భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, గడచిన జూలై 2022 నెలలో భారతదేశంలో కార్ల అమ్మకాలు 17.10 శాతం పెరిగాయి. అలాగే, జూన్ 2022తో పోల్చితే నెలవారీ అమ్మకాలు కూడా 6.38 శాతం పెరిగాయి. గత నెలలో భారతదేశంలో మొత్తం 3,41,302 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. జూలై 2021 నెలలో విక్రయించిన 2,91,464 వాహనాలతో పోలిస్తే, జూన్ 2022 నెలలో మొత్తం వాహనాలు 49,838 యూనిట్లు (17.10 శాతం) పెరిగాయి. మరి గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్‌లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

1) మారుతి సుజుకి - 1,42,850 యూనిట్లు

ఈ జాబితాలో ఎప్పటిలాగే మారుతి సుజుకి ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. మారుతి సుజుకి విక్రయించే చిన్న కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గత నెలలో కంపెనీ మొత్తం 1,42,850 యూనిట్లను విక్రయించి భారత కార్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జూలై 2021 నెలలో మారుతి సుజుకి మొత్తం 1,33,732 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంతో పోలిస్తే, గత నెలలో కంపెనీ 6.82 శాతం (9,118 యూనిట్లు) వార్షిక వృద్ధిని సాధించాయి.కాగా, జూన్ 2022 నెలలో విక్రయించిన 1,22,685 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 16.44 శాతం (20,165 యూనిట్లు) నెలవారీ వృద్ధిని సాధించాయి.

భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

2) హ్యుందాయ్ - 50,500 యూనిట్లు

అంతకు ముందు నెలలో ఈ జాబితాలో మూడవ స్థానానికి పడిపోయిన కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, గత నెలలో మొత్తం 50,500 యూనిట్లను విక్రయించడంతో తిరిగి తన ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. జులై 2021 నెలలో హ్యుందాయ్ విక్రయించిన 48,042 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 2,458 యూనిట్లు (5.12 శాతం) పెరిగాయి. అలాగే, జూన్ 2022 నెలలో విక్రయించిన 49,001 యూనిట్లతో పోలిస్తే గత నెల అమ్మకాలు 3.06 శాతం (లేదా 1,499 యూనిట్లు) నెలవారీ వృద్ధిని కనబరిచాయి.

భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..
Rank Brand Jul-22 Jul-21 Growth (%) YoY
1 Maruti 1,42,850 1,33,732 6.82
2 Hyundai 50,500 48,042 5.12
3 Tata 47,505 30,185 57.38
4 Mahindra 28,053 21,046 33.29
5 Kia 22,022 15,016 46.66
6 Toyota 19,693 13,105 50.27
7 Renault 7,128 9,787 -27.17
8 Honda 6,784 6,055 12.04
9 Skoda 4,447 3,080 44.38
10 MG 4,013 4,225 -5.02
11 Nissan 3,667 4,259 -13.90
12 Volkswagen 2,915 1,962 48.57
13 Jeep 1,150 930 23.66
14 Citroen 575 40 1337.50
భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

3) టాటా మోటార్స్ - 47,505 యూనిట్లు

భారత మార్కెట్లో టాటా మోటార్స్ అమ్మకాలు స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. అయితే, గడచిన జూలై 2022 నెలలో టాటా మోటార్స్ దేశీయ కార్ల విక్రయాలలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత నెలలో కంపెనీ మొత్తం 47,505 యూనిట్లను విక్రయించి 57.38 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. జులై 2021 నెలలో టాటా మోటార్స్ కేవలం 30,185 కార్లను మాత్రమే విక్రయించింది. ఇక నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే జూన్ 2022 నెలలో విక్రయించిన 45,197 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 5.11 శాతం (2,308 యూనిట్లు) పెరిగాయి.

భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

4) మహీంద్రా - 28,053 యూనిట్లు

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయడం ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షిస్తోంది. మహీంద్రా గడచిన జూలై 2022 నెలలో మొత్తం 28,053 కార్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో (జులై 2021లో) కంపెనీ విక్రయించిన 21,046 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 33.29 శాతం (7,000 యూనిట్లు) పెరిగాయి. ఇక నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే, మహీంద్రా గడచిన జూన్ 2022 నెలలో విక్రయించిన మొత్తం 26,880 యూనిట్లతో పోలిస్తే, గత నెల అమ్మకాలు 4.36 శాతం (1,173 యూనిట్లు) పెరిగాయి.

భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

5) కియా - 22,022 యూనిట్లు

కొరియన్ కార్ కంపెనీ కియా జూలై 2022లో భారత మార్కెట్లో మొత్తం 22,022 యుటిలిటీ వాహనాలను విక్రయించింది. జూలై 2021 నెలలో కంపెనీ విక్రయించిన 15,016 యూనిట్లతో పోలిస్తే గత నెలలో కియా ఇండియా అమ్మకాలు 46.66 శాతం (7,006 యూనిట్లు) వార్షిక వృద్ధిని సాధించాయి. కాగా, జూన్ 2022 నెల అమ్మకాలతో పోలిస్తే మాత్రం గత నెల అమ్మకాలు 8.33 శాతం (2,002 యూనిట్లు) తగ్గాయి.

భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

6) టొయోటా - 19,693 యూనిట్లు

జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టొయోటా జూలై 2022 నెలలో మొత్తం 19,693 కార్లను విక్రయించింది. జులై 2021 నెలలో కంపెనీ విక్రయించిన 13,105 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 6,558 యూనిట్లు (50.27 శాతం) పెరిగాయి. అలాగే, నెలవారీ అమ్మకాలను గమనిస్తే, జూన్ 2022 నెలలో కంపెనీ విక్రయించిన 16,512 యూనిట్లతో పోలిస్తే గత నెల అమ్మకాలు 19.26 శాతం (3,181 యూనిట్లు) పెరిగాయి.

భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

7) రెనో- 7,128 యూనిట్లు

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అమ్మకాలు మాత్రం ప్రతికూలంగా నమోదయ్యాయి. ప్రస్తుతం, ఈ కార్ బ్రాండ్ కు భారత మార్కెట్లో క్విడ్ మరియు కైగర్ మినహా వేరే బలమైన మోడళ్లు లేకపోవడంతో కంపెనీ అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. జూలై 2021 నెలలో కంపెనీ విక్రయించిన 9,787 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 27.17 శాతం (2,659 యూనిట్లు) తగ్గాయి. అలాగే, జూన్ 2022 నెలలో విక్రయించిన 9,317 యూనిట్లతో పోలిస్తే కూడా గత నెల అమ్మకాలు 23.49 శాతం (2,189 యూనిట్లు) తగ్గాయి.

భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

8) హోండా - 6,784 యూనిట్లు

జపనీస్ కార్ బ్రాండ్ హోండా ఇటీవలే తమ హైబ్రిడ్ సెడాన్ ను మార్కెట్లో విడుదల చేయడంతో ఈ కార్ బ్రాండ్ అమ్మకాలు జోరందుకున్నాయి. హోండా గడచిన జూలై 2022 నెలలో 6,784 కార్లను విక్రయించి ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే కాలంలో విక్రయించిన 6,055 యూనిట్లతో పోలిస్తే గత నెలలో కంపెనీ అమ్మకాలు 12.04 శాతం (729 యూనిట్లు) పెరిగాయి. అలాగే, జూన్ 2022 నెలలో విక్రయించిన 7,834 హోండా కార్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 13.40 శాతం (1,050 యూనిట్లు) తగ్గాయి.

భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

9) స్కోడా - 4,447 యూనిట్లు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. స్కోడా గడచిన జూలై నెలలో 4,447 కార్లను విక్రయించింది. జులై 2021 నెలలో విక్రయించిన 3,080 స్కోడా కార్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 44.38 శాతం (1,367 యూనిట్లు) వృద్ధి చెందాయి. అయితే, జూన్‌ 2022 నెలలో విక్రయించిన 6,023 యూనిట్లతో పోలిస్తే గత నెలలో నెలవారీ అమ్మకాలు 26.17 శాతం (1,576 యూనిట్లు) తగ్గాయి.

భారత మార్కెట్లో జులై 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్స్ ఏవంటే..

10) ఎమ్‌జి మోటార్ - 4,013 యూనిట్లు

చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ గత నెలలో మొత్తం 4,013 వాహనాలను విక్రయించింది. జూలై 2021 నెలలో కంపెనీ విక్రయించిన మొత్తం 4,225 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 5.02 శాతం (212 యూనిట్లు) తగ్గాయి. అలాగే, నెలవారీ అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. జూన్ 2022 నెలలో నెలలో ఎమ్‌జి మోటార్ విక్రయించిన 4,503 యూనిట్లతో పోలిస్తే గత నెల అమ్మకాలు 10.88 శాతం (490 యూనిట్లు) తగ్గాయి.

Most Read Articles

English summary
India s top 10 best selling car brands in july 2022 maruti leads the list again
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X