మహానటి చెంతకు చేరిన జర్మన్ లగ్జరీ కారు.. మీరు కూడా ఓ లుక్కేసెయ్యండి

తెలుగు, తమిళం మరియు మలయాళం చిత్రాలలో నటిస్తూ చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి దాదాపు అందరికి తెలుసు. తెలుగులో 'నేను శైలజ' సినీ అరంగేట్రం చేసిన ఈ అమ్మడు మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

సినిమాలతో అందరి మనసు దోచుకునే ఈ ముద్దుగుమ్మకు కార్లంటే కూడా చాలా ఇష్టం. ఇప్పటికే మినికూపర్ వంటి కార్లు కూడా ఉన్నాయి. అయితే ఈమె ఇటీవల విజయ దశమి సందర్భంగా ఒక కొత్త జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. ఇంతకీ కీర్తి సురేష్ కొనుగోలు చేసిన ఈ కొత్త కారు గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మహానటి చెంతకు చేరిన జర్మన్ లగ్జరీ కారు.. మీరు కూడా ఓ లుక్కేసెయ్యండి

నివేదికల ప్రకారం, నటి కీర్తి సురేష్ జర్మన్ కార్ తయారీ సంస్థ అయిన 'బిఎండబ్ల్యు' (BMW) యొక్క X7 సిరీస్‌ కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో కీర్తి సురేష్ కారుకి పూజ చేయడం చూడవచ్చు.

మహానటి చెంతకు చేరిన జర్మన్ లగ్జరీ కారు.. మీరు కూడా ఓ లుక్కేసెయ్యండి

ఇక్కడ కనిపించే ఈ లేటెస్ట్ X7 కారు బ్లూ కలర్ లో చూడముచ్చటగా ఉంది. BMW X7 సిరీస్‌ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.18 కోట్ల నుండి రూ. 1.78 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కారు.

మహానటి చెంతకు చేరిన జర్మన్ లగ్జరీ కారు.. మీరు కూడా ఓ లుక్కేసెయ్యండి

భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ. ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో లేజర్ హెడ్‌ల్యాంప్‌లు, యాంబియంట్ లైటింగ్ మరియు పానోరమిక్ త్రీ-పీస్ సన్‌రూఫ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 5 జోన్ క్లైమేట్ కంట్రోల్, అటానమస్ పార్కింగ్ మరియు మూడు వరుసలకు రిక్లైనింగ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మహానటి చెంతకు చేరిన జర్మన్ లగ్జరీ కారు.. మీరు కూడా ఓ లుక్కేసెయ్యండి

బిఎండబ్ల్యు ఎక్స్7 లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సరికొత్త iDrive సిస్టమ్‌ వంటి వాటితో పాటు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రిస్టల్-ఎఫెక్ట్ గేర్ లివర్ మరియు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

మహానటి చెంతకు చేరిన జర్మన్ లగ్జరీ కారు.. మీరు కూడా ఓ లుక్కేసెయ్యండి

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎక్స్‌డ్రైవ్ 40ఐ వేరియంట్ లో 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 335 బిహెచ్‌పి పవర్ మరియు 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహానటి చెంతకు చేరిన జర్మన్ లగ్జరీ కారు.. మీరు కూడా ఓ లుక్కేసెయ్యండి

అదే సమయంలో ఎక్స్‌డ్రైవ్30డి వేరియంట్ 3.0 లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ట్విన్-టర్బో డీజల్ ఉంటుంది. ఇది 260 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 8 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటాయి. కావున పనితీరు పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

మహానటి చెంతకు చేరిన జర్మన్ లగ్జరీ కారు.. మీరు కూడా ఓ లుక్కేసెయ్యండి

కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే, ఈమె ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన భోళాశంకర్ లో నటిస్తోంది, అంతే కాకుండా ఎన్టీఆర్ సరసన కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలో మరిన్ని కొత్త సినిమాలతో ప్రేక్షలకులను అలరించబోతోంది.

ఇదిలా ఉండగా ఇటీవల బిత్తిరి సత్తి బ్రిటీష్ లగ్జరీ కార్ రేంజ్ రోవర్ వెలార్‌ కొనుగోలు చేసింది. ప్రస్తుతం, భారత మార్కెట్లో ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ.89.41 లక్షలు (ఎక్స్-షోరూమ్). అన్ని పన్నులు మరియు ఇతర కస్టమైజేషన్లను ఏవైనా ఉంటే అన్ని కలిపి దీని ధర సుమారు కోటి రూపాయల వరకూ ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

మహానటి చెంతకు చేరిన జర్మన్ లగ్జరీ కారు.. మీరు కూడా ఓ లుక్కేసెయ్యండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

విజయదశమి సందర్భంగా సాధారణ ప్రజలు మాత్రమే కాదు సెలబ్రటీలు కూడా కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే కీర్తి సురేష్ ఈ బిఎండబ్ల్యు కారుని కొనుగోలు చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు కొత్త కార్లు మరియు కొత్త బైకులు గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Keerthy suresh bought a new bmw x7 car price and features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X