Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

2022 లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కియా మోటార్స్ యొక్క కొత్త MPV 'కియా కారెన్స్' (Kia Carens). ఇది మార్కెట్లో ఈ (ఫిబ్రవరి) నెలలో విడుదలవుతుంది. కియా సెల్టోస్, సోనెట్ మరియు కార్నివాల్ తర్వాత కియా యొక్క నాల్గవ ఉత్పత్తి ఈ కియా కారెన్స్. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ కంపెనీ యొక్క 'అల్కాజార్‌'కి ప్రత్యర్థిగా ఉంటుంది.

దేశీయ విఫణిలో విడుదల కానున్న ఈ కొత్త కియా కారెన్స్ తన ప్రత్యర్థికి ఎంతవరకు ప్రత్యర్థిగా నిలువగలుగుతుంది, డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ స్పెసిఫికేషన్ వంటి వాటిలో పోలికలు ఎంతవరకు ఉన్నాయి అనే అన్ని విషయాలను గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

కియా కారెన్స్ vs హ్యుందాయ్ అల్కాజార్ - ఫీచర్స్:

త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త కియా కారెన్స్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. అదే విధంగా హ్యుందాయ్ అల్కాజార్ కూడా మంచి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే మొత్తం ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని టాప్ వేరియంట్‌లో 10.25-ఇంచెస్ మెయిన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కోసం వైర్‌లెస్ కనెక్టివిటీ, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

హ్యుందాయ్ ఆల్కాజార్ 6 వేరియంట్లలో అందించబడుతుంది. అవి సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (ఓ), ప్లాటినం మరియు ప్లాటినం (ఓ) అనే వేరియంట్లు. ఇందులో సిగ్నేచర్ ఎస్‌యూవీకి బేస్ వేరియంట్‌ కాగా, ప్లాటినం (ఓ) వేరియంట్ ఇందులో టాప్ వేరియంట్ అవుతుంది.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

హ్యుందాయ్ అల్కాజార్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్, డ్రైవర్ సీటుకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

కియా కారెన్స్ vs హ్యుందాయ్ అల్కాజార్ - ఇంజిన్ ఆప్సన్స్:

కొత్త కియా కారెన్స్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!
Kia Carens Engine Details
1.4T-GDi Petrol Engine
Power 140 ps / 6000 rpm
Torque 242 Nm / 1500-3200 rpm
Transmission 7 DCT / 6 MT
1.5 Petrol Engine
Power 115 ps / 6300 rpm
Torque 144 Nm / 4500 rpm
Transmission 6MT
1.5 CRDi VGT Diesel Engine
Power 115 ps / 4000 rpm
Torque 250 Nm / 1500-2700 rpm
Transmission 6 AT / 6 MT
Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

అల్కాజార్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు రెండవది1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులో ఉన్న 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి మరియు 191 ఎన్ఎమ్ టార్క్అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంటుంది.

ఇక రెండవ ఇంజిన్ అయిన 1.5-లీటర్ డీజిల్ విషయానికి వస్తే, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఉంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి కంఫర్ట్, ఎకో మరియు స్పోర్ట్ మోడ్స్.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!
Hyundai Alcazar Engine Details
2.0-litre petrol engine
Power 159 ps / 6500 rpm
Torque 191 Nm / 4500 rpm
Transmission 6 AT / 6 MT
1.5-litre diesel engine
Power 115 ps / 4000 rpm
Torque 250 Nm / 1500-2750 rpm
Transmission 6 AT / 6 MT
Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

కియా కారెన్స్ vs హ్యుందాయ్ అల్కాజార్ - కొలతలు:

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!
Dimensions Kia Carens Hyundai Alcazar
Length 4,540 mm 4,500 mm
Width 1,800 mm 1,790 mm
Height 1,708 mm 1,675 mm
Wheelbase 2,780 mm 2,760 mm
Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

కొత్త హ్యుందాయ్ అల్కాజార్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవును 4,330 మి.లీ, 1,790 మి.లీ వద్ద కంపెనీ ఉంచగా, వీల్ బేస్ మాత్రం 2,760 మిమీ పొడవు వుంది. ఇది హ్యుందాయ్ క్రెటా కంటే కూడా 150 మిమీ పొడవుగా ఉంటుంది. దీనికి 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ అందుబాటులో ఉంటుంది. కొత్త ఆల్కాజార్ 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టైగా బ్రౌన్, స్టార్రి నైట్, పోలార్ వైట్ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్స్.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్, తేల్చేద్దామా..!!

మొత్తానికి కొత్త కియా కారెన్స్ త్వరలోనే దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఇది హ్యుందాయ్ అల్కాజార్ గట్టి పోటీని ఇస్తుందని ఆశిస్తున్నాము. అయితే దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, ఎంతవరకు ప్రజాదరణ పొందటంలో విజయం సాధిస్తుంది అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి.

Most Read Articles

English summary
Kia carens vs hyundai alcazar design features engine dimension details
Story first published: Tuesday, February 1, 2022, 16:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X