భారతదేశంలో తిరుగులేని కార్ బ్రాండ్‌గా ఎదుగుతున్న కొరియన్ కంపెనీ 'కియా మోటార్స్'..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్, భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విదేశీ కార్ బ్రాండ్లలో ఒకటిగా నిలుస్తోంది. కియా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేస్తూ, కస్టమర్ల నుండి మంచి ప్రసంశలను అందుకుంటోంది.

Recommended Video

Citroen C3 బుకింగ్స్ స్టార్ట్ | పూర్తి వివరాలు

ఇటీవలి కాలంలో కియా విడుదల చేసిన సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, కారెన్స్ ఎమ్‌పివి మరియు ఈవీ6 ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో విజయవంతమైన మోడళ్లుగా నిలిచాయి. కొత్త మోడళ్ల రాకతో కంపెనీ అమ్మకాలు కూడా జోరందుకున్నాయి.

భారతదేశంలో తిరుగులేని కార్ బ్రాండ్‌గా ఎదుగుతున్న కొరియన్ కంపెనీ 'కియా మోటార్స్'..

కియా ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కంపెనీ గడచిన జూన్ 2022 నెలలో మార్కెట్లో మొత్తం 26,880 కార్లను విక్రయించింది. ఇవి జూన్ 2021 నెలలో కంపెనీ విక్రయించిన 15,015 యూనిట్లతో పోలిస్తే 60 శాతం (9,009 యూనిట్లు) పెరిగాయి. ఈ భారీ వృద్ధి కారణం, కంపెనీ ఇటీవలే విడుదల చేసిన కారెన్స్ ఎమ్‌పివి. గత నెలలో కంపెనీ మొత్తం 7,895 యూనిట్ల కారెన్స్ ఎమ్‌పివి లను విక్రయించింది. దీంతో కియా సెల్టోస్ ఎస్‌యూవీ తర్వాత ఈ బ్రాండ్‌ నుండి అత్యధికంగా అమ్ముడైన రెండవ మోడల్‌ గా కారెన్స్ నిలిచింది.

భారతదేశంలో తిరుగులేని కార్ బ్రాండ్‌గా ఎదుగుతున్న కొరియన్ కంపెనీ 'కియా మోటార్స్'..

కియా జూన్‌ 2022 నెలలో మొతత్ం 8,388 సెల్టోస్ కార్లను విక్రయించగా, 7,455 సోనెట్ కార్లను విక్రయించింది. కియా వార్షిక అమ్మకాలే కాకుండా నెలవారీ అమ్మకాలు కూడా వృద్ధిని సాధించాయి. మే 2022 నెలలో కియా ఇండియా విక్రయించిన 18,718 యూనిట్లతో పోలిస్తే, జూన్ 2022 నెలలో మొత్తం 26,880 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సమయంలో కియా ఇండియా నెలవారీ అమ్మకాలు 28.35 శాతం (5,306 యూనిట్లు) పెరిగాయి.

భారతదేశంలో తిరుగులేని కార్ బ్రాండ్‌గా ఎదుగుతున్న కొరియన్ కంపెనీ 'కియా మోటార్స్'..

జూన్ నెలలో 2022 క్యాలెండర్ సంవత్సరానికి గానూ కియా అప్పుడే 1 లక్ష విక్రయాల మైలురాయిని కూడా అధిగమించింది. దీనికి జూన్ నెల సంఖ్యలను కూడా జోడించినట్లయితే, 2022 ప్రథమార్థంలో కియా దేశీయ విపణిలో మొత్తం 1,21,808 వాహనాలను విక్రయించింది. ఇది గతేడాది (2021) ప్రథమార్థంలో కంపెనీ విక్రయించిన అమ్మకాల సంఖ్యల కంటే దాదాపు 26 శాతం ఎక్కువగా ఉందని కియా ఇండియా పేర్కొంది.

భారతదేశంలో తిరుగులేని కార్ బ్రాండ్‌గా ఎదుగుతున్న కొరియన్ కంపెనీ 'కియా మోటార్స్'..

