Kia EV6 కి డిమాండ్ మామూలుగా లేదుగా: అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్..

వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కియా ఈవి6 (Kia EV6) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు విడుదలైంది. భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 59.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లో విడుదలచేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే అప్పుడే బుకింగ్స్ అన్నీ పూర్తయినట్లు కంపెనీ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

Kia EV6 కి డిమాండ్ మామూలుగా లేదుగా: అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్..

ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త ఈవి6 బుకింగ్స్ ప్రారంభంలో కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఇవన్నీ అప్పుడే బుక్ చేయబడ్డాయి. అంతే కాకుండా కియా ఈవి6 కోసం 2022 జూన్ 02 నాటికి 355 బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఈవి బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ముందస్తుగా రూ. 10 లక్షలు చెల్లించి డీలర్‌షిప్ నుండి కానీ లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి కానీ బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2022 సెప్టెంబర్ నుండి ప్రారంభయ్యే అవకాశం ఉంది.

Kia EV6 కి డిమాండ్ మామూలుగా లేదుగా: అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్..

కంపెనీ ఈ ఈవి6 ని భారతదేశవ్యాప్తంగా మొత్తం 12 నగరాల్లోని 15 ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచింది. అయితే రానున్న రోజుల్లో కంపెనీ వీటిని మరింత విస్తరించే అవకాశం ఉంది. కియా మోటార్స్ యొక్క ఈవి6 ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. కావున ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Kia EV6 కి డిమాండ్ మామూలుగా లేదుగా: అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్..

కియా ఈవి6 వాలుగా ఉండే రూప్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు పెద్ద రియర్ విండ్‌స్క్రీన్‌ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ స్పోర్టీ అల్లాయ్ వీల్స్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక రియర్ ప్రొఫైల్ లో డ్యూయెల్ టోన్ బంపర్, బూట్ లిప్ స్పాయిలర్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

Kia EV6 కి డిమాండ్ మామూలుగా లేదుగా: అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్..

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యాష్‌బోర్డ్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్‌లో చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులో 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇవి రెండూ కూడా ఒకే ప్యానెల్ లో అమర్చబడి ఉన్నాయి.

Kia EV6 కి డిమాండ్ మామూలుగా లేదుగా: అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్..

ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, డోర్ ప్యానెళ్లపై డ్యూయెల్ టోన్ ఫినిషింగ్స్, 14 స్పీకర్లతో కూడిన మెరీడియన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, స్మార్ట్ పవర్ టైల్ గేట్, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Kia EV6 కి డిమాండ్ మామూలుగా లేదుగా: అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్..

ఇక బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్ వంటి వాటిని గమనిస్తే, ఇందులో 77.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ పైన ఏకంగా 528 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని సర్టిఫైడ్ చేయబడింది. అయితే వాస్తవ ప్రపంచంలో పరిధి తగ్గే అవకాశం ఉంటుంది.

Kia EV6 కి డిమాండ్ మామూలుగా లేదుగా: అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్..

కియా ఈవీ6 జిటి-లైన్ (రియర్ వీల్ డ్రైవ్) వేరియంట్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 229 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. అదేవిధంగా జిటి-లైన్ ఏడబ్ల్యూడి (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్ గరిష్టంగా 325 బిహెచ్‌పి పవర్ మరియు 605 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Kia EV6 కి డిమాండ్ మామూలుగా లేదుగా: అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్..

ఇక బ్యాటరీ ప్యాక్ యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇది 350 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో ఇది 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 73 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు. మొత్తం మీద కియా మోటార్స్ విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు అద్భుతంగా పనిచేస్తుంది అని మాత్రం చెప్పవచ్చు.

Kia EV6 కి డిమాండ్ మామూలుగా లేదుగా: అప్పుడే అన్నీ అమ్ముడైపోయాయ్..

కియా ఈవి6 ఇప్పటికే ANCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేయబడింది. ఇందులో కియా ఈవి6 ఏకంగా 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది.

ANCAP క్రాష్ టెస్ట్ లో కంపెనీ యొక్క ఈ కొత్త కార్ పెద్దల సేఫ్టీ విషయంలో 38 పాయింట్లకు గాను 34.48 పాయింట్స్ స్కోర్ చేసి 5 స్టార్ రేటింగ్ పొందింది. ఇక పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 42.96 పాయింట్స్ స్కోర్ చేసింది. అంతే కాకుండా రోడ్ యూజర్ ప్రొటక్షన్ లో ఇది 64% మరియు సేఫ్టీ అసిస్ట్ ఫీచర్‌లలో 88% రేటింగ్ పొదగలిగింది. మొత్తం మీద వాహన వినియోగదారులకు ఇది అద్భుతమైన సురక్షితమైన వాహనంగా నిలిచింది.

Most Read Articles

English summary
Kia ev6 booked completely deliveries from september 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X