మార్కెట్లో లభించే చవకైన టాప్ 5 సిఎన్‌జి కార్లు ఇవే (Top 5 Affordable CNG Cars In India)..

భారతదేశంలో కొత్తగా వచ్చిన బిఎస్6 ఉద్గార నిబంధనల నేపథ్యంలో, కార్ల తయారీదారులు డీజిల్ కార్లను నిలిపివేయడం లేదా వాటి ఉత్పత్తిని తగ్గించడం చేశాయి. మరోవైపు దేశంలో అధికంగా ఉన్న పెట్రోల్ ధరలు కూడా కస్టమర్లను ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూసేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కస్టమర్లు ఇప్పుడు తక్కువ ధర మరియు అధిక మైలేజీనిచ్చే సిఎన్‌జి కార్లను కొనేందుకు ఆసక్తి చూప్తున్నారు.

ఒక్పపుడు దేశంలో సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్) గ్యాస్ లభ్యత పరిమిత నగరాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, ఇప్పుడు సిఎన్‌జి ఇంధన దేశవ్యాప్తంగా అనేక నగరాలు మరియు పట్టణాలలో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో సిఎన్‌జి కార్లను కొనుగోలు చేయటం చాలా ఉత్తతమైన నిర్ణయం. సిఎన్‌జి ఇంధనం పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధర కంటే తక్కువకే లభించడమే కాకుండా, వాటితో పోలిస్తే చాలా తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు వాటి కన్నా మెరుగైన మైలేజీ అందిస్తుంది.

మార్కెట్లో లభించే చవకైన టాప్ 5 సిఎన్‌జి కార్లు ఇవే (Top 5 Affordable CNG Cars In India)..

భారత మార్కెట్లో ఒకప్పుడు మారుతి సుజుకి మాత్రమే సిఎన్‌జి కార్లను విక్రయించేది. అయితే, ఇప్పుడు ఈ జాబితాలోకి కొత్త కంపెనీలు కూడా ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్ శాంత్రో, గ్రాండ్ ఐ10 నియోస్ మరియు ఆరా మోడళ్లలో సిఎన్‌జి కార్లను అందిస్తుండగా, టాటా మోటార్స్ ఇటీవలే తమ టియాగో మరియు టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లను విడుదల చేసింది. త్వరలోనే కియా కూడా తమ కార్లలో సిఎన్‌జి వాహనాలను అందించేందుకు సిద్ధమవుతోంది. సిఎన్‌జి వాహనాలకు డిమాండ్ ఇలానే పెరుగుతూపోతే, మరిన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌లను అందించే అవకాశం ఉంది.

సరే అదంతా అటుంచి, మనదేశంలో లభించే అత్యంత చవకైన టాప్ 5 సిఎన్‌జి వాహనాలను పరిశీలిస్తే..

మార్కెట్లో లభించే చవకైన టాప్ 5 సిఎన్‌జి కార్లు ఇవే (Top 5 Affordable CNG Cars In India)..

1. మారుతి సుజుకి ఆల్టో 800 ఎస్-సిఎన్‌జి - రూ.5.03 లక్షలు

ఈ టాప్ 5 జాబితాలో అత్యంత సరసమైన సిఎన్‌జి కారు మారుతి సుజుకి ఆల్టో 800 ఎస్-సిఎన్‌జి. ప్రస్తుతం, ఆల్టో 800 సిఎన్‌జి కార్ ఒకే ఒక వేరియంట్ (Alto 800 Lxi (O) CNG) లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ కారు ధర రూ.5.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ ధర వద్ద ఇది దేశంలో కెల్లా అత్యంత చవకైన సిఎన్‌జి కారుగా నిలుస్తుంది.

మార్కెట్లో లభించే చవకైన టాప్ 5 సిఎన్‌జి కార్లు ఇవే (Top 5 Affordable CNG Cars In India)..

మారుతి సుజుకి ఆల్టో 800 ఎస్-సిఎన్‌జి మోడల్ లో అదే 796 సిసి, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగించారు. సిఎన్‌జి ఇంధనంతో నడుస్తున్నప్పుడు ఈ ఇంజన్ గరిష్టంగా 40 బిహెచ్‌పి శక్తిని మరియు 60 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఆల్టో 800 కారు కేజీ సిఎన్‌జితో 31.59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

మార్కెట్లో లభించే చవకైన టాప్ 5 సిఎన్‌జి కార్లు ఇవే (Top 5 Affordable CNG Cars In India)..

2. హ్యందాయ్ శాంత్రో - రూ.6.41 లక్షలు

హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ శాంత్రో లో కంపెనీ ఓ సిఎన్‌జి వేరియంట్ ను కూడా విక్రయిస్తోంది. గతంలో ఈ చిన్న ఫ్యామిలీ కారులో కంపెనీ రెండు సిఎన్‌జి వేరియంట్‌లను (Magna మరియు Sportz) విక్రయించేది. అయితే, ప్రస్తుతం ఇందులో మాగ్నా వేరియంట్ ను డిస్‌కంటిన్యూ చేసి, కేవలం స్పోర్స్ వేరియంట్ ను మాత్రమే విక్రయిస్తోంది. మార్కెట్లో హ్యుందాయ్ శాంత్రో సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 6.41 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది కేజీ సిఎన్‌జి పై గరిష్టంగా 30.48 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని సర్టిఫై చేయబడింది.

