భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలైనంత వేగంగా, వాటికి కావలసిన సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి రావడం లేదు. అయితే ఇలాంటి వాటికి చరమగీతం పాడటానికి కియా కంపెనీ ఇప్పుడు భారతదేశంలో 150 కిలోవాట్ సామర్థ్యం కలిగిన అధునాతన డిసి ఫాస్ట్ ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా కియా కంపెనీ, ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగవంతమైన 150 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ ని గురుగ్రామ్‌లోని ధింగ్రా డీలర్‌షిప్‌లో ఏర్పాటు చేసింది. ఈ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కియా ఈవి6 కేవలం 46 నిముషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.

భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రస్తుతం 150 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ భారతదేశంలో కియా కంపెనీ కేవలం ఒకటి మాత్రమే స్థాపించింది. కానీ ఈ నెల చివరి నాటికి లేదా ఆగస్ట్ నెల ప్రారంభం నాటికి దేశం మొత్తం మీద 12 నగరాల్లో మరిన్ని 150 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్‌స్టాల్ చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అంతే కాకుండా కియా కంపెనీ ఆ వైపుకే అడుగులు వేస్తోంది.

భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

కంపెనీ ఈ నెల చివరి నాటికి మరో 12 నగరాల్లో ఈ 150 కిలోవాట్ ఫాస్ట్ డిసి ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్‌స్టాల్ చేస్తే అది వాహన వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కంపెనీ మరిన్ని నగరాల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్‌స్టాల్ చేసే అవకాశం ఉంది.

భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా ఈవి6 అనేది 350 కిలోవాట్ వరకు డిసి ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. కావున దాని స్టాండర్డ్ 22 కిలోవాట్ వాల్ బాక్స్ ఛార్జర్‌కు మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని ద్వారా వాహన వినియోగదారుడు మరింత వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం పొందవచ్చు.

భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఈ 150 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ చేసిన సందర్భంగా కియా మోటార్స్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ Myung-sik Sohn మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి రావడం వల్ల ఎలక్ట్రిక్ కార్ వినియోగదారులు ఛార్జింగ్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. 150 కిలోవాట్ డిసి ఛార్జింగ్ కి సఫోర్ట్ చేసే కార్లు ఈ ఛార్జింగ్ స్టేషన్ లో ఛార్జింగ్ సదుపాయం పొందవచ్చని కూడా అయన అన్నారు.

భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

నిజానికి కియా ఈవి6 కారు 350 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో ఇది 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 73 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన 150 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా కేవలం 46 నిముషాల్లో 0-80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. ఇది 50 కిలోవాట్ డిసి ఛార్జర్ కంటే కూడా వేగవంతంగా ఉంటుంది.

భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

కియా కంపెనీ యొక్క ఈవి6 ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 59.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త ఈవి6 బుకింగ్స్ ప్రారంభంలో కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది.

భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

కియా ఈవి6 లో 77.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ పైన ఏకంగా 528 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని సర్టిఫైడ్ చేయబడింది. కియా ఈవీ6 జిటి-లైన్ (రియర్ వీల్ డ్రైవ్) వేరియంట్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 229 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. అదేవిధంగా జిటి-లైన్ ఏడబ్ల్యూడి (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్ గరిష్టంగా 325 బిహెచ్‌పి పవర్ మరియు 605 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

కియా ఈవి6 కొత్త డిజైన్ కలిగి ఉండటమే కాకుండా 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటిని కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతదేశంలో మొదటి 150 kWh DC ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్: దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

కియా ఈవి6 సేఫ్టీలో ANCAP క్రాష్ టెస్ట్ ద్వారా 5 స్టార్ రేటింగ్ పొందింది. ఇది పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 42.96 పాయింట్స్ మరియు పెద్దల సేఫ్టీ విషయంలో 38 పాయింట్లకు గాను 34.48 పాయింట్స్ స్కోర్ చేసింది. ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు,, యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ మరియు మల్టీ కొలైజన్ బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

Most Read Articles

English summary
Kia india installed first 150 kwh dc fast charger in gurugram
Story first published: Wednesday, July 6, 2022, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X