Just In
- 30 min ago
ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!
- 1 hr ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 1 hr ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 3 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
Don't Miss
- Sports
హార్దిక్ పాండ్యా ఉంటే ఇండియా వేరే లెవెల్ టీం.. పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తిన లాన్స్ క్లూసెనర్
- Technology
Reliance నుంచి Jio 5G Phone ..! ధర & స్పెసిఫికేషన్లు వివరాలు
- Finance
Srilanka crisis: ప్రజలకు లంకంత కష్టం.. కిలో చికెన్ రూ.1,200, ఒక్కో గుడ్డు రూ.62.. ఎందుకంటే..
- Lifestyle
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
- Movies
Macherla Niyojakavargam day 4 collections: మాస్ ఇమేజ్ తో నితిన్ పోరాటం.. తట్టుకున్నాడు కానీ?
- News
ఆంధ్రప్రదేశ్ వైపు అదానీ అడుగులు... వెల్లడించిన సీఎం జగన్
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
సాధారణంగా మనం అప్పుడప్పుడు సెలబ్రెటీలు లేదా ఇతర ప్రముఖులు సన్నిహితులకు ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం గురించి మరియు పొందటం గురించి చాలా చదివే ఉన్నాం. ఇందులో భాగంగానే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ 'కార్తీక్ ఆర్యన్' ఏకంగా రూ. 3.73 కోట్ల ఖరీదైన కారుని గిఫ్ట్ గా పొందాడు. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

బాలీవుడ్ ప్రపంచంలో ప్రఖ్యాత నటుడిగా గుర్తింపు పొందిన 'కార్తీక్ ఆర్యన్' కి ఖరీదైన బైకులు లేదా కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే యితడు చాలా ఖరీదైన లగ్జరీ వాహనాలను కలిగి ఉన్నారు. అయితే ఇటీవల అత్యంత ఖరీదైన 'మెక్లారెన్ జిటి' (McLaren GT) సూపర్ కారుని టి-సిరీస్ చైర్పర్సన్ భూషణ్ కుమార్ గిఫ్ట్ గా అందించాడు. ఈ సూపర్ కార్ ధర రూ. 3.73 కోట్లు. ఇటీవల కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా 2 సినిమా భారీ విజయాన్ని సాధించి రూ. 180 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ కారణంగానే కార్తీక్ ఆర్యన్ ఖరీదైన కారు గిఫ్ట్ గా లభించింది.

కార్తీక్ ఆర్యన్ తాను గిఫ్ట్ గా పొందిన ఈ 'మెక్లారెన్ జిటి' (McLaren GT) కారుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ చైనీస్ ఫుడ్ తినడానికి కొత్త టేబుల్ గిఫ్ట్ గా లభించిందని, కష్టానికి ప్రతిఫలం ఇంత ఖరీదైనదిగా ఉంటుందని తానూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. నెక్స్ట్ టైమ్ ప్రైవేట్ జెట్ గిఫ్ట్ ఇవ్వండి సర్ అంటూ రాసాడు. మొత్తానికి కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు ఇండియాలోనే మొట్టమొదటి మెక్లారెన్ జీటీ ఓనర్ అయ్యాడు.

ఇక్కడ కార్తిక్ ఆర్యన్ పొందిన ఈ మెక్లారెన్ జిటి సూపర్ కారు భారతదేశంలో విక్రయించబడిన మొదటి మెక్లారెన్ జిటి. అంతే కాకూండా ఇది భారతదేశంలో విక్రయించబడిన అత్యంత చౌకైన మెక్లారెన్ కారు. ఇది ఆరంజ్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. అదే సమయంలో ఇది బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ వంటివి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

మెక్లారెన్ జిటి సూపర్ కారు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ కలిగి ఉంది. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్ పొందుతుంది. ఇంజిన్ 611 బిహెచ్పి పవర్ మరియు 630 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో పవర్ ఓపెన్ డిఫరెన్షియల్ ద్వారా పవర్ వెనుక చక్రాలకు మళ్లించబడుతుంది. కావున ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది.

మెక్లారెన్ జిటి సూపర్ కారు కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఇది 9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇక దీని గరిష్ట వేగం గంటకు 327 కిలోమీటర్లు. ఇది అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి.

భూషణ్ కుమార్ గిఫ్ట్ గా అందించిన మెక్లారెన్ జిటి ముంబైలోని ఇన్ఫినిటీ కార్స్ నుండి కార్తిక్ ఆర్యన్ కి డెలివరీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇతని వద్ద అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యు 5 సిరీస్ (BMW 5 Series), మినీ కూపర్ ఎస్ కన్వర్టిబుల్ (MINI Cooper S Convertible), పోర్స్చే 718 బాక్స్‌స్టర్ (Porsche 718 Boxster) మరియు లంబోర్ఘిని ఉరస్ క్యాప్సూల్ (Lamborghini Urus Capsule) వంటి వాటిని కలిగి ఉన్నారు.

కార్తిక్ ఆర్యన్ వద్ద ఉన్న లంబోర్ఘిని ఉరస్ క్యాప్సూల్ విషయానికి వస్తే, ఇది గత సంవత్సరం కొనుగోలు చేశారు. దీని ధర రూ. 4.5 కోట్లు. ఇది 4.0-లీటర్ వి8 ఇంజన్‌తో వస్తుంది. ఇది 641 బిహెచ్పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

లంబోర్ఘిని ఉరస్ క్యాప్సూల్ కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు గరిష్టంగా 305 కిలోమీటర్లు. ఈ లంబోర్ఘిని ఉరస్ కారుని జూనియర్ ఎన్టీఆర్ ఆర్ కూడా గోనుగోలు చేశారు. ఇంకా రణబీర్ కపూర్ మొదలైన సెలబ్రెటీలు కూడా ఈ కారుని కలిగి ఉన్నారు.