Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) దేశీయ మార్కెట్లో కోసం కియా కారెన్స్ MPV ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కంపెనీ ఈ MPV ని ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే ఈ కొత్త కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ఇప్పటికే ప్రారంభించింది. ఈ కియా యొక్క ఈ నయా కార్ కావాలనుకునే వారు రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త లేటెస్ట్ MPV 2022 ఫిబ్రవరిలో దేశీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కియా కారెన్స్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటంతో పాటు, మూడు ఇంజన్ల ఎంపికతో పాటు ఐదు వేరియంట్‌లు అదుబీటులోకి రానుంది. కంపెనీ ఈ కొత్త MPV ని 6 మరియు 7 సీట్ల ఎంపికలలో తీసుకురానుంది.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

Kia Carens యొక్క బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే 7,738 యూనిట్ల ప్రీ-లాంచ్ బుకింగ్‌లను అందుకుంది. దీన్ని బట్టి చూస్తే ఈ కొత్త కారుకి దేశీయ విఫణిలో అద్భుతమైన డిమాండ్ ఉందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. కావున రానున్న కాలంలో ఈ MPV మరిన్ని బుకింగ్స్ పొందుతుందని ఆశిస్తున్నాము.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

Kia Carens ఎమ్‌పివి ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇది రూ. 14 లక్షల ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. అదే విధంగా దీని టాప్ వేరియంట్‌ ధర రూ. 20 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ ఈ కొత్త MPV యొక్క డెలివరీలను లాంచ్ తరువాత చేస్తుంది. అయితే ఇప్పటికి దాని ఉత్పత్తి ప్రారంభం గురించి ఎటువంటి సమాచారం అందించలేదు.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ ఎదుర్కొంటున్న సెమికండక్టర్ చిప్ కొరత సమయంలో కంపెనీ ఈ కొత్త MPV యొక్క ఉత్పత్తిని ఎలా నిర్వహిస్తుందో చూడాలి. అయితే రాబోయే రోజుల్లో కంపెనీ దీని ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాము.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

కియా కారెన్స్ 2022 లో విడుదలవుతున్న కంపెనీ యొక్క మొదటి కారు. కొత్త కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఇది గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్‌ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

ఇందులోని స్టీరింగ్ వీల్ కంపెనీ యొక్క సెల్టోస్ మాదిరిగా ఉంటుంది. ఈ స్టీరింగ్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

ఇక కొత్త కియా కారెన్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

Kia నుంచి రానున్న నయా కార్ Carens లాంచ్ ఎప్పుడంటే?

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
Kia carens india launch on february 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X