కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonet X-Line) టీజర్ వెల్లడి.. త్వరలోనే విడుదల కానున్న స్పెషల్ ఎడిషన్!

కొరియన్ కార్ కంపెనీ కియా ఇండియా, తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో మరో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కియా సెల్టోస్‌లో ప్రవేశపెట్టిన ఎక్స్-లైన్ స్పెషల్ ఎడిషన్ మాదిరిగానే కంపెనీ తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ లో కూడా ఎక్స్-లైన్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

Recommended Video

Mahindra Scorpio Classic Launched In TELUGU | Price At Rs 11.99 Lakh | Variants & Features Explained

ఈ నేపథ్యంలో, కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonet X-Line) వేరియంట్‌కు సంబంధించిన ఓ టీజర్‌ను కూడా కంపెనీ వెల్లడి చేసింది. సెల్టోస్ ఎక్స్-లైన్ మాదిరిగానే సోనెట్ ఎక్స్-లైన్ కూడా వెలుపల మరియు లోపల స్పోర్టియర్ డిజైన్ ఎలిమెంట్స్‌తో పాటు కొన్ని అదనపు ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonet X-Line) టీజర్ వెల్లడి.. త్వరలోనే విడుదల కానున్న స్పెషల్ ఎడిషన్!

కియా అనుబంధ సంస్థ హ్యుందాయ్ తమ మోడల్ లైనప్ లో ప్రవేశపెట్టిన ఎన్-లైన్ (Hyundai N-Line) వేరియంట్ల మాదిరిగానే, కియా ఎక్స్-లైన్ (X-Line) వేరియంట్లు అదనపు ఫీచర్లను కలిగి ఉంటాయి. ప్రస్తుతం, కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ కార్లలో ఒకటిగా ఉంది మరియు ప్రతినెలా కంపెనీ అమ్మకాల పెరుగుదలకు కారణం అవుతోంది. అంతేకాకుండా, ఈ కొరియన్ బ్రాండ్ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే 1 లక్ష విక్రయాల మైలురాయిని చేరుకోవడంలో సోనెట్ కీలక పాత్ర పోషించింది.

కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonet X-Line) టీజర్ వెల్లడి.. త్వరలోనే విడుదల కానున్న స్పెషల్ ఎడిషన్!

కియా సోనెట్ ఎక్స్-లైన్ వేరియంట్ విషయానికి వస్తే, కంపెనీ దీనిని కేవలం పరిమిత కాలపు వేరియంట్‌గా కాకుండా, ఈ మోడల్ లైనప్‌లో శాశ్వతంగా ఉండేలా దీనిని విడుదల చేసే అవకాశం ఉంది. కియా ఈ కొత్త వేరియంట్‌ ను ప్రస్తుత టాప్-స్పెక్ జిటిఎక్స్-ప్లస్ (GTX-Plus) ట్రిమ్ ఆధారంగా చేసుకొని తయారు చేయవచ్చని భావిస్తున్నారు. కియా ఇంకా సోనెట్ ఎక్స్-లైన్‌ ను అధికారికంగా బహిర్గతం చేయనందున, ఈ మోడల్ ‌లో ఉండే కలర్ ఆప్షన్ల గురించి ఇంకా ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.

కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonet X-Line) టీజర్ వెల్లడి.. త్వరలోనే విడుదల కానున్న స్పెషల్ ఎడిషన్!

స్టాండర్డ్ వేరియంట్ల కన్నా ప్రత్యేకమైన ఎక్స్-లైన్ వేరియంట్ స్పోర్టీ కలర్ ఆప్షన్స్ మరియు బ్లాక్-అవుట్ రూఫ్‌ ని పొందే అవకాశం ఉంది. కియా సోనెట్ ఎక్స్-లైన్ స్టాండర్డ్ కియా సోనెట్ హెచ్‌టిఎక్స్ వేరియంట్‌పై కొన్ని చిన్న కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో కూడా వస్తుందని సమాచారం. అయితే, ఈ మార్పులు చాలా వరకు కొత్త Kia Sonet X-Line వెలుపలి భాగానికి మాత్రమే పరిమితం చేయబడే అవకాశం ఉంది.

కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonet X-Line) టీజర్ వెల్లడి.. త్వరలోనే విడుదల కానున్న స్పెషల్ ఎడిషన్!

కియా సోనెట్ చిన్న కారే అయినప్పటికీ, ఇది పొడవైన ఫీచర్ లిస్ట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్, కీలెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్లు మరియు మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonet X-Line) టీజర్ వెల్లడి.. త్వరలోనే విడుదల కానున్న స్పెషల్ ఎడిషన్!

సేఫ్టీ విషయానికి వస్తే, కియా సోనెట్ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, బ్రేక్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి స్టాండర్డ్ ఫీచర్లతో పాటుగా మరిన్ని ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonet X-Line) టీజర్ వెల్లడి.. త్వరలోనే విడుదల కానున్న స్పెషల్ ఎడిషన్!

ప్రస్తుతం, మార్కెట్లో కియా సోనెట్ బహుళ ఇంజన్ ఆప్షన్లతో అమ్ముడవుతున్నప్పటికీ, ఇందులో కొత్తగా రాబోయే ఎక్స్-లైన్ వేరియంట్ మాత్రం 118 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందించబడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఇంజన్ క్విక్-షిఫ్టింగ్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది.

కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonet X-Line) టీజర్ వెల్లడి.. త్వరలోనే విడుదల కానున్న స్పెషల్ ఎడిషన్!

ఇదిలా ఉంటే, కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్ ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. సమాచారం ప్రకారం, కియా ఇండియా ఇప్పటికే తమ సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క CNG వెర్షన్‌ను భారత రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది. రాబోయే నెలల్లో కియా ఇండియా లైనప్‌లో కియా సోనెట్ సిఎన్‌జిని చేర్చవచ్చని భావిస్తున్నారు. కియా సోనెట్ ప్రస్తుతం భారత మార్కెట్లో న్యాచురల్ పెట్రోల్, టర్బో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonet X-Line) టీజర్ వెల్లడి.. త్వరలోనే విడుదల కానున్న స్పెషల్ ఎడిషన్!

భారతదేశంలో సిఎన్‌జి కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ తమ సోదర సంస్థ అయిన హ్యుందాయ్ నుండి సిఎన్‌జి టెక్నాలజీని అరువు తెచ్చుకొని, తమ కార్లలో కూడా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌లను అందించే అవకాశం ఉంది. సోనెట్ అప్‌గ్రేడ్ తర్వాత, భారతదేశంలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో వస్తున్న మొదటి కియా కారు ఇదే అవుతుంది. కియా కారెన్స్ లో కూడా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ అందుబాటులోకి రావచ్చనే పుకార్లు వినిపిస్తున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Kia india plans to launch sonet x line special edition teaser out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X