019న భారత మార్కెట్లో విడుదలైంది. ఇది మార్కెట్లోకి వచ్చిన కేవలం 31 నెలల్లోనే 2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైంది. మార్కెట్లో వెన్యూ ధరలు రూ. 6.50 లక్షల నుండి రూ. 11.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే ఇది 50,000 యూనిట్లకు విక్రయాలను నమోదు చేసి, రికార్డు సృష్టించింది. ఆ తర్వాత మరికొన్ని నెలల పాటు డిమాండ్ మందగించింది. మొదటి 15 నెలల్లో 1,00,000 యూనిట్ల మార్కును చేరుకుంది.

హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్‌కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?

హ్యుందాయ్ వెన్యూ పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, క్యాబిన్ లో తగినంత స్థలాన్ని అందిస్తుంది. ఈ చిన్న కారులో తగినంత బూట్ స్పేస్ కూడా ఉంటుంది. అదనపు బూట్ స్పేస్ కోసం వెనుక సీట్లను మడచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. వెన్యూ పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, వెనుక వరుసలోని ప్యాసింజర్ల కోసం ఇందులో తగినంత లెగ్‌రూమ్ లభిస్తుంది. సేఫ్టీ పరంగా చూస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ వార్నింగ్ సిస్టమ్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మొదలైనవి ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hyundai venue facelift launch around the corner many variants removed from website
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X