స్పీడ్ పెంచిన కియా.. దేశంలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను రిజిస్టర్ చేసిన కొరియన్ బ్రాండ్!

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్, భారతదేశంలో అమ్మకాల పరంగా మరో అరుదైన రికార్డు సాధించింది. కియా ఇప్పటి వరకూ భారతదేశంలోనే అత్యధిక నెలవారీ విక్రయాలను సెప్టెంబర్ 2022 నెలలో నమోదు చేసింది. గడచిన నెలలో కియా దేశీ మార్కెట్లో మొత్తం 25,857 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం, కియా ఇండియా తన ప్రోడక్ట్ లైనప్‌లో కియా సోనెట్, కియా సెల్టోస్, కియా కారెన్స్, కియా కార్నివాల్ మరియు కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది.

స్పీడ్ పెంచిన కియా.. దేశంలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను రిజిస్టర్ చేసిన కొరియన్ బ్రాండ్!

గతేడాది ఇదే సమయంలో (సెప్టెంబర్ 2021 నెలలో) కియా ఇండియా కేవలం 14,441 యూనిట్ల వాహనాలను మాత్రమే విక్రయించగలిగింది. కాగా, గత నెలలో అమ్మకాలు వీటికి అదనంగా 11,416 యూనిట్లు పెరిగి, 79 శాతం వృద్ధిని సాధించాయి. ఇక నెలవారీ అమ్మకాలను గమనిస్తే, గడచిన ఆగస్ట్ 2022 నెలలో కియా అమ్మకాలు 22,322 యూనిట్లుగా ఉంటే, గత నెలలో ఇవి 3,535 యూనిట్లు పెరిగి 15.84 శాతం నెలవారీ వృద్ధిని సాధించాయి. కొత్తగా వచ్చిన కారెన్స్, ఈవీ6 మోడళ్లు కియా అమ్మకాల పెరుగదలలో కీలకంగా వ్యవహరించాయి.

స్పీడ్ పెంచిన కియా.. దేశంలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను రిజిస్టర్ చేసిన కొరియన్ బ్రాండ్!

అదే సమయంలో కియా సెల్టోస్ మరియు సోనెట్ కార్లు కూడా జోరుగానే అమ్ముడయ్యాయి. గత నెలలో అత్యధికంగా కియా సెల్టోస్ 11,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, సోనెట్ విక్రయాలు 9,291 యూనిట్లు మరియు కారెన్స్ అమ్మకాలు 5,233 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కియా కార్నివాల్ అమ్మకాలు కేవలం 404 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది మూడవ త్రైమాసికం నాటికి కంపెనీ మొత్తం అమ్మకాలు 70,201 యూననిట్లుగా నివేదించబడ్డాయి.

స్పీడ్ పెంచిన కియా.. దేశంలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను రిజిస్టర్ చేసిన కొరియన్ బ్రాండ్!

కియా ఇండియా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో సెల్టోస్ మొదటి స్థానంలో ఉండగా, సోనెట్ ద్వితీయ స్థానంలో ఉంది. కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కొత్తగా వచ్చిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టాటా హారియర్ వంటి మోడళ్లకు గట్టిగా పోటీగా నిలుస్తుంది. కాగా, కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

స్పీడ్ పెంచిన కియా.. దేశంలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను రిజిస్టర్ చేసిన కొరియన్ బ్రాండ్!

భారతదేశంలో కియా అమ్మకాలను పెంచడంలో సెల్టోస్ మరియు సోనెట్ మోడళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కాగా, ఇదే సమయంలో కియా కారెన్స్ ఎమ్‌పివి కూడా అత్యధికంగా అమ్ముడవుతోంది. ఈ ఎమ్‌పివి కోసం ఇప్పటికే 50,000 యూనిట్లకు పైగా ఎక్కువ బుకింగ్‌లు నమోదయ్యాయి. భారతదేశంలోని టైర్ 3 నగరాల నుండి కారెన్స్ ఎమ్‌పివి కోసం 21,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో కియా కారెన్స్ జనాదరణ పొందటానికి ప్రధాన కారణం దాని అగ్రెసివ్ ప్రైసింగ్.

స్పీడ్ పెంచిన కియా.. దేశంలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను రిజిస్టర్ చేసిన కొరియన్ బ్రాండ్!

ప్రీమియం డిజైన్, సరసమైన ధర మరియు అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన కియా కారెన్స్ ఈ విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మరియు టొయోటా ఇన్నోవా కస్టమర్లను తన వైపుకు తిప్పుకునేలా చేస్తుంది. ప్రస్తుతం, భారత మార్కెట్లో కియా కారెన్స్ ధరలు రూ. 9.59 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభం అవుతాయి. ఇందులో అన్ని ఫీచర్లతో కూడిన టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 17.49 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంటుంది.

స్పీడ్ పెంచిన కియా.. దేశంలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను రిజిస్టర్ చేసిన కొరియన్ బ్రాండ్!

కియా కారెన్స్ ఎమ్‌పివిలో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కియా యొక్క UVO కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, 8-స్పీకర్లతో కూడిన ప్రీమియం బోస్ ఆడియో సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ముందు భాగంలో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 2వ మరియు 3వ వరుస ప్రయాణికులకు రూఫ్-మౌంటెడ్ ఏసి వెంట్స్, కూల్డ్ కప్ హోల్డర్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు ఫుల్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి.

స్పీడ్ పెంచిన కియా.. దేశంలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను రిజిస్టర్ చేసిన కొరియన్ బ్రాండ్!

సేఫ్టీ విషయానికి వస్తే, కియా కారెన్స్ ఎమ్‌పివిలో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), BAS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ABS, EBD, ISOFIX మౌంట్‌లు, హిల్-హోల్డ్ అసిస్టెన్స్ మరియు ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి ఉన్నాయి. కియా కారెన్స్ మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. బేస్ వేరియంట్లు 1.5-లీటర్ న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మిడ్-రేంజ్ వేరియంట్లలో 1.4-లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 138 బిహెచ్‌పి గరిష్ట శక్తి మరియు 242 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్పీడ్ పెంచిన కియా.. దేశంలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను రిజిస్టర్ చేసిన కొరియన్ బ్రాండ్!

ఇకపోతే, మూడవ ఇంజన్ ఆప్షన్ 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఇది గరిష్టంగా 114 బిహెచ్‌పి శక్తి మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అన్ని ఇంజన్ ఆప్షన్‌లలో ప్రామాణికంగా అందించబడుతుంది. అయితే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మాత్రం కేవలం టర్బోచార్జ్డ్ పవర్‌ట్రైన్‌లతో మాత్రమే అందించబడుతుంది. డీజిల్ ఇంజిన్‌లోని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌ను ఉపయోగిస్తుంది. కాగా, టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తుంది.

Most Read Articles

English summary
Kia india sold 25857 units in september 2022 registering highest ever monthly sales
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X