హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది: ధర రూ. 12.16 లక్షలు & మరిన్ని కొత్త కలర్స్‌లో

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్' (Hyundai Venue N Line) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ఈ కొత్త వెర్షన్ యొక్క ప్రారంభ ధర రూ. 12.16 లక్షలు. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు కొత్త వెర్షన్ లో విడుదలకావడం వల్ల తప్పకుండా మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

Recommended Video

భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్' (Hyundai Venue N Line) డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర రూ. 12.16 లక్షలు

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఇప్పుడు రెండు వేరియంట్స్ లో విడుదలైంది. అవి N6 మరియు N8 వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ.12.16 లక్షలు మరియు రూ.13.15 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఇప్పటికే ఈ అప్డేటెడ్ SUV కోసం బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తిగల కష్టమర్లు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర రూ. 12.16 లక్షలు

కొత్త హ్యుందాయ్ N లైన్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. ఇందులో మూడు డ్యూయల్ టోన్ కలర్స్ (పోలార్ వైట్, షాడో గ్రే మరియు థండర్ బ్లూ విత్ బ్లాక్ రూప్) కాగా, మరో రెండు మోనోటోన్ కలర్స్ (పోలార్ వైట్ మరియు షాడో గ్రే). ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర రూ. 12.16 లక్షలు

భారతీయ మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ వెన్యూ ఎన్ లైన్ చాలా వరకు కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ SUV యొక్క ముందుభాగంలో బంపర్‌పై N లైన్ బ్యాడ్జింగ్, దిగువ భాగంలో రెడ్ యాక్సెంట్స్ కలిగిన రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు, రూఫ్ రైల్స్ పైన రెడ్ కలర్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర రూ. 12.16 లక్షలు

సైడ్ ప్రొఫైల్ లో రెడ్ కాలిపర్‌లతో కొత్త 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో కూడా రెడ్ ఎలిమెంట్స్ చూడవచ్చు. అదే సమయంలో ఎన్ లైన్ బ్యాడ్జ్ మరియు కంపెనీ లోగో కూడా రియర్ ఫ్రొపైల్ లో ఉన్నాయి. మొత్తం మీద డిజైన్ అద్భుతంగా ఉంటుంది. కావున చూపరులను వెంటనే ఆకట్టుకుటుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర రూ. 12.16 లక్షలు

ఇక ఇంటీరియర్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఇది కొంత భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అందుబాటులో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్ కమాండ్స్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. కావున ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర రూ. 12.16 లక్షలు

కొత్త హ్యుందాయ్ ఎన్ లైన్ 1.0 లీటర్ జిడిఐ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 118 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 7 స్పీడ్ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర రూ. 12.16 లక్షలు

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కొన్ని మెకానికల్ అప్‌గ్రేడ్స్ పొందుతుంది. ఇందులో ఇప్పుడు డ్యూయల్ ఎగ్జాస్ట్ పైప్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఇప్పుడు కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ కూడా లభిస్తుంది. ఇది మంచి గ్రిప్ అందించేలా రూపొందించబడింది. ఇందులో డిస్క్ బ్రేకులు అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర రూ. 12.16 లక్షలు

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ అసిస్ట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి అందుబాటులో ఉంటాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర రూ. 12.16 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మొత్తానికి 'హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్' మోడల్ దేశీయ మార్కెట్లో విడుదలైంది, బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారభమయ్యాయి. ఈ కొత్త మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయమై డిజైన్ పొందుతుంది. అయితే రానున్న రోజుల్లో ఎలాంటి అమ్మకాలు పొందుతుంది అనే విషయమే తెలియాలి. ఇది మార్కెట్లో కియా సోనెట్ ఎక్స్ లైన్, టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ మరియు నెక్సాన్ కజిరంగా ఎడిషన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Hyundai venue n line launched in india price specs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X