మార్కెట్లో లభించే చవకైన టాప్ 5 సిఎన్‌జి కార్లు ఇవే (Top 5 Affordable CNG Cars In India)..

3. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - రూ.6.42 లక్షలు

ప్రస్తుతం, మారుతి సుజుకి ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్‌ఆర్‌ ఎస్-సిఎన్‌జి వెర్షన్ ఈ జాబితాలో ధర పరంగా మూడవ స్థానంలో నిలుస్తుంది. ఇందులోని సిఎన్‌జి మోడల్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో రెండు వేరియంట్ల ప్రైవేట్ కొనుగోలుదారుల కోసం మరొక వేరియంట్ కమర్షియల్ కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంటుంది. వీటిలో ప్రైవేట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే WagonR Lxi CNG 1.0L వేరియంట్ ధర రూ.6.42 లక్షలు కాగా, WagonR Vxi CNG 1.0L వేరియంట్ ధర రూ.6.86 లక్షలు గా ఉంది.

మార్కెట్లో లభించే చవకైన టాప్ 5 సిఎన్‌జి కార్లు ఇవే (Top 5 Affordable CNG Cars In India)..

కాగా, టాక్సీ ప్రయోజనం కోసం కొనుగోలు చేసే కమర్షియల్ వెర్షన్ WagonR Tour H3 వేరియంట్ ధర రూ.6.39 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎస్-సిఎన్‌జి వేరియంట్‌ కేవలం 1.0-లీటర్ 3-సిలిండర్, డ్యూయల్-జెట్ ఇంజన్‌‌తో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 57 బిహెచ్‌పి శక్తిని మరియు 82.1 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ కారు కేజీ సిఎన్‌జితో 34.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

మార్కెట్లో లభించే చవకైన టాప్ 5 సిఎన్‌జి కార్లు ఇవే (Top 5 Affordable CNG Cars In India)..

4. టాటా టియాగో - రూ.6.30 లక్షలు

టాటా మోటార్స్ భారతదేశంలో తొలిసారిగా సిఎన్‌జి కార్ల విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ విక్రయిస్తున్న టియాగో మరియు టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వెర్షన్లను ప్రవేశపెట్టింది. టాటా టియాగో సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్ కేవలం రూ. 6.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. టాటా టియాగో ఐ-సిఎన్‌జి వెర్షన్‌లోని 1.2-లీటర్, త్రీ-సిలిండర్ రెవోట్రాన్ ఇంజన్ గరిష్టంగా 73 బిహెచ్‌పి శక్తిని మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేజీ సిఎన్‌జికి గరిష్టంగా 26.49 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మార్కెట్లో లభించే చవకైన టాప్ 5 సిఎన్‌జి కార్లు ఇవే (Top 5 Affordable CNG Cars In India)..

5. హ్యుందాయ్ ఐ10 నియోస్ - రూ.7.16 లక్షలు

హ్యుందాయ్ నుండి లభిస్తున్న మరొక ఎంట్రీ-లెవల్ సిఎన్‌జి మోడల్ గ్రాండ్ ఐ10 నియోస్. భారత మార్కెట్లో ఈ సిఎన్‌జి మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటిలో మాగ్నా వేరియంట్ ధర రూ.7.16 లక్షలు కాగా, స్పోర్ట్స్ వేరియంట్ ధర రూ.7.69 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇవి రెండూ కూడా 1.2-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తాయి. సిఎన్‌జి ఇంధనంపై ఈ ఇంజన్ గరిష్టంగా 69 బిహెచ్‌పి శక్తిని మరియు 95.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సిఎన్‌జి ఇంధనంపై కేజీకి 28.5 కిమీ మైలేజీని ఇస్తుందని సర్టిఫై చేయబడింది.

మార్కెట్లో లభించే చవకైన టాప్ 5 సిఎన్‌జి కార్లు ఇవే (Top 5 Affordable CNG Cars In India)..

భారత మార్కెట్లో సిఎన్‌జి కార్ల కోసం చూస్తున్న వారికి పైన పేర్కొన్న మోడళ్లు మాత్రమే కాకుండా, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (S-presso CNG), ఈకో (Eeco CNG), స్విఫ్ట్ (Swift CNG), డిజైర్ (Dzire CNG), సెలెరియో (Celerio CNG) టాటా టియాగో టిగోర్ (Tigor CNG), హ్యుందాయ్ ఆరా (Aura CNG) మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలోకి లేటెస్ట్‌గా వచ్చింది సరికొత్త 2022 మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి. మార్కెట్లో ఈ సిఎన్‌జి మోడల్ (Maruti Suzuki Swift CNG) రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటిలో స్విఫ్ట్ సిఎన్‌జి విఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 7.77 లక్షలు కాగా, స్విఫ్ట్ సిఎన్‌జి జెడ్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 8.45 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

English summary
India s top five affordable cng cars alto wagonr tiago and more details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X