అమ్మకాలలో అదరగొడుతున్న కియా ఇండియా.. సోనెట్ ఎస్‌యూవీకి ఎక్కువ డిమాండ్..

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మే 2022 నెల విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. కియా ఇండియా గడచిన నెలలో మొత్తం 18,718 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గత నెలలో కియా యొక్క లేటెస్ట్ కాంపాక్ట్ సోనెట్ అమ్మకాల పరంగా రాణించింది. మే 2022 నెలలో కియా సోనెట్ అమ్మకాలు 7,899 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈసారి కియా సోనెట్, కంపెనీ యొక్క మిడ్-సైజ్ ఎస్‌యూవీ కియా సెల్టోస్‌ను అమ్మకాల రేసులో ఓడించింది. గత నెలలో కేవలం 5,953 యూనిట్ల కియా సెల్టోస్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

అమ్మకాలలో అదరగొడుతున్న కియా ఇండియా.. సోనెట్ ఎస్‌యూవీకి ఎక్కువ డిమాండ్..

కియా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన కియా కారెన్స్ విషయానికి వస్తే, గత నెలలో ఈ ఎమ్‌పివి అమ్మకాలు 4,612 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇకపోతే, కియా ఇండియా విక్రయిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి కియా కార్నివాల్ గత నెలలో మొత్తం 239 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. కాగా, ఈ సమయంలో కంపెనీ 15 యూనిట్ల కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్లను డిస్‌ప్లే యూనిట్లుగా వివిధ డీలర్‌షిప్‌లకు పంపిణీ చేసినట్లు తెలిపింది.

అమ్మకాలలో అదరగొడుతున్న కియా ఇండియా.. సోనెట్ ఎస్‌యూవీకి ఎక్కువ డిమాండ్..

కియా ఇండియా 2022 సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ఇప్పటి వరకూ 97,796 యూనిట్ల వాహనాలను విక్రయించి, 19 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో, భారత మార్కెట్లో ఇప్పటి వరకూ 4.50 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించడం ద్వారా పెద్ద మైలురాయిని సాధించింది. ఈ మొత్తం అమ్మకాలలో దాదాపు 1.50 లక్షలకు పైగా కియా సోనెట్ కార్లు ఉన్నాయని, ఇది కూడా ఈ కారుకు పెద్ద అచీవ్‌మెంట్ అని కంపెనీ తెలిపింది.

అమ్మకాలలో అదరగొడుతున్న కియా ఇండియా.. సోనెట్ ఎస్‌యూవీకి ఎక్కువ డిమాండ్..

కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ ఈ విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. గత నెలలో మరో బలమైన అమ్మకాల పనితీరుతో కియా అమ్మకాల జోరును కొనసాగించడం పట్ల సంతోషిస్తున్నామని, మొత్తం ఆటోమోటివ్ పరిశ్రమను సప్లయ్ చైన్ ఇబ్బంది పెడుతున్నప్పటికీ, తాము ఇప్పటికే 19 శాతానికి పైగా వృద్ధితో, పరిశ్రమ సగటు వృద్ధి రేటు కన్నా వేగంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

అమ్మకాలలో అదరగొడుతున్న కియా ఇండియా.. సోనెట్ ఎస్‌యూవీకి ఎక్కువ డిమాండ్..

కియా ఇండియా ఇప్పుడు 4.50 లక్షల భారతీయ కుటుంబాలలో భాగంగా ఉందని, తాము దీనిని రికార్డ్ సమయంలో సాధించామని ఆయన చెప్పారు. ఇది కియా కంపెనీపై భారతీయ కస్టమర్ల విశ్వాసానికి పెద్ద నిదర్శనం అని ఆయన అన్నారు. కియా ప్రస్తుతం భారత మార్కెట్లో సోనెట్, సెల్టోస్, కారెన్స్ మరియు కార్నివాల్ అనే నాలుగు యుటిలిటీ వాహనాలను విక్రయిస్తోంది. కాగా, కంపెనీ ఇప్పుడు తమ ఐదవ మోడల్ కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును నేడు మార్కెట్లో విడుదల చేసింది.

అమ్మకాలలో అదరగొడుతున్న కియా ఇండియా.. సోనెట్ ఎస్‌యూవీకి ఎక్కువ డిమాండ్..

భారత మార్కెట్లో కియా ఈవీ6 రెండు వేరియంట్లు, ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

- కియా ఈవీ6 జిటి-లైన్ ఆర్‌డబ్ల్యూడి (GT-Line RWD) - రూ.59.95 లక్షలు

- కియా ఈవీ6 జిటి-లైన్ ఏడబ్ల్యూడి (GT-Line AWD) - రూ.64.95 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

అమ్మకాలలో అదరగొడుతున్న కియా ఇండియా.. సోనెట్ ఎస్‌యూవీకి ఎక్కువ డిమాండ్..

విడుదలకు ముందే అమ్ముడైపోయిన 100 యూనిట్లు

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ విడుదలకు ముందే ప్రీ-బుకింగ్స్ ఓపెన్ చేసింది. మొదటి బ్యాచ్‌లో భాగంగా, కేవలం 100 యూనిట్లకు మాత్రమే బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు కంపెనీ మొదట్లో ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఈ మోడల్ కోసం సుమారు 355 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ కారు ధర ఎంతో తెలియడానికి ముందే మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయింది. అంతేకాకుండా, రెండవ మరియు మూడవ బ్యాచ్ కూడా ఇప్పటికే అమ్మడైపోయినట్లు తెలుస్తోంది. భారత్‌లో కియా ఈవీ6 డెలివరీలు సెప్టెంబర్ 2022 నెల నుండి ప్రారంభం కానున్నాయి.

అమ్మకాలలో అదరగొడుతున్న కియా ఇండియా.. సోనెట్ ఎస్‌యూవీకి ఎక్కువ డిమాండ్..

కొత్త కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP)పై ఆధారపడి తయారు చేశారు. కంపెనీ ఈ కారును పూర్తిగా విదేశాలలో తయారు చేసి, సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇక్కడికి దిగుమతి చేసుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో పవర్‌ఫుల్ 77.4 కిలోవాట్అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తి చార్జ్ పై కియా ఈవీ6 RWD వేరియంట్ 528 కిమీ రేంజ్ ను మరియు AWD వేరియంట్ 506 కిమీ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

అమ్మకాలలో అదరగొడుతున్న కియా ఇండియా.. సోనెట్ ఎస్‌యూవీకి ఎక్కువ డిమాండ్..

ఈ కారులో వేగన్ లెదర్ అప్‌హోలెస్ట్రీ, డ్రైవర్ సమాచారం మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం రెండు పెద్ద 12.3 ఇంచ్ డిస్‌ప్లే యూనిట్లు, 14 స్పీకర్లతో కూడిన ప్రీమియ మెరిడియన్ సౌండ్ సిస్టమ్ వంటి కంఫర్ట్ ఫీచర్లతో పాటుగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, EBDతో కూడిన ABS, ESP, లేన్ కీప్ అసిస్ట్ (LKA), లేన్ డిపార్చర్ వార్నింగ్ (LDW), అధునాతన క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఎమర్జెన్సీ లేన్ కీపింగ్ (ELK) అనేక లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Kia india registers 18718 car sales in may 2022 details
Story first published: Thursday, June 2, 2022, 16:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X