అమ్మకాల్లో టాప్ లేపుతున్న కియా మోటార్స్: ఇప్పటికే కొత్త రికార్డ్..!!

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్' (Kia Motors) భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కార్ తయారీ సంస్థగా అవతరించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే కేవలం 3 సంవత్సరాల్లో ఏకంగా 5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించి తనకు తానే సాటిగా నిలిచింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

అమ్మకాల్లో టాప్ లేపుతున్న కియా మోటార్స్: ఇప్పటికే కొత్త రికార్డ్..!!

నిజానికి 'కియా ఇండియా' భారతీయ మార్కెట్లో 2019 ఆగస్ట్ నెలలో తన సెల్టోస్ మిడ్-సైజ్ SUV తో అడుగుపెట్టింది. ప్రారంభం నుంచినే కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెల్తూనే ఉంది. అయితే ఇప్పటికి 5 లక్షల కార్లను విక్రయించి అతి తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో కార్లను విక్రయించిన కంపెనీగా కీర్తి గడించింది.

అమ్మకాల్లో టాప్ లేపుతున్న కియా మోటార్స్: ఇప్పటికే కొత్త రికార్డ్..!!

కియా మోటార్స్ యొక్క ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనంతపురం ప్లాంట్ నుండి 6,34,224 వాహనాలను తరలించింది. ఇందులో ఎగుమతి చేయబడిన కార్లు కూడా ఉన్నాయి. కియా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మకాలలో 6 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఇది నిజంగా కంపెనీ యొక్క ఘనత.

అమ్మకాల్లో టాప్ లేపుతున్న కియా మోటార్స్: ఇప్పటికే కొత్త రికార్డ్..!!

మొత్తం అమ్మకాల్లో కియా సెల్టోస్ 59 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. అదే సమయంలో కంపెనీ యొక్క అమ్మకాలు వృద్ధి చెందటానికి కియా సోనెట్ కూడా తన వంతు సహకారం అందిస్తోంది. అయితే కియా ఇండియా యొక్క ప్రీమియం MPV కియా కార్నివాల్ యొక్క మొత్తం అమ్మకాల గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ ఈ MPV కూడా ప్రతి నెలలోనూ కనీసం 400 యూనిట్లకంటే ఎక్కువ విక్రయించబడుతోంది.

అమ్మకాల్లో టాప్ లేపుతున్న కియా మోటార్స్: ఇప్పటికే కొత్త రికార్డ్..!!

కియా కంపెనీ యొక్క సెల్టోస్ తన మిడ్-సైజ్ SUV విభాగంలో తన ఆధిక్యాన్ని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. అదే సమయంలో ఇది దాని కేటగిరీలో 40 శాతం కంటే ఎక్కువ అమ్మకాలను పొందుతోంది.

అదే సమయంలో సబ్-కాంపాక్ట్ SUV విభాగంలో కియా సోనెట్ 15 శాతం వాటాను కలిగి ఉండగా, కియా కారెన్స్ దాని విభాగంలో 18 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. అయితే కియా కారెన్స్ ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ కారుగా రికార్డ్ బద్దలుకొట్టింది.

అమ్మకాల్లో టాప్ లేపుతున్న కియా మోటార్స్: ఇప్పటికే కొత్త రికార్డ్..!!

ఇదిలా ఉండగా కియా కంపెనీ 2022 జూన్ నెలలో కూడా మంచి సంఖ్యలో అమ్మకాలను పొందింది. కియా ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022 జూన్ నెలలో మొత్తం 26,880 కార్లను విక్రయించినట్లు తెలిసింది. ఈ అమ్మకాలు 2021 జూన్ నెల కంటే ఏకంగా 60 శాతం పెరిగాయి. కంపెనీ యొక్క అమ్మకాలు గత నెలలో పెరగడానికి ప్రధాన కారణం కంపెనీ యొక్క కారెన్స్ ఎమ్‌పివి అని తెలుస్తోంది. కియా జూన్‌ 2022 నెలలో 8,388 సెల్టోస్ కార్లను విక్రయించగా, 7,455 సోనెట్ కార్లను విక్రయించింది.

అమ్మకాల్లో టాప్ లేపుతున్న కియా మోటార్స్: ఇప్పటికే కొత్త రికార్డ్..!!

కియా కంపెనీ యొక్క వార్షిక అమ్మకాలే కాకుండా నెలవారీ అమ్మకాలు కూడా వృద్ధిని సాధించాయి. మే 2022 నెలలో కియా ఇండియా విక్రయించిన 18,718 యూనిట్లతో పోలిస్తే, జూన్ 2022 నెలలో మొత్తం 26,880 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సమయంలో కియా ఇండియా నెలవారీ అమ్మకాలు 28.35 శాతం (5,306 యూనిట్లు) పెరిగాయి.

అమ్మకాల్లో టాప్ లేపుతున్న కియా మోటార్స్: ఇప్పటికే కొత్త రికార్డ్..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కియా కంపెనీ యొక్క అన్ని మోడల్స్ కూడా దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా విపరీతమైన అమ్మకాలను చేపడుతున్నాయి. ఈ కారణంగానే కంపెనీ యొక్క అమ్మకాలు ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతూనే ఉన్నాయి. ఈ అమ్మకాలను గమనిస్తే రానున్న రోజుల్లో కూడా కంపెనీ మరిన్ని ఉత్తమమైన అమ్మకాలను పొందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Kia india sold 5 lakh units car in three years details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X