ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి 60 కొత్త మెరిడియన్ ఎస్‌యువిలను డెలివరీ చేసిన జీప్: ఎక్కడో తెలుసా?

అమెరికన్ కార్ తయారీ సంస్థ 'జీప్' (Jeep) గత నెలలో భారత మార్కెట్లో కొత్త 'మెరిడియన్' (Meridian) ఎస్‌యువిని విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశీయ మార్కెట్లో ఈ ఎస్‌యువి విడుదలకాకముందే కంపెనీ బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. ఇటీవల డెలివరీలను కూడా ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఏకంగా ఒక మెగా డెలివరీకి శ్రీకారం చుట్టింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒకటి.. రెండు కాదు: ఒకేసారి 60 కొత్త మెరిడియన్ ఎస్‌యువిలను డెలివరీ చేసిన జీప్: ఎక్కడో తెలుసా?

నివేదికల ప్రకారం.. జీప్ కంపెనీ దేశీయ మార్కెట్లో మంచి బుకింగ్స్ అందుకున్నట్లు తెలిసింది. అయితే ఇటీవల దేశ రాజధాని నగరం ఢిల్లీ NCR లో ఒకటి, రెండు కాదు ఒక్కసారిగా 60 జీప్ మెరిడియన్ ఎస్‌యువిలను డెలివరీ చేసింది. ఢిల్లీలోని ల్యాండ్ మార్క్ డీలర్షిప్ లో ఈ మెగా డెలివరీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను సుమిత్ ఠాకూర్ షేర్ చేశారు.

ఒకటి.. రెండు కాదు: ఒకేసారి 60 కొత్త మెరిడియన్ ఎస్‌యువిలను డెలివరీ చేసిన జీప్: ఎక్కడో తెలుసా?

ఈ వీడియోలో జీప్ డెలివరీలను మాత్రమే కాకుండా.. డాక్యుమెంట్ వర్క్ పూర్తి చేయడం మరియు ఇతర సంభాషణలు జరగటం చూడవచ్చు. ఇందులో జీప్ మెరిడియన్ ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు మొదలైన ప్రశ్నలు అడగటం, కస్టమర్లు దానికి సమాధానం చెప్పడం వంటివి కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

ఒకటి.. రెండు కాదు: ఒకేసారి 60 కొత్త మెరిడియన్ ఎస్‌యువిలను డెలివరీ చేసిన జీప్: ఎక్కడో తెలుసా?

కొత్త జీప్ మెరిడియన్ అనేది ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన 7 సీటర్ ఎస్‌యువి. జీప్ మెరిడియన్‌ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని బేస్ మోడల్ యొక్క ప్రారంభ ధర రూ. 29.90 లక్షలు (జీప్ మెరిడియన్ లిమిటెడ్, మ్యాన్యువల్). ఇక టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. రూ.36.95 లక్షలు (జీప్ మెరిడియన్ లిమిటెడ్ ఆప్షనల్, ఆటోమేటిక్, ఆల్-వీల్ డ్రైవ్). (ధరలు ఎక్స్-షోరూమ్ ఇండియా).

ఒకటి.. రెండు కాదు: ఒకేసారి 60 కొత్త మెరిడియన్ ఎస్‌యువిలను డెలివరీ చేసిన జీప్: ఎక్కడో తెలుసా?

కొత్త జీప్ మెరిడియన్ 7 సీటర్ అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది 7-స్లాట్ గ్రిల్‌ కలిగి దానికి రెండువైపులా సొగసైన ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. ఫ్రంట్ బంపర్‌లో క్రోమ్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా దీని ఆకర్షణను మరింత పెంచుతాయి. వీటితో పాటు ఫ్రంట్ బంపర్, వీల్ ఆర్చ్‌లు మరియు బ్లాక్ క్లాడింగ్‌ వంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

ఒకటి.. రెండు కాదు: ఒకేసారి 60 కొత్త మెరిడియన్ ఎస్‌యువిలను డెలివరీ చేసిన జీప్: ఎక్కడో తెలుసా?

మెరిడియన్ సైడ్ ప్రొఫైల్ లో కొత్త 18 ఇంచ్ అల్లాయ్ అల్లాయ్ వీల్స్‌ చూడవచ్చు. వెనుక భాగంలో రియర్ బంపర్, సొగసైన ఎల్ఈడి టెయిల్‌లైట్స్ వంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద కంపెనీ యొక్క ఈ 7 సీటర్ మంచి డిజైన్ పొందుతుంది. కావున చూడగానే కస్టమర్లను ఆకర్శించేవిధంగా ఉంది.

ఒకటి.. రెండు కాదు: ఒకేసారి 60 కొత్త మెరిడియన్ ఎస్‌యువిలను డెలివరీ చేసిన జీప్: ఎక్కడో తెలుసా?

2022 జీప్ మెరిడియన్ 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇది ఆల్పైన్ ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులోని ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉన్నాయి.

ఒకటి.. రెండు కాదు: ఒకేసారి 60 కొత్త మెరిడియన్ ఎస్‌యువిలను డెలివరీ చేసిన జీప్: ఎక్కడో తెలుసా?

జీప్ మెరిడియన్ చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కావున దీని పరిమాణం విషయానికి వస్తే, ఈ ఎస్‌యువి పొడవు 4,769 మిమీ, వెడల్పు 1,859 మిమీ, ఎత్తు 1,682 మిమీ ఉంటుంది. అదే విధంగా వీల్‌బేస్ పరిమాణం 2,636 మిమీ కాగా, బూట్ స్పేస్ 170 లీటర్స్ వరకు ఉంటుంది. మరింత ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటే మూడవ వరుస సీట్లను ఫోల్డ్ చేయవచ్చు. తద్వారా మీరు 481 లీటర్ల బూట్ స్పేస్ పపొందవచ్చు. ఇందులో ఎక్కువ లగేజ్ ఉంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇక ఇంజిన్ మరియు మైలేజ్ వంటి విషయాలను గమనిస్తే, మెరిడియన్ 7 సీటర్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ మల్టీఎయిర్ డీజిల్ ఇంజన్‌ కలిగి ఉండి, 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 168 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 - 2,500 ఆర్‌పిఎమ్ మధ్య 350 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

జీప్ మెరిడియన్ ఫ్రంట్ వీల్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఏఆర్ఏఐ ద్రువీకరించినదాని ప్రకారం ఒక లీటరుకు 16.2 కిలోమీటర్లు అందిస్తుందని తెలిసింది. అయితే వాస్తవ ప్రపంచంలో మైలేజ్ గణాంకాలు కొంత మారే అవకాశం ఉంటుంది.

ఒకటి.. రెండు కాదు: ఒకేసారి 60 కొత్త మెరిడియన్ ఎస్‌యువిలను డెలివరీ చేసిన జీప్: ఎక్కడో తెలుసా?

కొత్త జీప్ మెరిడియన 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు దాదాపు 60 కి పైగా భద్రతా ఫీచర్స్ ఉన్నాయి. కావున ఇందులో సేఫ్టీకి ఏ లోటు లేదు అనే ఖచ్చితంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఇటీవల విడుదలైన కొత్త జీప్ మెరిడియన్ డిజైన్ పరంగా గానీ, ఫీచర్స్ పరంగా గానీ, ఇంజిన్ స్పెసిఫికేషన్ పరంగా గానీ ఎందులోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ ఎస్‌యువి కొనుగోలుచేయడానికి ఎగబడుతున్నారు.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep meridian mega delivery dealership delivered 60 units of the car details
Story first published: Thursday, June 30, 2022, 17:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X