సురక్షితమైన కార్ల జాబితాలో చేరిన Volkswagen Virtus.. క్రాస్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఫోక్స్‌వ్యాగన్' యొక్క 'వర్టస్' లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లో అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలో మంచి అమ్మకాలు పొందిన ఈ మిడ్-సైజ్ సెడాన్ ఇప్పుడు సురక్షితమైన కార్ల జాబితాలో చేరిపోయింది.

లాటిన్ NCAP క్రాస్ టెస్ట్‌లో Volkswagen Virtus ఏకంగా ఇప్పుడు 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. టెస్ట్ చేసిన కారు మెక్సికన్ మార్కెట్లో విక్రయించబడుతున్నప్పటికీ అది భారతీయ మార్కెట్లో తయారుచేయబడింది. లాటిన్ అమెరికాలో విక్రయించబడుతున్న భారతదేశంలోని తయారు చేసిన మోడల్ ప్రామాణికంగా అన్ని భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. కావున ఇది అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. ఇది కంపెనీకి గర్వకారణం అనే చెప్పాలి.

Volkswagen Virtus.. క్రాస్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం

లాటిన్ NCAP క్రాస్ టెస్ట్‌లో Volkswagen Virtus యొక్క బేస్ వేరియంట్‌ను టెస్ట్ చేయడం జరిగింది. బహుశా ఈ మిడ్-సైజ్ సెడాన్‌కి ఇది మొట్టమొదటిక్రాష్ టెస్ట్ అవుతుంది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో 92% స్కోర్ చేసింది. ఇందులో మొత్తం 40 పాయింట్లకు గానూ 36.94 పాయింట్లు సాధించింది. అదే సమయంలో పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 92% రేటింగ్‌ సాధించి, 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది.

అయితే పాదాచారులు మరియు రహదారి వినియోగదారుల పరీక్షలో మాత్రం ఇది 53 శాతం మాత్రమే స్కోర్ చేసి మొత్తం 48 పాయింట్లకు గానూ 25.48 శాతం స్కోర్ చేసింది. ఈ టెస్ట్ లో ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. సేఫ్టీ అసిస్ట్ సిస్టమ్స్ టెస్ట్‌లో ఈ సెడాన్ మొత్తం 43 పాయింట్లకు 36.54 పాయింట్లు స్కోర్ చేసి 85 శాతం రేటింగ్‌ను పొందగలిగింది.

ఇండియా స్పెక్ వర్టస్ యొక్క బేస్ మోడల్‌లు కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లతో స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. కానీ మెక్సికన్ మోడల్ మాత్రం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో లభిస్తుంది. అయితే మెక్సికో మోడల్ వర్టస్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాగా ఇండియన్ మోడల్ రైట్ హ్యాండ్ మోడల్. అయితే మెక్సికన్ మోడల్ ఆటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ సిస్టం కూడా పొందుతుంది. అయితే ఈ ఫీచర్ ఇండియన్ మోడల్ లో లేదు.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ డైనమిక్ లైన్, పర్ఫార్మెన్స్ లైన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇవి 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. డైనమిక్ లైన్‌ వేరియంట్స్ బేజ్ మరియు బ్లాక్ కలర్ ఇంటీరియర్స్ ఉన్నాయి. అయితే పర్ఫార్మెన్స్ లైన్ వేరియంట్స్ లోని సీట్లు రెడ్ కలర్ స్టిచ్చింగ్, అల్యూమినియం పెడల్స్ మరియు డ్యాష్‌బోర్డ్‌పై రెడ్ కలర్ వంటివి పొందుతుంది.

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్'లోని 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ 115 హెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది. 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ 150 హెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ కొత్త మిడ్ సైజ్ సెడాన్ లో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ కొలైజన్ బ్రేక్స్, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి భద్రతా ఫీచర్స్ ఉన్నాయి.

Most Read Articles

English summary
India made volkswagen virtus sedan gets 5 star rating in latin ncap crash test
Story first published: Saturday, December 3, 2022, 9:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X