ఎలక్ట్రిక్ కార్లకు సరైన పోటీ అందించే Kia EV6.. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ కైవసం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) భారతీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కియా ఈవి6 (Kia EV6) విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ కూడా 2022 మే 26 న ప్రారభించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇది త్వరలోనే భారతీయ మార్కెట్లో విడుదల కానుంది.

కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త కారు ఇప్పుడు ANCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేయబడింది. ఇందులో కియా ఈవి6 ఏకంగా 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న Kia EV6

భారతదేశంలో కియా ఈవి6 అధికారికంగా విడుదలకాకముందే ANCAP క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్ట్ లో కంపెనీ యొక్క ఈ కొత్త కార్ పెద్దల సేఫ్టీ విషయంలో 38 పాయింట్లకు గాను 34.48 పాయింట్స్ స్కోర్ చేసి 5 స్టార్ రేటింగ్ పొందింది. ఇక పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 42.96 పాయింట్స్ స్కోర్ చేసింది. అంతే కాకుండా రోడ్ యూజర్ ప్రొటక్షన్ లో ఇది 64% మరియు సేఫ్టీ అసిస్ట్ ఫీచర్‌లలో 88% రేటింగ్ పొదగలిగింది. మొత్తం మీద వాహన వినియోగదారులకు ఇది అద్భుతమైన సురక్షితమైన వాహనంగా నిలిచింది.

క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న Kia EV6

కొత్త కియా ఈవి6 క్రాష్ టెస్ట్ గురించి ANCAP వివరిస్తూ.. కియా ఈవి6 ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ పరీక్షలో స్థిరంగా ఉంది. అంతే కాకుండా డ్రైవర్ యొక్క ఛాతీ మరియు దిగువ కాళ్లకు కూడా మంచి ప్రొటక్షన్ అందిస్తుందని తెలిపింది. అదే సమయంలో ముందు ప్రయాణీకుల కాళ్లకు కూడా తగిన రక్షణ లభిస్తుందని తెలిపింది. మొత్తం మీద ముందు ప్రయాణికులకు అన్ని విధాలుగా సురక్షితంగా ఉంటుంది.

క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న Kia EV6

ప్రపంచ మార్కెట్లో కియా కంపెనీ యొక్క ఈ ఈవి6 అందుబాటులో ఉంది. అది కూడా ఇది మొత్తం 5 ట్రిమ్స్ లో అందుబటులో ఉంది. అయితే భారతీయ మార్కెట్లో ఈ ట్రిమ్స్ లో విడుదలవుతుందా లేదా అనేది స్పష్టంగా తెలియదు. అయితే విడుదలైన తరువాత ఇది భారతీయ మార్కెట్లో కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడుతుంది. కావున కొనుగోలుదారులు ముందస్తుగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.

క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న Kia EV6

భారతీయ మార్కెట్లో కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారు రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్సన్స్ తో అందుబటులో ఉండే అవకాశం ఉంది. ఇది 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌లో మాత్రమే ప్రస్తుతం విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇతర వేరియంట్స్ వచ్చే సంవత్సరం మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న Kia EV6

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త ఈవి6 E-GMP గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై తయారుచేయబడింది. కావున ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ తో పాటు మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న Kia EV6

మొదట దీని విషయానికి వస్తే, ఇందులో స్లోపింగ్ రూఫ్, యాంగ్యులర్ రియర్ విండోస్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ స్ట్రిప్ టెయిల్ లైట్ మరియు పెద్ద రియర్ విండ్‌స్క్రీన్‌ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కూడా దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యాష్‌బోర్డ్ మధ్యలో 12.3 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఈ టచ్‌స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి ఫీచర్స్ పొందుతుంది. డ్రైవర్ సమాచారం కోసం ఇన్‌స్ట్రుమెంటేషన్ క్లస్టర్ 12.3 ఇంచ్ ఫుల్ కలర్ టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో బ్యాటరీ రేంజ్, టెంపరేచర్, నావిగేషన్, బ్యాటరీ స్టేటస్ వంటి సమాచారం తెలుస్తుంది.

క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న Kia EV6

ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలైజన్ అవైడెన్స్, బ్లైండ్-స్పాట్ కొలిజన్ అవైడెన్స్ అసిస్ట్, స్టాప్ అండ్ గో ఫంక్షనాలిటీ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. మొత్తం మీద త్వరలో విడుదల కానున్న ఈ ఆధునిక ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తప్పకుండా ముందంజలో పరుగులు తీస్తుందని ఆశిస్తున్నాము.

ఇటీవల మేము కొత్త కియా ఈవి6 టెస్ట్ డ్రైవ్ చేసాము. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Kia ev6 electric car get 5 star safety rating in ancap crash test details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X