భారత మార్కెట్లో జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ విడుదల; ధర కేవలం రూ.29.90 లక్షలు మాత్రమే!

అమెరికన్ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో తమ 7-సీటర్ ఎస్‌యూవీ (Jeep Meridian) ను విడుదల చేసింది. భారత మార్కెట్లో జీప్ మెరిడియన్ ధరలు కేవలం రూ. 29.9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండే ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. జీప్ మెరిడియన్ మొత్తం ఐదు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.36.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. జీప్ మెరిడియన్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్ లు జరుగుతుండగా, వచ్చే నెలలో దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

భారత మార్కెట్లో జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ విడుదల; ధర కేవలం రూ.29.90 లక్షలు మాత్రమే!

Jeep Meridian - వేరియంట్లు, ధరలు

ఇదివరకు చెప్పుకున్నట్లుగా జీప్ మెరిడియన్ మొత్తం ఐదు వేరియంట్లలో విడుదల చేయబడింది. వీటిలో నాలుగు వేరియంట్లు ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో అందించబడుతుండగా, ఒక్క వేరియంట్ (టాప్-ఎండ్) మాత్రం ఆల్-వీల్ డ్రైవ్ తో అందించబడుతోంది. కంపెనీ ఇందులో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆఫ్షన్లను అందిస్తోంది. మార్కెట్లో కొత్త జీప్ మెరిడియన్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 29.90 లక్షల నుండి రూ. 32.40 లక్షల మధ్యలో ఉన్నాయి. వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఉన్నాయి:

- జీప్ మెరిడియన్ లిమిటెడ్ (మ్యాన్యువల్) - రూ.29.90 లక్షలు

- జీప్ మెరిడియన్ లిమిటెడ్ ఆప్షనల్ (మ్యాన్యువల్) - రూ.32.40 లక్షలు

- జీప్ మెరిడియన్ లిమిటెడ్ (ఆటోమేటిక్) - రూ.31.80 లక్షలు

- జీప్ మెరిడియన్ లిమిటెడ్ ఆప్షనల్ (ఆటోమేటిక్) - రూ.34.30 లక్షలు

- జీప్ మెరిడియన్ లిమిటెడ్ ఆప్షనల్ (ఆటోమేటిక్, ఆల్-వీల్ డ్రైవ్) - రూ.36.95 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

భారత మార్కెట్లో జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ విడుదల; ధర కేవలం రూ.29.90 లక్షలు మాత్రమే!

Jeep Meridian - డిజైన్ మరియు ఫీచర్లు

జీప్ ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో విక్రయిస్తున్న 5-సీటర్ కంపాస్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని ఈ 7-సీటర్ జీప్ మెరిడియన్ ఎస్‌యూవీని తయారు చేసింది. కాబట్టి, మొదటి చూపులో ఇది పెద్ద సైజులో ఉండే కంపాస్ మాదిరిగా కనిపిస్తుంది. అయితే, ఈ రెండు మోడళ్లను వేరు చేయడానికి మెరిడియన్ లో కంపెనీ స్వల్ప మార్పులు చేసింది. జీప్ మెరిడియన్ ముందు భాగంలో, ఐకానిక్ జీప్ 7-స్లాట్ గ్రిల్‌ మరియు దానికు ఇరువైపులా ఉండే సొగసైన ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ బంపర్‌లో క్రోమ్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి.

భారత మార్కెట్లో జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ విడుదల; ధర కేవలం రూ.29.90 లక్షలు మాత్రమే!

జీప్ మెరిడియన్‌కు మరింత పటిష్టమైన రూపాన్ని అందించడానికి బలమైన ఫ్రంట్ బంపర్, వీల్ ఆర్చ్‌లు, సైడ్ సిల్స్ మరియు బ్లాక్ క్లాడింగ్‌ వంటి అంశాలు ఉన్నాయి. జీప్ మెరిడియన్ లో కొత్త 18 ఇంచ్ అల్లాయ్ అల్లాయ్ వీల్స్‌ ని ఉపయోగించారు. వెనుక భాగంలో ఆకర్షణీయమైన రియర్ బంపర్, సొగసైన ఎల్ఈడి టెయిల్‌లైట్‌లు ఉంటాయి, ఇవి ఇవి పెద్ద గ్రాండ్ చెరోకీ ఎస్‌యూవీ నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లుగా అనిపిస్తాయి.

భారత మార్కెట్లో జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ విడుదల; ధర కేవలం రూ.29.90 లక్షలు మాత్రమే!

ఇక ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, జీప్ మెరిడియన్ లోపలి భాగంలో ఎమ్పరడార్ బ్రౌన్ అప్‌హోలెస్ట్రీతో కవర్ చేయబడిన ఇంటీరియర్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. డాష్‌బోర్డులో అనేక ఎలిమెంట్స్ ఉంటాయి. వీటిలో 10.25 ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ప్రధానంగా కనిపిస్తాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఆల్పైన్ ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.

Meridian Price
Limited MT FWD ₹29,90,000
Limited (O) MT FWD ₹32,40,000
Limited 9AT FWD ₹31,80,000
Limited (O) 9AT FWD ₹34,30,000
Limited (O) 9AT 4X4 ₹36,95,000
భారత మార్కెట్లో జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ విడుదల; ధర కేవలం రూ.29.90 లక్షలు మాత్రమే!

Jeep Meridian - ఇంజన్

జీప్ మెరిడియన్ స్టెల్లాంటిస్ గ్రూప్ యొక్క 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ మల్టీఎయిర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 168 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750 - 2,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త జీప్ మెరిడియన్ ARAI ధృవీకరించబడిన దాని ప్రకారం లీటరుకు 16.2 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్ వీల్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్లో జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ విడుదల; ధర కేవలం రూ.29.90 లక్షలు మాత్రమే!

Jeep Meridian - కొలతలు

కొత్త జీప్ మెరిడియన్ కొలతలను గమనిస్తే, ఈ 7-సీటర్ ఎస్‌యూవీ మొత్తం 4,769 మిమీ పొడవును, 1,859 మిమీ వెడల్పును మరియు 1,682 మిమీ ఎత్తును కలిగి ఉండి, 2,636 మిమీ వీల్‌బేస్ ను కలిగి ఉంటుంది. జీప్ మెరిడియన్ ఒక పెద్ద సైజు మూడు వరుసల ఎస్‌యూవీ. ఈ కారులో మొత్తం ఏడుగురు రైడర్లు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు 170 లీటర్ల బూట్ స్పేస్‌ లభిస్తుంది. మరింత ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటే, మూడవ వరుస సీట్లను ఫోల్డ్ చేయడం ద్వారా 481 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

భారత మార్కెట్లో జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ విడుదల; ధర కేవలం రూ.29.90 లక్షలు మాత్రమే!

Jeep Meridian - సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ విషయానికి వస్తే, జీప్ మెరిడియన్ ఎస్‌యూవీలో ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూష్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) మరియు 360-డిగ్రీ కెమెరాతో సహా 60 కి పైగాసేఫ్టీ ఫీచర్‌ లు ఉన్నాయి.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep meridian 7 seater suv launched in india price starts from rs 29 90 lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X