కియా నుండి వచ్చిన లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ కూడా అమ్మకాల పరంగా అదరగొడుతోంది. సరసమైన ధరలు మరియు అత్యుత్తమమైన ఫీచర్లతో ఇది కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తొలిసారిగా సెప్టెంబర్ 2020లో భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇది భారత మార్కెట్లో ప్రారంభించబడిన 2 సంవత్సరాల లోపే 1.5 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించింది.

భారతదేశంలో తిరుగులేని కార్ బ్రాండ్‌గా ఎదుగుతున్న కొరియన్ కంపెనీ 'కియా మోటార్స్'..

త్వరలో కియా సోనెట్ సిఎన్‌జి (Kia Sonet CNG) విడుదల!

ఇదిలా ఉంటే, కియా తమ సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఇప్పటికే విభిన్నమైన పవర్‌ట్రైన్ ఆప్షన్లను అందిస్తోంది. కాగా, ఇప్పుడు ఇందులో ఓ సిఎన్‌జి వెర్షన్ ను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, కియా ఇండియా ఇప్పుడు తమ సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క CNG వెర్షన్‌ను భారత రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది. రాబోయే నెలల్లో కియా ఇండియా లైనప్‌లో కియా సోనెట్ సిఎన్‌జిని చేర్చవచ్చని భావిస్తున్నారు.

భారతదేశంలో తిరుగులేని కార్ బ్రాండ్‌గా ఎదుగుతున్న కొరియన్ కంపెనీ 'కియా మోటార్స్'..

కియా సోనెట్ ప్రస్తుతం భారత మార్కెట్లో న్యాచురల్ పెట్రోల్, టర్బో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అయితే, దేశంలో సిఎన్‌జి కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ తమ సోదర సంస్థ అయిన హ్యుందాయ్ నుండి సిఎన్‌జి టెక్నాలజీని అరువు తెచ్చుకొని, తమ కార్లలో కూడా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌లను అందించే అవకాశం ఉంది. సోనెట్ అప్‌గ్రేడ్ తర్వాత, భారతదేశంలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో వస్తున్న మొదటి కియా కారు ఇదే అవుతుంది. కియా కారెన్స్ లో కూడా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ అందుబాటులోకి రావచ్చనే పుకార్లు వినిపిస్తున్నాయి.

భారతదేశంలో తిరుగులేని కార్ బ్రాండ్‌గా ఎదుగుతున్న కొరియన్ కంపెనీ 'కియా మోటార్స్'..

భారత్‌లో కియా ఈవీ6 (Kia EV6) ఎలక్ట్రిక్ కారు విడుదల

గడచిన జూన్ 2022 నెలలో కియా మోటార్స్ భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 (Kia EV6) ను విడుదల చేసింది. దేశీయ విపణిలో కియా ఈవీ6 ప్రారంభ ధర రూ.59.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఇది రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇందులో మొదటిది జిటి-లైన్ (GT-Line), ఇది రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో లభిస్తుంది. ఇకపోతే, రెండవది జిటి-లైన్ ఏడబ్ల్యూడి (GT-Line AWD), ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో లభిస్తుంది.

భారతదేశంలో తిరుగులేని కార్ బ్రాండ్‌గా ఎదుగుతున్న కొరియన్ కంపెనీ 'కియా మోటార్స్'..

కియా ఈ రెండు వేరియంట్లను పూర్తిగా విదేశాలలోనే తయారు చేసి, సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయిస్తుంది. ప్రస్తుతం, భారతదేశంలోకి దిగుమతి చేసుకునే విదేశీ కార్లపై దిగుమతి సుంఖాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ కారు ధర కూడా ప్రీమియంగానే అనిపిస్తుంది. అయితే, ఇందుకు ప్రత్యామ్నాయంగా హ్యుందాయ్ ఇదే ప్లాట్‌ఫామ్ ఐయానిక్ 5 అనే కారును తయారు చేస్తోంది. హ్యుందాయ్ ఈ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో అసెంబుల్ చేయనున్న నేపథ్యంలో, ఇది కియా ఈవీ6 కన్నా సరసమైన ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Kia india sold 26880 cars in june 2022 sharp rise by 60 per cent y o y
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X