విడుదలకుముందే 'మెరిడియన్' బుకింగ్స్ ప్రారంభించి జీప్: వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ జీప్ (Jeep) భారతీయ మార్కెట్లో తన కొత్త తన కొత్త జీప్ మెరిడియన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే కంపెనీ ఈ రోజు నుంచి అధికారికంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ ఆధునిక SUV కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు జీప్ కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా కంపెనీ డీలర్‌షిప్‌ని సందర్శించి ముందస్తుగా రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

విడుదలకుముందే మెరిడియన్ బుకింగ్స్ ప్రారంభించి జీప్: వివరాలు

కంపెనీ ఇప్పుడు ఈ SUV యొక్క ఉత్పత్తిని తన రంజన్‌గావ్ ప్లాంట్‌లో ప్రారంభించింది. డెలివరీలు 2022 జూన్ మూడవ వారం నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ SUV యొక్క ధరలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. లాంచ్ సమయంలో ఈ SUV యొక్క ధర తెలుస్తుంది.

విడుదలకుముందే మెరిడియన్ బుకింగ్స్ ప్రారంభించి జీప్: వివరాలు

త్వరలో భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయనున్న కొత్త 'జీప్ మెరిడియన్' లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ కొత్త SUV కి మరింత ఆధునిక రూపాన్ని అందించడానికి చాల చోట్ల క్రోమ్ ఉపయోగించబడింది. దీని డిజైన్ దాదాపుగా కంపాస్‌ను గుర్తుకు తెస్తుంది. కానీ దీని వెనుక భాగం మాత్రం చాలా ఆధునిక డిజైన్ పొందుతుంది.

విడుదలకుముందే మెరిడియన్ బుకింగ్స్ ప్రారంభించి జీప్: వివరాలు

అంతే కాకూండా కంపెనీ ఈ SUV లో 7 స్లాట్ సిగ్నేచర్ గ్రిల్, ఎల్ఈడీ డిఆర్ఎల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటిని అందిస్తుంది. ఇక సైడ్ ప్రొఫైల్ 18-ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

విడుదలకుముందే మెరిడియన్ బుకింగ్స్ ప్రారంభించి జీప్: వివరాలు

జీప్ మెరిడియన్ లో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు పవర్డ్ లిఫ్ట్‌గేట్ వంటివి ఉన్నాయి. ఇది డ్యూయల్ టోన్ ఇంటీరియర్ పొందుతుంది. డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ మరియు డోర్ ప్యానెల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్‌ ఉంటాయి. అయితే సీట్లు బ్రౌన్ కలర్‌లో ఉంటాయి.

విడుదలకుముందే మెరిడియన్ బుకింగ్స్ ప్రారంభించి జీప్: వివరాలు

ఈ కొత్త SUV 7 సీటర్ కావున రెండవ మరియు మూడవ వరుస సీట్లు కలిగి ప్రయాణికులకు అనుకూలంగా ఉంటాయి. ఇది క్యాబిన్ కలిగి ఉండటమే కాకుండా, లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ అన్నీ కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయి. ఇందులో మూడవ వరుస సీట్లకు వెళ్ళడానికి రెండవ వరుస సీట్లను ఫోల్డ్ చేయవచ్చు. అంతే కాకుండా మూడవ వరుస సీట్లను పూర్తిగా ఫోల్డ్ చేయవచ్చు, కానీ రెండవ వరుస సీట్లను 60:40 నిష్పత్తిలో ఫోల్డ్ చేయవచ్చు. వెనుక వుండే ప్రయాణికుల కోసం ఎయిర్ బ్లోవర్ మరియు కప్ హోల్డర్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.

విడుదలకుముందే మెరిడియన్ బుకింగ్స్ ప్రారంభించి జీప్: వివరాలు

జీప్ మెరిడియన్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,769 మిమీ, వెడల్పు 1,859 మిమీ, ఎత్తు 1,682 మిమీ మరియు వీల్‌బేస్ 2,794 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

విడుదలకుముందే మెరిడియన్ బుకింగ్స్ ప్రారంభించి జీప్: వివరాలు

ఇక ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ట్రాక్షన్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు రియర్ కెమెరా వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

విడుదలకుముందే మెరిడియన్ బుకింగ్స్ ప్రారంభించి జీప్: వివరాలు

జీప్ మెరిడియన్ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ మల్టీజెట్ టర్బో డీజిల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

జీప్ మెరిడియన్ కేవలం 10.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్ట వేగం గంటకు 198 కిమీ.భారతీయ మార్కెట్లో జీప్ మెరిడియన్ టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్ మరియు ఎంజి గ్లోస్టర్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep meridian suv booking open production starts at ranjangaon plant details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X