మే 19న జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ విడుదల, డీటేల్స్

అమెరికన్ కార్ కంపెనీ జీప్ (Jeep) నుండి భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7-సీటర్ ఎస్‌యూవీ జీప్ మెరిడియన్ (Jeep Meridian) ను కంపెనీ మే 19వ తేదీన దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జీప్ కంపాస్ (Jeep Compass) 5-సీటర్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఈ పెద్ద ఎస్‌యూవీ మరో రెండు రోజుల్లో కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది. జీప్ కంపాస్ తో పోలిస్తే, జీప్ మెరిడియన్ పెద్దదిగా ఉంటుంది మరియు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

మే 19న జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ విడుదల, డీటేల్స్

జీప్ మెరిడియన్ ఫియట్ యొక్క 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ టర్బో డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ గేర్‌బాక్స్‌లు కస్టమర్ ఎంపిక చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఇంజన్ నుంచి వచ్చే శక్తిని ముందు చక్రాలకు గానీ లేదా నాలుగు చక్రాలకు గానీ పంపిణీ చేస్తుంది.

మే 19న జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ విడుదల, డీటేల్స్

మెరిడియన్ లోని ఈ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా స్టాండర్డ్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD) తో లభిస్తాయి. ఆసక్తిగల కస్టమర్ల కోసం ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ (AWD) కూడా ఉంటుంది. కాకపోతే, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో మాత్రమే అందించబడుతుందని సమాచారం. ఇక, పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, జీప్ మెరిడియన్ కేవలం 10.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు గరిష్టంగా గంటకు గంటకు 198 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది.

మే 19న జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ విడుదల, డీటేల్స్

జీప్ కంపాస్ తో పోలిస్తే జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ కాస్తంత ఎత్తుగా మరియు వెడల్పుగా డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ 7-సీటర్ ఎస్‌యూవీ కొలతలను గమనిస్తే, ఇది 4,769 మిమీ పొడవు, 1,859 మిమీ వెడల్పు మరియు 1,682 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. అంతే కాకూండా దీని వీల్‌బేస్ 2,794 మిమీగా ఉంటుంది. ఈ కొలతలను జీప్ కంపాస్ తో పోల్చిచూసినప్పుడు, కంపాస్ కంటే మెరిడియన్ 364 మిమీ ఎక్కువ పొడవు, 41 మిమీ ఎక్కువ వెడల్పు మరియు 42 మిమీ ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది.

మే 19న జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ విడుదల, డీటేల్స్

కొత్త జీప్ మెరిడియన్ యొక్క వీల్‌బేస్ జీప్ కంపాస్ కంటే 158 మిమీ పొడవుగా ఉంది, ఫలితంగా ఇందులో వెనుకవైపు అదనపు వరుస సీట్లకు మరింత లెగ్ రూమ్ ను అందించడంలో సహాయపడుతుంది. అయితే, ఈ మూడవ వరుస సీట్ల కారణంగా వెనుకవైపు ఉన్న బూట్ స్పేస్ కేవలం 233 లీటర్లకు తగ్గిపోయింది. అదనపు స్టోరేజ్ స్పేస్ కావాలనుకుంటే, మధ్య మరియు వెనుక వరుసలలోని సీట్లను మడవటం ద్వారా, ఈ ఎస్‌యూవీ యొక్క బూట్ స్పేస్ ను 1,760 లీటర్లకు పెంచుకోవచ్చు.

మే 19న జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ విడుదల, డీటేల్స్

జీప్ మెరిడియన్ డిజైన్ చూడటానికి పెద్ద గ్రాండ్ చెరోకీ ఎస్‌యూవీ నుండి ప్రేరణ పొందిన కొన్ని ముఖ్యాంశాలతో కంపాస్ మాదిరిగానే కనిపిస్తుంది. జీప్ మెరిడియన్ ముందు భాగంలో సన్నగా కనిపించే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు ఉంటాయి, ఇవి కంపాస్‌లో ఉన్న వాటితో పోలిస్తే చాలా సొగసైనవిగా కనిపిస్తాయి. జీప్ కంపాస్ ఎస్‌యూవీతో పోలిస్తే, జీప్ మెరిడియన్ యొక్క హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫ్రంట్ గ్రిల్ పూర్తిగా విభిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే, దీని ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు కూడా రీడిజైన్ చేయబడి ఉంటాయి.

మే 19న జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ విడుదల, డీటేల్స్

మెరిడియన్ ముందు బాగంలో పెద్ద క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది, ఇది ఫాగ్ ల్యాంప్స్ రెండింటినీ ఒకదానితో ఒకటి కలుపుతూ దాని మొత్తం వెడల్పులో నడుస్తున్నట్లుగా ఉంటుంది. సైడ్ సిల్స్ మరియు వీల్ ఆర్చ్‌లతో పాటు ముందు మరియు వెనుక బంపర్‌ల దిగువ విభాగం బ్లాక్ క్లాడింగ్‌తో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఈ క్లాడింగ్ ఎస్‌యూవీకి రగ్గడ్ లుక్ ని అందిస్తుంది. అలాగే సైడ్స్ లో 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక వైపున టెయిల్ లైట్లు గ్రాండ్ చెరోకీ మోడల్ లో కనిపించే వాటి నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లుగా అనిపిస్తాయి.

మే 19న జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ విడుదల, డీటేల్స్

ఇక ఈ ఎస్‌యూవీలోని ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, పవర్డ్ లిఫ్ట్‌గేట్, వెనుక సీట్లలోని ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్స్ మరియు చార్జింగ్ పోర్ట్స్, విశాలమైన లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మే 19న జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ విడుదల, డీటేల్స్

అలాగే, సేఫ్టీ విషయానికి వస్తే, జీప్ మెరిడియన్ ఎస్‌యూవీలో కంపెనీ ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ (TC), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), అబ్‌స్టాకిల్ డిటెక్షన్ మరియు యాంటీ పించ్ సెన్సింగ్ సేఫ్టీ విండోస్ మొదలైన ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఇది ఈ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్, ఎమ్‌జి గ్లోస్టర్, మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4 మరియు కియా కార్నివాల్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep india to launch meridian 7 seater suv on 19th may 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X