జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల.. ధర కేవలం రూ.24.44 లక్షలు మాత్రమే..!

అమెరికన్ ఎస్‌యూవీ స్పెషలిస్ట్ జీప్ (Jeep) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎస్‌యూవీ కంపాస్ (Compass) లో ఓ వార్షికోత్సవ ఎడిషన్ ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో జీప్ కంపాస్ వార్షికోత్సవ ఎడిషన్ (Jeep Compass Anniversay Edition) ధర రూ. 24.44 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. జీప్ భారతదేశంలో తమ వ్యాపారాన్ని ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ అమెరికన్ కంపెనీ తమ ఐకానిక్ కంపాస్ ఎస్‌యూవీలో ఈ కొత్త యానివర్స్‌రే ఎడిషన్ ను పరిచయం చేసింది.

జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల.. ధర కేవలం రూ.24.44 లక్షలు మాత్రమే..!

స్టాండర్డ్ జీప్ కంపాస్ తో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ కొన్ని కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. ముందుగా ఎక్స్టీరియర్ లో చేసిన మార్పుల విషయానికి వస్తే, కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఎస్‌యూవీలో గ్రానైట్ క్రిస్టల్ ఫినిషింగ్‌తో కూడిన 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, న్యూట్రల్ గ్రే ఫినిష్ చేయబడిన సైడ్ మిర్రర్స్, బాడీ-కలర్ ఫెండర్ ఫ్లేర్స్, యాక్సెంట్ కలర్ రూఫ్ రైల్స్‌ మరియు ఫ్రంట్ గ్రిల్ రింగులపై న్యూట్రల్ గ్రే ఫినిషింగ్ మొదలైన కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ప్రధానంగా కనిపిస్తాయి.

జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల.. ధర కేవలం రూ.24.44 లక్షలు మాత్రమే..!

జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ లో చేసిన ఈ కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చిన్నవే అయినప్పటికీ, స్టాండర్డ్ మోడల్ తో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ ను కాస్త ఎక్కువ ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి. ఈ మార్పులకు అదనంగా, జీప్ కంపాస్ వార్షికోత్సవ ఎడిషన్ ఎస్‌యూవీ ప్రత్యేకమైన ఐదవ వార్షికోత్సవ బ్యాడ్జింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇది జీప్ కంపాస్ భారత మార్కెట్లో తన విజయవంతమైన ఐదు సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది.

జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల.. ధర కేవలం రూ.24.44 లక్షలు మాత్రమే..!

జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఎక్స్టీరియర్ లో కన్నా ఇంటీరియల్ చేసిన మార్పులు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మార్పులలో లెదర్ సీట్లపై టంగ్‌స్టన్ యాక్సెంట్ స్టిచింగ్, బ్లాక్ హెడ్‌లైనర్, ఆటోమేటిక్ డిమ్మింగ్ రియర్-వ్యూ మిర్రర్ మరియు పియానో ​​బ్లాక్ మరియు యానోడైజ్డ్ గన్ మెటల్ ఇంటీరియర్ యాక్సెంట్‌లు కూడా ప్రధానంగా కనిపిస్తాయి. జీప్ కంపాస్ ఎస్‌యూవీ యొక్క స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చితే, ఈ కొత్త మార్పులన్నీ కూడా జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఎస్‌యూవీలో కొంచెం ఎక్కువ ప్రీమియంగా మరియు ఈ కారును మరింత స్పెషల్‌గా కనిపించేలా చేస్తాయి.

జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల.. ధర కేవలం రూ.24.44 లక్షలు మాత్రమే..!

జీప్ కంపాస్ ఎస్‌యూవీ టాప్-ఎండ్ వేరియంట్లలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఈ అద్భుతమైన అమెరికన్ ఎస్‌యూవీలో 7 ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌ తో కూడిన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆల్-స్పీడ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల.. ధర కేవలం రూ.24.44 లక్షలు మాత్రమే..!

కొత్తగా వచ్చిన జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లో కంపెనీ యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది మునుపటి మాదిరిగానే అవే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ముందుగా పెట్రోల్ ఇంజన్ గణాంకాలను పరిశీలిస్తే, ఇందులోని 1.4 లీటర్ మల్టీఎయిర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 161 బిహెచ్‌పి శక్తిని మరియు 2,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల.. ధర కేవలం రూ.24.44 లక్షలు మాత్రమే..!

ఇక డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 168 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ జీప్ కంపాస్ వార్షికోత్సవ ఎడిషన్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల వినియోగదారులు జీప్ కంపాస్ వార్షికోత్సవ ఎడిషన్ ను దేశవ్యాప్తంగా ఉన్న జీప్ డీలర్‌షిప్‌లలో మరియు జీప్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల.. ధర కేవలం రూ.24.44 లక్షలు మాత్రమే..!

జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసిన సందర్భంగా జీప్ బ్రాండ్ ఇండియా హెడ్ నిపున్ మహాజన్ మాట్లాడుతూ, "జీప్ కంపాస్ ఒక ఐకానిక్ ఎస్‌యూవీ, ఇది చాలా మంది హృదయాల్లో అడ్వెంచర్ మరియు ఆఫ్-రోడింగ్‌లను ప్రోత్సహిస్తూనే ఉంది. జీప్ కంపాస్ 2017లో భారతదేశంలో ప్రారంభించినప్పటి నుండి దాని యొక్క డిజైన్, శక్తి, ​​సామర్థ్యం మరియు విశ్వసనీయత విషయాల్లో అనేక విలక్షణమైన అవార్డులు మరియు గౌరవాలను దక్కించుకుంది. జీప్ కంపాస్ దేశంలోనే అగ్రగామి ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీగా స్థిరపడింది. ఇందులో వార్షికోత్సవ ఎడిషన్ అనేది మా సెలబ్రేటరీ సమర్పణ, ఇది సామర్థ్యం గల జీప్ కంపాస్‌ను మరింత ప్రత్యేకమైనదిగా మారుస్తుంది" అని చెప్పారు.

జీప్ కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల.. ధర కేవలం రూ.24.44 లక్షలు మాత్రమే..!

జీప్ కంపాస్ లో మరింత ఆఫ్-రోడ్ వెర్షన్ ను కోరుకునే వారి కోసం కంపనీ ఇందులో జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ (2022 Jeep Compass Trailhawk) ఎడిషన్ ను కూడా విక్రయిస్తోంది. ఈ ఏడాది మార్చ్ నెలలో విడుదల చేయబడిన ఈ ఆప్-రోడ్ వెర్షన్ జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ప్రారంభ ధర రూ. 30.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్‌లు, విభిన్నమైన ఫ్రంట్ గ్రిల్‌, షార్ప్‌గా కనిపించే బంపర్‌లు, సరికొత్త బోనెట్ డెకాల్ (బానెట్ పై స్టిక్కర్), 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, 225/65 R17 సెక్షన్ టైర్లు, రియర్ రెడ్ హుక్, స్కఫ్ ప్లేట్ మరియు ఫెండర్‌లపై కొత్త ట్రయల్ రేటింగ్ బ్యాడ్జ్ మార్పులు ఉన్నాయి.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep india launches compass anniversay edition price features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X